pizza

A Photographer’s Woes… “The Great Pre Wedding Show” Trailer Promises Laughter
ఓ ఫోటోగ్రాఫర్ వెతలు.. నవ్వులు కురిపించేలా 'The Great Pre Wedding Show' ట్రైలర్

You are at idlebrain.com > news today >

29 October 2025
Hyderabad

Pre-wedding shoots are the biggest trend everywhere right now. Couples are ready to spend hefty amounts on them, and social media is flooded with reels related to these shoots. Based on a story woven around this theme, a film trailer has been released. The movie is titled The Great Pre Wedding Show. As the title suggests, the trailer is packed with comedy from start to finish. The dialogues delivered in the Uttarandhra dialect are particularly entertaining.

Thiruveer and Teena Sravya appear as the lead pair, with Thiruveer playing a photographer. For wedding photography or pre-wedding shoots in the entire region, everyone goes to him. One unexpected mistake during a photo shoot leads to a series of troubles, and the trailer shows how these situations unfold humorously. Alongside this plot, the director has neatly showcased how a parallel love story progresses in the middle of all the chaos.

Master Rohan, who impressed audiences with his performance in the #90’s web series, plays another key role. The film is directed by Rahul Srinivas, and produced jointly by Sandeep Agaram and Asmitha Reddy. Music is composed by Suresh Bobbili. The movie is slated to release on November 7.

ఓ ఫోటోగ్రాఫర్ వెతలు.. నవ్వులు కురిపించేలా 'The Great Pre Wedding Show' ట్రైలర్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ట్రెండే నడుస్తుంది. ఆ షూట్స్ కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చించడానికి సైతం కాబోయే జంటలు సిద్ధం అయిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు సంబంధించిన రీల్స్ ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. ఆ కథాంశం చుట్టూ అల్లిన ఓ కథ ఆధారంగా ఓ సినిమా ట్రైలర్ విడుదలయింది. ఆ సినిమా పేరే 'The Great Pre Wedding Show'. ట్రైలర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆద్యంతం హాస్యాన్ని నింపిందనే చెప్పుకోవచ్చు. ఉత్తరాంద్ర యాసలో పలికిన సంభాషణలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

తిరువీర్ మరియు టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా కనిపించబోతున్న ఈ చిత్రంలో ఫోటోగ్రాఫర్ గా తిరువీర్ కనిపించబోతున్నారు. మండలం మొత్తానికీ పెళ్లిళ్ల ఫోటోలు తీయాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీయాలన్నా ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. అలాంటి ఫోటోగ్రాఫర్ కు అనుకోకుండా ఓ ఫోటో షూట్ విషయంలో పొరపాటు జరిగితే, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అవాంతరాలన్నింటినీ హాస్యంగా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ కథతో పాటూ సమాంతరంగా ఓ ప్రేమ కథ కొనసాగితే ఎలా ఉంటుందో అన్నది కూడా ఈ ట్రైలర్ లో చక్కగా చూపించారు దర్శకుడు. '#90's' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న మాస్టర్ రోహన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, నిర్మాతలు సందీప్ అగరం మరియు అస్మితా రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved