pizza

Nikhil, Bharat Krishnamachari, Pixel Studio’s Most Ambitious Pan World Project Swayambhu Teaser Promises Magnum Opus
'స్వయంభు' చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నిఖిల్

You are at idlebrain.com > news today >

11 February 2026
Hyderabad

Nikhil Siddhartha steps into the biggest chapter of his career with Swayambhu, a massive Pan-World spectacle directed by Bharat Krishnamachari and produced by Bhuvan and Sreekar of Pixel Studios, with Tagore Madhu presenting. Envisioned as an epic period action saga, the film promises larger-than-life scale, high-voltage drama, and a fierce, never-before-seen avatar of Nikhil. The makers have kickstarted promotions with a powerful teaser.

The teaser sets the tone with the mythology of the Sengol- the divine sceptre gifted to Shri Ram by Lord Shiva. Even this sacred symbol faces exile, sparking brutal wars to reclaim it. Kingdoms may fall, but the Sengol remains unconquered. At this crucial juncture emerges the protagonist as a fearless warrior who relies not merely on might, but on unwavering valor. The war for dharma’s resurrection becomes his destiny.

Director Bharat Krishnamachari digs into a lesser-known chapter of history by exploring the Sengol’s ancient origins. He blends Indian history and mythology into a gripping war epic, set in the backdrop of 985 AD. His meticulous detailing, scale, and world-building shine through every frame.

Nikhil Siddhartha appears in his most ferocious and authoritative incarnation yet. With long warrior hair, a curled moustache, rugged beard, and a chiseled physique, he fits the part of a battle-forged hero. The teaser showcases him in intense combat, performing deadly stunts with raw physicality and screen presence.

Samyuktha and Nabha Natesh break away from conventional female roles, appearing in strong, impactful characters. The teaser also reveals glimpses of Subbaraju, Sunil, and others- each seemingly vital to the narrative.

Technically, the film is mounted on a grand canvas. Production designers M Prabhaharan and Raveendra recreate an authentic era of kings, while KK Senthil Kumar’s cinematography lends staggering visual weight. Every frame oozes scale and authenticity. Ravi Basrur’s background score intensifies the drama, and the VFX- handled by top Indian studios, reach Hollywood standards. Dialogues by Vijay Kamisetty pack punch, while the action choreography by King Solomon and Stun Shiva, coupled with Tammiraju’s taut editing, elevate the film to international action benchmarks. The production values are unquestionably top-tier.

Overall, Swayambhu teaser significantly raises expectations. It was screened in 3D format at Prasad’s PCX Theatre in Hyderabad, and those who witnessed it were left spellbound by its sheer visual splendour, immersive depth, and breathtaking scale. With the makers officially confirming a summer release, the excitement has now reached a fever pitch. As the buzz grows stronger with each new reveal, audiences can gear up to witness a towering cinematic magnum opus—one that promises to redefine the period action genre.

The movie is set for Pan world release in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Chinese, Spanish and Arabic languages.

Cast: Nikhil, Samyuktha, Nabha Natesh, Subbaraju, Sunil, etc.

Technical Crew:
Writer, Director: Bharat Krishnamachari
Producers: Bhuvan and Sreekar
Banner: Pixel Studios
Presents: Tagore Madhu
DOP: KK Senthil Kumar
Music: Ravi Basrur
Editor: Tammiraju
Dialogues: Vijay Kamisetty
Production Designers: M Prabhaharan, Raveendar
Action: King Solomon, Stunt Silva
Lyrics: Ramajogayya Sastry

'స్వయంభు' చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా 'స్వయంభు'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు.

టీజర్‌ ‘సెంగోల్’ కథతో ప్రారంభమవుతుంది. శ్రీరాముడికి పరమేశ్వరుడు అందించిన ‘సెంగోల్’ను స్వాధీనం చేసుకునేందుకు జరిగే భీకర యుద్ధాలు కథకు బలమైన నేపథ్యాన్ని అందించాయి. రాజ్యాలు కూలిపోయినా సెంగోల్ మాత్రం అజేయంగా నిలుస్తుంది. ఇలాంటి కీలక సమయంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ముందుకొచ్చే ఓ యోధుడి కథ చూపించడం అద్భుతంగా వుంది.

దర్శకుడు భారత్ కృష్ణమాచారి, సెంగోల్ చరిత్రను ఆధారంగా తీసుకుని భారతీయ చరిత్ర-పౌరాణిక అంశాలను కలిపి 985 AD కాలాన్ని నేపథ్యంగా ఎంచుకోవడం అద్భుతంగా వుంది. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన చూపించిన డీటైలింగ్, భారీ వరల్డ్-బిల్డింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

నిఖిల్ సిద్ధార్థ ఫెరోషియస్ వారియర్ గా అదరగొట్టారు. యుద్ధ వీరుడిగా అద్భుతం అనిపించారు. టీజర్‌లో ఆయన చేసిన వార్ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. సంయుక్త, నభా నటేష్ బలమైన మహిళా పాత్రల్లో కనిపించనున్నారు. సుబ్బరాజు, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.

టెక్నికల్‌గా ఈ చిత్రం టాప్ క్లాస్ లో వుంది. ఆర్ట్ డైరెక్టర్లు ఎం. ప్రభాహరణ్, రవీంద్ర రాజ్యాలని అద్భుతంగా సృష్టించగా, కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు గ్రాండియర్ తీసుకొచ్చింది. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ని మరింత ఎలివేట్ చేయగా, VFX హాలీవుడ్ స్థాయిలో వున్నాయి. విజయ్ కామిశెట్టి డైలాగ్స్, కింగ్ సొలమన్-స్టంట్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అన్ని కలసి సినిమాను ఇంటర్నేషనల్ యాక్షన్ బెంచ్‌మార్క్‌గా నిలబెట్టేలా ఉన్నాయి.

‘స్వయంభు’ టీజర్ అంచనాలను భారీగా పెంచింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ PCX థియేటర్‌లో 3D ఫార్మాట్‌లో ప్రదర్శించిన ఈ టీజర్‌ను చూసినవారు విజువల్ గ్రాండియర్‌కు మెస్మరైజ్ అయ్యారు . సమ్మర్ రిలీజ్‌ను అఫీషియల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. పీరియడ్ యాక్షన్ జానర్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే మాగ్నమ్ ఓపస్‌గా ఇది నిలవనుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను రెండేళ్లు ఎవరికీ కనిపించలేదు. ఆ సమయంలో కూడా మీడియా వారు ఎంతో సపోర్ట్‌ చేశారు. హ్యాపీ డేస్‌ వచ్చి 19 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ అందరూ నాకు సపోర్ట్‌ చేశారు. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా విజయం తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ సినిమా చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి కథని బెస్ట్ టెక్నీషియన్స్ తో చేశాం. సెంథిల్ గారి ఫ్రేం లో కనిపిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఫ్రేమ్ లో నేను కనిపించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చిన మా మధు గారికి థాంక్యూ. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం భువన్, డైరెక్టర్ భరత్. ఈ టీజర్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. కథలో చాలా మలుపులు ఉన్నాయి. ముందు ముందు వచ్చే కంటెంట్ లో మరింత రివిల్ చేస్తాము. త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఈ సినిమా 3D లో రాబోతుంది. మీరందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మనమంతా ఇంత స్వేచ్ఛగా ఉండడం వెనక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అందరూ రాజుల గురించి మాట్లాడతారు కానీ ప్రాణ త్యాగాలు చేసిన వారియర్స్ గురించి మాట్లాడుకోరు. 1000ఏళ్ల క్రితం మన చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉన్నాడు. అతడి కథ ఇది. అల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ. డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేసుకొని ఈ కథను తీసుకొచ్చారు. ఇంతలో నేను ఒక అండర్ డాగ్ గా కనిపిస్తాను. ఓ అండర్ డాగ్ ఏం సాధించాడనేది ఈ సినిమాలో బెస్ట్ విజువల్స్, మ్యూజిక్ తో చూస్తారు. అందరికీ థాంక్యు సో మచ్.

డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మధుగారికి థాంక్యూ. ఒక డెబ్యు దర్శకుడితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నమ్మి నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఆయనకు ధన్యవాదాలు. నిఖిల్ గారు అద్భుతమైన డెడికేషన్ తో పని చేశారు. ఆయన నాపై పెట్టుకుని నమ్మకానికి కృతజ్ఞతలు. పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ద బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా ప్రౌడ్ గా ఉంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ ఫిలిం. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు చూపించే కథ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ కూడా 100% ఎఫర్ట్ పెట్టారు. మధుగారు ఈ సినిమాకి కావలసిన బడ్జెట్ ఎక్కడ రాజీ పడకుండా పెట్టారు. ఇది కేవలం టీజర్ మాత్రమే సినిమా అద్భుతంగా వుంటుంది.

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.‘స్వయంభు’ కోసం దర్శకుడు చాలా రీసెర్చ్‌ చేశారు. ఆయన కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. అందరి అంచనాలకు తగినట్లే భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది.

హీరోయిన్ నభా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. టీం అందరు కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. సినిమా అదిరిపోతుంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. మధుగారు ఇంటి అమ్మాయిలాగా చూసుకున్నారు. ఆయనతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

నటీనటులు: నిఖిల్, సంయుక్త, నభా నటేష్, సుబ్బరాజు, సునీల్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్ మరియు శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
DOP: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ శివ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved