pizza

Newly elected body of Telugu Film Journalists Association (TFJA) meets King Nagarjuna
బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో కింగ్ నాగార్జునను కలిసిన TFJA కమిటీ

You are at idlebrain.com > news today >

30 October 2025
Hyderabad

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కింగ్ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో నాగార్జునను కలిసి అసోసియేషన్ సినీ పాత్రికేయులకు, వారి కుటుంబాలకు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు.

ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని నాగార్జున గారికి వివరించారు.

సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్ జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా నాగార్జున ప్రశంసించారు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని కింగ్ నాగార్జున అన్నారు.

నాగార్జున గారిని కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, వైస్ ప్రెసిడెంట్ వంశీ , ప్రేమ, జాయింట్ సెక్రటరి జీ.వి మరియు కమిటీ మెంబర్స్ ఉన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved