pizza
Abhinetri music launch
'అభినేత్రి' ఆడియో రిలీజ్‌

You are at idlebrain.com > News > Functions
Follow Us

25 September 2016
Hyderaba
d

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగుహిందీతమిళ భాషల్లో ప్రభుదేవామిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సాజిద్‌-వాజిద్‌విశాల్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రభుదేవాతమన్నారకుల్‌ప్రీత్‌ సింగ్‌సోనూసూద్‌కొరటాల శివక్రిష్‌ఎ.ఎల్‌.విజయ్‌నందినీ రెడ్డికోనవెంకట్‌రాజ్‌ తరుణ్‌రామజోగయ్యశాస్త్రిశివ తుర్లపాటిఅరుణ్‌ వడ్డేపల్లినానిశ్రీవాస్‌పివిపిసాజిద్‌-వాజిద్‌ఎం.వి.వి.సత్యనారాయణడి.వి.వి.దానయ్యఅభిషేక్‌ పిక్చర్స్‌ అభిషేక్‌బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

థియేట్రికల్‌ ట్రైలర్‌ కల్యాణ్‌ కృష్ణ విడుదల చేశారు.

బిగ్‌సీడీని కొరటాల శివరకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేశారు.

ఆడియో సీడీలను సోనూసూద్‌ విడుదల చేసి తొలి సీడీని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అందజేశారు.

అరుణ్‌ మాట్లాడుతూ - ''నాకు శివ తుర్లపాటికి కామన్‌గా నచ్చిన పాయింట్‌ సినిమా. అభినేత్రి సినిమాతో నిర్మాతలుగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. కోన వెంకట్‌గారి కారణంగానే ఈ సినిమాలో ఈ సినిమాలో పార్ట్‌ అయ్యాం. కోనవెంకట్‌గారికి థాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. ఎ.ఎల్‌.విజయ్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

శివ తుర్లపాటి మాట్లాడుతూ - ''పదేళ్ళ నుండి సినిమా రంగంలోకి ఎంటర్‌ కావాలని ప్రయత్నిస్తున్నాం. యు.ఎస్‌లో ఈ సినిమాను రిలీజ్‌కూడా చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. కోనగారికి అందరికీ థాంక్స్‌'' అన్నారు.

శ్రీవాస్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా కథను కోనవెంకట్‌గారు నాకు చెప్పారు. ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌ చాలా ఈ సినిమాలో ఉంటాయి. అయితే ఈ సాంగ్స్‌ను చూశాను. అన్నింటి కంటే డ్యాన్స్‌ ఎక్కువగా ఉందని అర్థం అవుతుంది. కోనగారికి కథపై ఉన్న నమ్మకం సక్సెస్‌ అవుతుంది. ప్రభుదేవాగారు క్రేజ్‌నుబాడీని మెయిన్‌టెయిన్‌ చేయడం కష్టం. దర్శకుడు విజయ్‌గారు బ్యూటీఫుల్‌ డైరెక్టర్‌ చేశారు. అలాగే నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

పివిపి మాట్లాడుతూ - ''ఈ దసరాకు వస్తున్న అభినేత్రి ఆడియెన్స్‌కు మంచి ఫీస్ట్‌ అవుతుంది. దర్శకుడు విజయ్‌ చేసిన నాన్న సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నాని మాట్లాడుతూ - ''యూ ట్యూబ్‌లో తమన్నా డ్యాన్స్‌ బిట్‌ చూసి నేను ఆమెలా చేయాలనే ఆలోచన వస్తుందేమోనని రెండోసారి కూడా చూడలేదు. కానీ ఈరోజు ఆ సాంగ్‌ను నేనే లాంచ్‌ చేశాను. తమన్నా డ్యాన్స్‌ అదరగొట్టేసింది. ప్రభుదేవాగారి డ్యాన్స్‌ అంటే నాకు చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను''అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్‌-వాజిద్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుండో తెలుగు సినిమాలకు పనిచేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పటికి కుదిరింది. తెలుగు ప్రజల ఆదరణను మరచిపోలేను. ప్రభుదేవాగారికి థాంక్స్‌. తెలుగులో అభినేత్రి తొలి సినిమా. పాటలు అందరికీ నచ్చుతాయి. విజయ్‌గారు అందించిన సహకారం మరచిపోలేను. తమన్నా డ్యాన్స్‌ చాలా బాగా చేసింది. అలాగే సోనూసూద్‌ సపోర్ట్‌కు థాంక్స్‌'' అన్నారు.

రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ - ''ప్రభుదేవాగారికి నేను పెద్ద ప్యాన్‌ని. తెలుగు తెరకు డ్యాన్స్‌ను పరిచయం చేసిన వ్యక్తి. ఆయన డ్యాన్స్‌ బాగా చేశాడని చెబితే ఆయన్ను అవమానపరిచినట్లు అవుతుంది. మరోసారి ప్రభుదేవాగారికి తెరపై చూడటం ఆనందంగా ఉంది. తమన్నా డ్యాన్స్‌ను ఇరగొట్టేసింది. దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

క్రిష్‌ మాట్లాడుతూ - ''ఎ ఫిలిం బై విజయ్‌ అని ఉంటే అదొక రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా అని నేను భావిస్తాను. తను చేసిన శైవం అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే అవకాశం దక్కింది. నాన్నమదరాసు పట్టణం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గ్రేట్‌ దర్శకుడు. ప్రభుదేవాగారు నటుడుడ్యాన్సర్‌గా అందరికీ ఇన్‌స్పైర్‌. తమన్నా ఫేబులస్‌ హీరోయిన్‌. తను ఎక్సలెంట్‌గా డ్యాన్స్‌ చేసింది. సాజిద్‌-వాజిద్‌గారు మంచి మ్యూజిక్‌ అందించారు. సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

సోనూసూద్‌ మాట్లాడుతూ - ''విజయ్‌గారు కథ చెప్పగానే నాకు విజయ్‌గారి దర్శకత్వం అంటే ఏంటో తెలిసింది. ప్రభుదేవాగారు నాకు బ్రదర్‌లాంటి వ్యక్తి. తమన్నాతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఈ సినిమాను హిందీలో నేను ప్రొడ్యూస్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది'' అన్నారు.

Glam galleries from the event

చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుండో తెలుగులో సినిమా చేయాలనుకున్నానుఈ సినిమాతో కుదిరింది. సాజిద్‌-వాజిద్‌గారువిశాల్‌గారు చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే తమిళంలో గణేష్‌గారు వల్లే సినిమా ఈ స్టేజ్‌కు వచ్చింది. తర్వాత కోనవెంటక్‌గారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమన్నా పెర్‌ఫార్మెన్స్‌ నన్ను చాలా ఎగ్జయిట్‌ చేసింది. సోనూసూద్‌గారు ఈ సినిమాలో చాలా రొమాంటిక్‌గా కనపడతారు. నాపై చాలా నమ్మకంతో నన్ను నడిపించారు. ప్రభుదేవాగారు తమిళంలో నిర్మాతగానే కాకుండా ఆయన సినిమాను ముందుండి నడిపించారు. ప్రభుదేవాగారికి థాంక్స్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ - ''నేను ఈ సినిమా టీజర్‌ చూసినప్పుడు తమన్నా డ్యాన్స్‌ చూసి స్టన్‌ అయిపోయాను. అలాగే ఇది ఏ జోనర్‌ సినిమానో అని ఓ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. సాంగ్స్‌ బావున్నాయి. విజయ్‌గారికి వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ప్రభుదేవాగారి డ్యాన్స్‌కు నేను అభిమానిని. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

తమన్నా మాట్లాడుతూ - ''సాజిద్‌-వాజిద్‌ వంటి మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ బాలీవుడ్‌లో ఉండటం వారి అదృష్టం అయితే ఈ సినిమాతో వారు తెలుగులోకి కూడా ఎంటర్‌ అవుతున్నారు. అలాగే విశాల్‌ కూడా చాలా మంచి సంగీతాన్నందించాడు. సినిమా కథను మొదటి పదిహేను నిమిషాలు మాత్రం విని చేయడానికి ఒప్పుకున్నాను. ప్రభుదేవాగారిపై అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. డ్యాన్స్‌లో ప్రభుదేవాగారిని నా గురువుగా భావించి ఇకపై డ్యాన్స్‌ చేస్తాను. ప్రభుగారు డైరెక్టర్‌ కావడంతో సీన్స్‌ను ఆయన ఇంప్రవైజ్‌ చేసి సీన్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రభుగారు తప్ప ఆ రోల్‌ను ఇంకేవరూ చేయలేరనే విధంగా యాక్ట్‌ చేశారు. ఇక సోనూసూద్‌గారిని ఈ సినిమాలో రొమాంటిక్‌గా చూపించారు. కోనవెంకట్‌గారితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. అభినేత్రి త్రిభాషా చిత్రం. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న కోనగారికి ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలి'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ - ''సినిమా చాలా పాజిటివ్‌ వైబ్స్‌తో కనపడుతుంది. విజయ్‌గారు అమేజింగ్‌ ఫిలిం మేకర్‌. తన నుండి మాస్టర్‌ పీస్‌ వస్తుందని భావిస్తున్నాను. ప్రభుదేవాగారుతమన్నాసోనూసూద్‌ సహా మంచి టీంతో రూపొందిన ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కల్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ - ''ప్యాషనేట్‌ డైరెక్టర్‌ విజయ్‌గారుప్రభుదేవాగారుసోనూసూద్‌తమన్నాకోనవెంకట్‌ ఇలా అందరూ ఓ టీంగా ఏర్పడి చేసిన సినిమా. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే సినిమాలో హీరో తమన్నానే అనిపిస్తుంది. అక్టోబర్‌ 7న తెలుగుతమిళంహిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాతో తమన్నా అందరి రచయితలు,దర్శకులకు చాలెంజ్‌ విసురుతుందని భావిస్తున్నాను. కోనవెంకట్‌గారు బ్యానర్‌ను పెట్టి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి'' అన్నారు.

కోనవెంకట్‌ మాట్లాడుతూ - ''ప్రభుదేవాసోనూసూద్‌తమన్నానిర్మాతలు సహా అందరికీ థాంక్స్‌. ఈ సినిమా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ కావడానికి ప్రభుదేవాగారే కారణం. విజయ్‌గారు సినిమా బాగా రావాలని ఎంతో తపనపడ్డారు. గీతాంజలి సక్సెస్‌ తర్వాత మాకు లేడీ పేర్లు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు అభినేత్రి సినిమా చేశాం. ఎం.వి.వి.సత్యనారాయణగారు నిజాయితికీ మారుపేరు. ఆయన సహా ఇందులో భాగమైన అందరికీ థాంక్స్‌. తమన్నా నటవిశ్వరూపం చూపించింది. తమన్నా ఈ క్యారెక్టర్‌ చేసుకుండకపోతే మరేవరూ ఆ టైటిల్‌రోల్‌ను చేయలేరు. తమన్నాయే ఈ సినిమాకు హీరో. తన డేడికేషన్‌తో తమన్నా ఈ స్థాయికి చేరుకుంది. మా బ్యానర్‌లో వచ్చిన గీతాంజలి సినిమాను ఎలా ఆదరించారో ఈ సినిమాను అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది సినిమా కాదుమా బలం. మా జర్నీ ఇక్కడ నుండే స్టార్ట్‌ అవుతుంది. అక్టోబర్‌ 7న మీరు విజయంతో మాకు బలాన్నిస్తారని బావిస్తున్నాను'' అన్నారు.

ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ''ప్రభుదేవాతమన్నాసోనూసూద్‌గారితో రూపొందిన ఈ సినిమాను నేను చేయడానికి కారణం కోనవెంకట్‌గారే కారణం. డెఫనెట్‌గా గీతాంజలి అంతా పెద్ద హిట్‌ అవుతుంది. దసరా సందర్భంగా మా తరపున మేమిచ్చే కానుకగా భావిస్తున్నాను'' అన్నారు.

ప్రభుదేవా మాట్లాడుతూ - ''ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ప్రధాన కారణం గణేష్‌గారు. అందరూ కలిసి చేస్తున్న సినిమా. సాజిద్‌-వాజిద్‌గారికివిశాల్‌గారికి దక్షిణాదిన ఈ సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాం. సోనూసూద్‌ నాకు బ్రదర్స్‌. తనతో జర్నీ కంటిన్యూ అవుతుంది. తమన్నా బెస్ట్‌ యాక్టర్‌డ్యాన్సరే కాదుమంచి వ్యక్తి. దర్శకుడు విజయ్‌కు చాలా ఓపిక ఉంది. ప్రతి సీన్‌ను ఎంతో ఓపికగా చేశారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

ప్రభుదేవాతమన్నాసోనూ సూద్‌సప్తగిరిమురళీశర్మహేమపృథ్వీషకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాజిద్-వాజిద్, విశాల్, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌ఎడిటింగ్‌: ఆంటోనీఆర్ట్‌: వైష్ణరెడ్డిసమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణకథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

 

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved