“I promise… I will do what no one else can… I will fight the battle no one dares to fight,” declares NTR with such conviction that it feels like the battlefield has come alive before our eyes.
“I don’t care if they’re friends or close ones. I won’t even look at those I’ve loved. I will walk away without a second thought,” says Hrithik Roshan, subtly revealing his deep commitment to his mission.
The trailer of War 2 is loaded with powerful conflicts, hidden mysteries, fierce patriotism, heartbreaking sacrifices, and deep emotional turmoil - all packed into just a couple of minutes. The film stars Hrithik Roshan and NTR in lead roles, with Kiara Advani playing the female lead. It is directed by Ayan Mukerji and produced by Bollywood’s leading banner, Yash Raj Films.
The story seems to revolve around two warriors who do not believe in defeat. But who is on the right side? Who has strayed into the wrong path unknowingly? After all, if they were truly on the same path, there would be no clash - and certainly no war. But the trailer suggests that the film is one epic showdown between these two relentless forces.
NTR’s line - “In war, I use weapons… either I die or I kill” - clearly signals the depth and intensity of his character.
To know who ultimately wins this war, we’ll have to wait until August 14. But one thing is clear from the trailer — an intense box office battle is on the horizon!
హోరాహోరీ మాటల యుద్ధంతో 'వార్ 2 ' ట్రైలర్..
"నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను.. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను.." అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు వింటుంటే కళ్ళ ముందు యుద్ధమే కదిలినట్టు ఉంది..
"మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను.. ప్రేమించిన వారిని కూడా చూడను, వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను.." అంటూ హృతిక్ రోషన్ చెప్పిన మాటలు వృత్తిలో అతని నిబద్ధతను చెప్పకనే చెబుతున్నాయి...
బలమైన సంఘర్షణలు, బయటకు తెలియని అంతుచిక్కని రహస్యాలు, దేశం కోసం వీరులు పడే ఆరాటాలు, ఆ క్రమంలో జరిగే ప్రాణ త్యాగాలు, లోతైన వేదనలు అన్నీ 'వార్ 2' లో ఉన్నాయన్న మాటను ఒకే ఒక్క ట్రైలర్ తో చెప్పేసింది 'వార్ 2' చిత్ర బృందం.. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలను పోషించగా కియారా అద్వానీ కథానాయిక పాత్రలో మెరవబోతుంది. దీనికి దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.
ఓటమిని ఇష్టపడని ఇద్దరు యోధుల పోరాటంలా కనిపిస్తుంది ఈ సినిమా. ఎవరిది మంచి మార్గమో , ఎవరిది అనుకోని రీతిలో చెడు మార్గమయిందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరిదీ ఒకే దారి అయితే వైరుధ్యాలు రావు కదా ఇద్దరి మధ్య.. యుద్ధం అవసరమే ఉండదు కదా ఇద్దరి మధ్య.. కానీ సినిమా ఆసాంతం వీళ్ళిద్దరి మధ్య జరిగిన పెను యుద్ధమే అన్నట్టు కనిపిస్తుంది ట్రైలర్ మొత్తం.. పట్టువిడవని ఇద్దరు వ్యక్తుల తెగింపే కనిపిస్తుంది.
"యుద్ధంలో ఆయుధాన్ని.. చస్తా.. లేదంటే చంపుతా" అన్న తారక్ డైలాగ్ తో సినిమాలో ఆయన పాత్ర లోతైనదన్న క్లారిటీ వచ్చేసింది. అంతిమంగా ఆ పోరాటంలో విజయమెవరిదో తెలియాలంటే వచ్చే నెల 14 వరకూ ఎదురుచూడాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ రణమే జరగబోతుందని అనిపిస్తుంది.