pizza
A2A (Ameerpet to America) Team, is continuing its unique promotions
సరికొత్తగా ఎ టు ఎ (అమీర్ పేట్ టు అమెరికా) ప్రమోషన్స్
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

15 January 2018
Hyderabad

On the eve of Sankranti, a traditional festival in two states A2A Team has distributed Kites with A2A Logo across the cities. Young generations & children were existed with the new innovative promotions by flying and listening to A2A Movie Songs.

A2A Team has visited Desire Society, which cares about children affected with HIV/AIDS. Team has distributed kites and spent the evening with the children. Organizers were really happy and wished the entire team all the best

Titled: Smt Swapna Komanduri presents, A2A (Ameerpet to America)

DOP’s: Arun IKC, GL Babu,
Music: Karthik Kodakandla
Editor: Praveen Pudi
Producer: Komanduri Padmaja
Direction: Mr. Ram Mohan Komanduri, Bhanu Kiran Challa

సరికొత్తగా ఎ టు ఎ (అమీర్ పేట్ టు అమెరికా) ప్రమోషన్స్

రాధా మీడియా బ్యానర్ లో శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పణలో, త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఏ టు ఏ (అమీర్ పేట్ టు అమెరికా) చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ ని వినూత్నమైన రీతిలో జరుపుతున్నట్టు చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయిన రామ్ మోహన్ కొమండూరి తెలిపారు. బుధవారం స్ధానిక నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎ టు ఏ చిత్రంలోని బోనాల పాటకు, మెలోడి పాటకు సంబంధించిన డాన్స్ పోటీలు నిర్వహించారు. విద్యార్ధుల్లో వున్న సృజనాత్మకతను పెంపొందించేలా, అదే సమయంలో ఏ టు ఏ ని ప్రతి విద్యార్ధి మనసుకు హత్తుకునేలా చేయడమే లక్ష్యంగా సాగిన ఈ పోటీల్లో దాదాపు పదిహేను టీమ్స్ పాల్గొన్నాయి. వేల మంది విద్యార్ధుల సమక్షంలో విభిన్నంగా జరిగిన ఈ డాన్స్ పోటీలను ఏ టు ఏ డిజిటల్ టీమ్ సమర్ధవంతంగా నిర్వహించింది.

కాలేజ్ చైర్మన్ శ్రీ నల్ల నరసింహారెడ్డి, డైరెక్టర్ సి.వి. కృష్ణ రెడ్డి, డీన్ శ్రీ జనార్ధన్, హెచ్ ఓడిలు , విద్యార్ధినీ విద్యార్ధులు కూడా ఏ టు ఏ ప్రయత్నాన్ని అభినందించారు. రామ్ మోహన్ కొమండూరి విజేతలకు నగదు రూపంలో బహుమతులను అందించారు. ఇంజనీరింగ్ తర్వాత అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా వుందని వక్తలు కొనియాడారు. త్వరలో మరో విభిన్నమైన ప్రోగ్రామ్ తో ఏ టు ఏ మరోసారి మెరుస్తుందని తెలిపారు.

ఈ చిత్రానికి దర్శకులు రామ్ మోహన్ కొమండూరి ,చల్లా భానుకిరణ్. కెమెరా అరుణ్, జిఎల్ బాబు. ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతం కార్తీక్ కొడకండ్ల. బ్రహ్మానందం,మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణుమాధవ్, వారిజ, తేజస్, పల్లవి దొర, వంశీ కోడూరి, మేఘనా లోకేష్, వంశీ కృష్ణ, సాషా సింగ్, వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా అమెరికా నుండి కొందరు, ఇండియా నుండి కొందరు నటించిన చిత్రం అమీర్ పేట్ టు అమెరికా.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved