Chetan Maddineni, Santhosh Pawan, Anil Kalyan and Dimple's Gulf directed by Suneel Kumar Reddy is racing ahead for a grand release in the first week of August.According to the latest filmmakers celebrated the audio launch of GUlf in a grand manner in Prasad Labs, Hyderabad in the presence of celebrities yesterday.
Film's audio launch attracted everyone as filmmakers showed their creativity in launching the audio in Gulf environment. The audio album has four songs penned by Sirasri,Kasarla Shyam,Masterji and one Arabic song was penned by Kuwait's Ahmed.
KM.Radhakrishna,Anjana Sowmya,Deepu,Geeta Madhuri,Dhanunjay,Hansika beautified the songs with their voices. Chief guests Nagineedu, Totapalli Madhu,Dubai based industrialist Sriram launched the songs while the artists album was launched by LB.Sriram and Big CD was launched by director Maruthi.
Nagineedu who played an important role in the film after releasing the first song said the director made the film in a hearttouching manner. He said all the songs looked differently and he made the film with lot of love and passion.
LB.Sriram said Suneel Kumar Reddy is his best friend and he loves the human feelings in his films. He wished the Gulf makers all the best.
Dubai based industrialist Sriram speaking at the launch said the film captured the Gulf environment which he has been living in,in the most realistic manner. He wished the film should be released not only in two Telugu states Telangana and Andhra Pradesh but in across the world with subtitles of different languages.
Maruti said Suneel Kumar Reddy took the film after two years of research and he said the human values touching social issues and commercial elements has been beautifully portrayed by the director. He hoped the film will get good name for the hero Chetan Maddineni.
Music director Praveen Immadi said he worked for 8 films for Sravya Films banner starting from Gangaputrulu and added that he got opportunity to give good tunes and rerecording in the film.
Chetan Maddineni said he is happy that he got such wonderful opportunity in his second film after his debut with Rojulu Marayi. He said his role will highlight the emotions of Telugu people working in Gulf countries.
Dimple said she is playing the role of Godavari girl Lakshmi who flies to Gulf to make her living. She said the film also has a beautiful love story.
Producers Yekkali Ravindra Babu and MS.Ramkumar, co producers Dr. LN Rao, Raja.G,Executive producer Bapi Raju said most of the film has been shot in Gulf and film will be released in August after post production.
Totapalli Madhu, Badram Nookaraju, Anil Kalyan,Santosh Pawan,Siva,editor Sameul Kalyan, dialogue writer Pulagam Chinnarayana, Cameraman S.V.Sivaram, editor Pravasamitra Mandha Bheem Reddy, Gulf movie ambassodors participated in the function.
Suneel Kumar Reddy speaking at the function said film's cast and crew helped them a lot and dialogue writer Pulagam Chinnarayana, cinematography of Sivaram, Praveen Immadi's music, editor's Samuel Kiran's work, actors performances are the highlight in the film. He thanked the chief guests, media and Gulf immigrants for attending the function.
Film comes with a tagline 'Sarihaddulu Daatina Premaa Katha' and is produced by Yekkali Ravindra babu. Film stars Santhosh Pawan, Anil kalyan, Dimple, Pujitha, Surya, Shiva, Posani, Nagineedu, Jeeva, Nalla Venu, Prabhas Srinu, Thanikella Bharani, Thotapalli Madhu, Shankara Barnam Rajyalakshmi, Sana, Theertha, Diggy, Bittiri satthi, Badram , Mahesh , FM Babai and many more senior artists and newcomers.
Praveen Immadi scored music for the film for which lyrics are penned by Sirasri, Kasarala Syam and Masterji. Film is produced by Yekkali Ravindra Babu and MS.Ramkumar on Sravya Films banner.
`గల్ఫ్` ఆడియో ఆవిష్కరణ
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `గల్ఫ్`. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మారుతి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు.
మారుతి మాట్లాడుతూ - ``సునీల్‌కుమార్ రెడ్డిగారు గల్ఫ్ కోసం ఎంత కష్టపడ్డారనేది సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఆడియో వేడుకకు వస్తే గల్ఫ్‌కు వచ్చినట్లుగా భావిస్తున్నాను. ఒక సమస్య గురించి డిస్కస్ చేయడంలో ఆయన స్క్రీన్‌పై తీసుకురావడంలో సునీల్‌కుమా రెడ్డిగారు ముందుంటారు. ఆయన మన ఇండస్ట్రీలో ఉండటం మనకు గర్వకారణం. రామ్‌కుమార్ వంటి ఓ మంచి వ్యక్తి సునీల్‌కుమార్‌గారికి తోడయ్యారు. ఒక మంచి సినిమాలో తన అబ్బాయి నటించాలని కోరుకున్నారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం బావుంది. గల్ఫ్ సినిమా ఓ పదేళ్ళ పాటు గుర్తుండే పోయేలా ఉంటుందని భావిస్తున్నాను. గల్ఫ్ గురించి మాట్లాడాలంటే ముందు ఈ సినిమానే గుర్తుకు వస్తుంది. రేపు ఎవరైనా గల్ఫ్ వెళ్లాలనుకున్నా ఈ సినిమా వారికి పనికొచ్చేలా సునీల్‌గారు తెరకెక్కించి ఉంటారు. యూనిట్ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ప్రవీణ్ ఇమ్మడి మాట్లాడుతూ - ``సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది. తప్పకుండా సంగీతం అందరికీ నచ్చేలా ఉంటుంది. అవకాశం ఇచ్చిన సునీల్‌కుమార్‌రెడ్డిగారికి థాంక్స్. సినిమాను అందరూ పెద్ద హిట్ చేయాలి`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మాట్లాడుతూ - ``నేను సునీల్‌కుమార్‌గారికి ఈ సినిమా కథ గురించి అడిగితే చెప్తాను సార్..అనేవారు. ఎందుకంటే
ఈ సినిమా కథను ముందుగా సునీల్‌కుమార్‌గారు ఎలా రాసుకోవాలి అనుకోలేదు. కథ కోసం గల్ఫ్ దేశాలు సహా తెలంగాణలోని కొన్ని జిల్లాలు, రాయలసీమ, ఆంధ్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. రెండేళ్ల పాటు కథపై రీసెర్చ్ చేశారు. ఓ అద్భుతమైన కథను తయారు చేశారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది`` అన్నారు.
నాగినీడు మాట్లాడుతూ - ``సాంగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సునీల్‌కుమార్‌గారు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలి. అందరికీ ఉపయోగపడే సినిమా ఇది`` అన్నారు.
ఎల్.బి.శ్రీరాం మాట్లాడుతూ - ``నాకు నాలుగు నంది అవార్డులు వస్తే, అందులో రెండు అవార్డులు సునీల్‌కుమార్‌గారు చేసిన సొంతూరు సినిమాకు వచ్చిన నందులే. సునీల్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకోసం ఆయన రెండేళ్లు కష్టపడి. ఆ కష్టన్నంతా రెండున్నర గంటల సినిమాగా రూపొందించారు`` అన్నారు.
ఎం.ఎస్.రామ్‌కుమార్ మాట్లాడుతూ - ``సునీల్‌కుమార్‌గారు గల్ఫ్ పై ఓ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పారు. కచ్చితంగా మంచి సినిమా అవుతుందనిపించింది. రెండేళ్లపాటు సునీల్‌గారు అన్ని ప్రాంతాలు తిరిగి గల్ఫ్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. అన్ని ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయి`` అన్నారు.
యక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ - ``సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను`` అన్నారు.
హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ - ``నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే అందుకు కారణం నా గ్రాండ్ పేరెంట్స్, నా తల్లిదండ్రులే కారణం. సునీల్‌కుమార్‌గారు నన్ను ఓ తండ్రిలా ముందుండి నడిపించారు. ఈ సినిమాలో నేను లక్ష్మి అనే గోదావరి జిల్లా అమ్మాయి పాత్రలో కనపడతాను. ఇలాంటి ఓ సినిమా చేయడాన్ని గర్వపడతాను`` అన్నారు.
హీరోయిన్ చేతన్ మద్ధినేని మాట్లాడుతూ - ``ఈ కథను నమ్మి సునీల్‌గారు రెండేళ్ల పాటు కష్టపడ్డారు. నా తల్లిదండ్రులు కూడా నాకెంతో సపోర్ట్ చేశారు. మంచి ఎమోషన్స్, స్టోరీ, ఫైట్స్ అన్నీ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌ను ఆదరిస్తారని నమ్ముతున్నాను`` అన్నారు.
దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమా ప్రయాణంలో నా మిత్రులు, చిత్ర యూనిట్ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరి సపోర్ట్‌తో సినిమాను చక్కగా పూర్తి చేశాం. పాటలు అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ తదితరులు తారాగణం.
కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.