pizza
Ekkadiki Pothavu Chinnavada 30 days celebrations
`ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` 30 డేస్ సెల‌బ్రేష‌న్స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 December 2016
Hyderaba
d

Nikhil starrer ‘Ekkadiki Pothavu Chinnavada’ has successfully completed its 30 days and marking the achievement the celebrations were held of late at Blue Fox in Banjara Hills.

The entire film unit gathered at the success do. Filmmaker VI Anand said that he is humbled by the success of the film and thanked audience for flocking at the screens despite demonetization.

“I’m grateful to audience for coming to theaters making it jam-packed and watching the film despite cash crunch,” said Anand.

Actor Nikhil thanked the filmmaker for the success of the film, adding that, the film’s success is only savored by others because of the effort put in by the unsung technicians.

‘Our job is just to emote emotion as per directors vision, hence the film’s success deserves to them,” added Nikhil.

The actor further thanked Suresh Babu and Dil Raju for coming forward and distributing the film in their respective areas at a time of demonetization.

Later on Dil Raju and Suresh Babu congratulated the film unit on its success bash, adding that it is good to see a movie made on a shoestring to run successfully and raking in moolah.

“The film faced a tough time at later stages that is after the completion of the shoot, but defying all odds the film was able to pull the crowd to theatres and went on to become successful,” said Dil Raju.

Meanwhile, Suresh Babu congratulated Nikhil and Anand and said that both have a long run in the industry.

`ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` 30 డేస్ సెల‌బ్రేష‌న్స్‌

నిఖిల్‌, హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. ఈ సినిమా న‌వంబ‌ర్ 18న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో 30 డేస్ సెలబేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, హీరో నిఖిల్‌, హెబ్బాప‌టేల్‌, ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - ``ఇలాంటి హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్‌. టీం బాగా స‌పోర్ట్ చేయ‌డంతో మంచి సినిమా తీయ‌గ‌లిగాను. నాకే కాదు, టీం అంత‌టికీ ఇది స్పెష‌ల్ మూమెంట్‌. ఈ స‌క్సెస్‌తో భ‌విష్యత్‌లో చేయ‌బోయే సినిమాల ప‌ట్ల బాధ్య‌త మ‌రింత పెరిగింది`` అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ - ``ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రం ద‌ర్శ‌కుడి సినిమా. ఈ సినిమా కోసం ఆనంద్‌తో ప‌నిచేయ‌డ‌మే పెద్ద స‌క్సెస్‌గా భావిస్తాను.నేను, హెబ్బా, నందిత స‌హా న‌టీన‌టులంతా తెర‌పై క‌న‌ప‌డ్డా, మాతో పాటు టెక్నిషియ‌న్స్ కార‌ణంగానే సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ అంద‌రూ హ్యాపీగా ఉన్నాం. డీ మానిటైజేష‌న్ స‌మ‌యంలో సినిమా విడుద‌లై ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``డీ మానిటైజేష‌న్ వ‌ల్ల సినిమా ప‌రిశ్ర‌మ ప‌రోక్షంగా చాలా ఇబ్బందుల‌ను ఫేస్ చేస్తుంది. అలాంటి స‌మ‌యంలో ధైర్యంగా సినిమాను రూపొందించ‌డ‌మే కాకుండా, విడుద‌ల చేయ‌డ‌మ‌నేది నిర్మాతల సాహ‌స‌మే అనాలి.న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ పెర్‌ఫార్మెన్స్‌తో అనేక అడ్డంకులు దాటి సినిమా విడుద‌లైన ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావ‌డం ఎంతో హ్యాపీగా ఉంది`` అన్నారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``ఆనంద్‌, నిఖిల్ గ్రేట్ జాబ్‌. నిఖిల్ ప్ర‌తిసారి విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ ముందు కెళుతున్నాడు. త‌నిలాగే పెద్ద పెద్ద స‌క్సెస్‌లు సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved