Sridevi Vijaykumar about Sundarakanda
'సుందరకాండ'లో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్
హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
రీఎంట్రీలో కూడా హీరోయిన్ గా వస్తున్నారు ..ఎలా ఫీలవుతున్నారు?
-చాలా హ్యాపీగా ఉంది. ఏ యాక్టర్ కైన మంచి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. ఏదైనా క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇందులో చాలా మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను.
-అన్ని చోట్ల నుంచి చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కొత్త పాయింట్ తో వస్తున్న ప్రాజెక్టు. ఒక ఆడియన్ గా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఫ్రెష్ కంటెంట్. అందరూ థియేటర్ కి వెళ్లి చాలా ఎంజాయ్ చేయొచ్చు.
మీరు సినిమాలకి బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏమిటి?
-నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి ఇంట్లో ముందుగానే ప్లాన్ చేశారు. తర్వాత అమ్మాయి పుట్టింది. అలా సినిమాలకి ఒక బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద చూసుకోవడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
-లాస్ట్ ఇయర్ ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ అయింది. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
-ఇప్పుడు మా అమ్మాయి పెద్దదయింది. మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశం దొరికింది.
సుందరకాండలో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-డైరెక్టర్ గారు ఈ కథ చెప్పగానే షాక్ అయ్యాను. చాలా కొత్త స్క్రిప్ట్
-నా క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. ఇందులో ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.
- ఇందులో ఈ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. అది చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఫోటోలు తీసి దాచుకున్నాను. ఇది ఒక మెమొరబుల్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు.
ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు గమనించారు?
-అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మొత్తం మారిపోయింది. ఇప్పుడు టెక్నికల్ గా ఇంకా ఈజీ అయింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్కింగ్ స్టైల్ మారింది. నాకు అంతా కొత్తగా అనిపించింది.
నారా రోహిత్ గారి గురించి?
-నారా రోహిత్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన చాలా కూల్ ఉంటారు. చాలా మంచి పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.
డైరెక్టర్ వెంకీ గురించి?
- వెంకీ గారికి ఇది మొదటి సినిమా. కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీశారు. ఆయన విజన్ చాలా క్లియర్ గా ఉంది. తనకి ఏం కావాలో క్లారిటీ ఉంది. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు?
-నేను హీరోయిన్ గా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను. అలాగే మా అమ్మగారు తెలుగులో ఎక్కువ వర్క్ చేశారు. మా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాం. నేను ఈశ్వర్ టైంలోనే తెలుగు నేర్చుకున్నాను.
లియోన్ జేమ్స్ మ్యూజిక్ గురించి?
-లియోన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సిద్ శ్రీరామ్ పాడిన పాట నాకు చాలా ఇష్టం. ఇందులో ప్రతి పాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ పాయింట్.
మీరు ఈశ్వర్ టైం లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు హెల్త్ సీక్రెట్ ఏంటి?
-ఆనందంగా ఉండడం. దాంతో పాటు గాడ్ బ్లెస్సింగ్ కూడా అనుకుంటాను. ఈ సినిమా కోసం ఒక నెల రోజులు ముందుగానే డైట్ ప్లాన్ చేశాను.
ప్రభాస్ గారు మీరు ఒకేసారి ఈశ్వర్ సినిమాతో లాంచ్ అయ్యారు.. మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది?
-ఫ్రెండ్షిప్ అలానే వుంది. ప్రభాస్ గారు ఇప్పుడు ఇంకా బిగ్ స్టార్ అయ్యారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికి కూడా ఆయన చిన్నపిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడతారు. ఈశ్వర్ సినిమా సమయంలోనే ఆయన పెద్ద సూపర్ స్టార్ అవుతారని మేమంతా అనుకున్నాం. ఆ సినిమా సక్సెస్ టూర్ కి వెళ్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. మేము ఊహించినదానికంటే ఆయన పెద్ద స్టార్ అయ్యారు. నిజంగా అదొక బ్లెస్సింగ్.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు?
-నాకు అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కథలో మంచి ప్రాధాన్యత వుండే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని భావిస్తున్నాను.