31 July 2017
Hyderabad
బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `జయజానకినాయక`. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, జగపతిబాబు, మిర్యాల రవీందర్ రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, శరత్‌కుమార్, వాణీ విశ్వనాథ్, రైటర్ రత్నం, సినిమాటోగ్రాపర్ రిషి పంజాబీ, దేవిశ్రీప్రసాద్, సాహిసురేష్, ప్రేమ్ రక్షిత్, కోటగిరి వెంకటేశ్వరరావు, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీని, ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని బోయపాటి శ్రీను అందుకున్నారు. ఈ సందర్బంగా...
జగపతిబాబు మాట్లాడుతూ -``సినిమాలో నటించే వారికి ప్రతిరోజూ బోయపాటి ఓ హెడ్ మాస్టార్‌లా ఏ టాస్క్ చేయాలో చెప్పేవారు. తన కెరీర్‌లో ఇది మరో లెజెండ్ అవుతుంది. డిఫరెంట్ స్క్రిప్ట్. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. హ్యాట్సాఫ్ టు శ్రీను. డబ్బింగ్ విషయంలో కూడా శ్రీను చాలా కేర్ తీసుకున్నాడు. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రిషి పంజాబీగారి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ఈ సినిమాతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అనే స్టార్ పుట్టాడు. సాయిశ్రీనివాస్ చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. రకుల్ చాలా బాగా యాక్ట్ చేసింది. రవీందర్ రెడ్డిగారు ఓ కాన్ఫిడెన్స్‌తో సినిమాను పూర్తి చేశారు`` అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``జానకి పాత్రను నాకు ఇచ్చిన బోయపాటిగారికి థాంక్స్. చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఎమోషన్స్ ఉండే క్యారెక్టర్. నాపై నమ్మకం పెట్టారు. సరైనోడు తర్వాత జయ జానకి నాయకలో బోయపాటిగారితో పనిచేసే అవకాశం వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. తనకు కెరీర్ చేంజింగ్ మూవీ అవుతుంది. దేవి నా పేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పటిలాగానే దేవిశ్రీ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. జగపతిబాబుగారు, శరత్‌కుమార్ గారు సహా మంచి టీమ్‌తో పనిచేశాను`` అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - ``మన తెలుగు చిత్రసీమలో స్టార్స్‌కు ఎంత విలువ ఉంటుందో, స్టార్ టెక్నిషియన్స్‌కు కూడా అంతే విలువ ఉంటుంది. అదే నమ్మకంతో బోయపాటి శ్రీనుగారి సినిమా అనగానే, స్టార్‌తో సినిమాను ఎలా చేశారో అలాగే చేశారు. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. బోయపాటిగారి సినిమాలో ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే. అంతకు పదిరెట్లు రెవెన్యూ మనకు వస్తుంది. నా నమ్మకంపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.ప్రేక్షకులు సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, వారి అంచనాలకు, ఊహలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉంటుంది. హీరో సాయిశ్రీనివాస్ అంతలా కష్టపడ్డాడు. తనింకా మంచి స్థాయికి ఎదగాలి. బోయపాటిగారి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన లేకుంటే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడున్న జనరేషన్‌లో దేవిశ్రీ అంత డేడికేషన్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ లేరు. సినిమాలోని ఏడు సాంగ్స్ గొప్పగా ఉన్నాయి. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను పరిచయం చేసిన దర్శకుడిగా తన సినిమాలంటే నాకు ఓ ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. ఏ షాట్ చూసినా తన చాలా బాగా చేశాడనిపిస్తుంది. నువ్వు ఏడిస్తే వీణ్ణి చంపేస్తా అనే డైలాగ్‌ను ఈ సినిమాలో ఎంత బాగా చెప్పాడు. మెచ్చూర్డ్‌గా నటించాడు. ట్రైలర్ అదిరిపోయింది. ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ చూసినట్టు అనిపించింది. మిర్యాల రవీందర్ రెడ్డి మంచి ప్యాషనేట్ నిర్మాత. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. బోయపాటి శ్రీనుకు అనువణువు సినిమాయే. తన ప్యాషన్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. సినిమాలో ఏడు పాటలుంటే, ఏడు పాటలూ బావున్నాయి. హ్యాట్సాఫ్ టు దేవిశ్రీ.. ఈ సినిమా లెజెండ్ అంత గొప్ప హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ``జయజానకి నాయక సినిమా టైటిల్ వినగానే నేను లవ్‌లో పడిపోయాను. అంత మంచి టైటిల్ పెట్టారు బోయపాటిగారు. ఆయనతో నేను చేస్తున్న నాలుగో సినిమా ఇది. ఆయన సినిమాలో యాక్షన్, లవ్ సహా అన్నీ ఎలిమెంట్స్ సమానంగా ఉంటాయి. బోయపాటిగారి సినిమాలో ఈ సినిమా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఓ మంచి సినిమాలో పార్ట్ అయినందుకు బోయపాటిగారికి థాంక్స్. రిషి పంజాబీగారు బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. సాయిశ్రీనివాస్ తొలి సినిమాను నేనే చేశాను. ఈ సినిమాకు తను అప్రోచ్ చూసి స్టన్ అయ్యాను. జగపతిబాబుగారు, శరత్‌కుమార్‌గారు వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశాను. చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి సహా అందరి సపోర్ట్‌తో మంచి ఆల్బమ్ ఇచ్చాను`` అన్నారు.
Rakul Preet Singh glam gallery from the event |
|
|
|
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ - ``మరో పదిరోజుల్లో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇంత మంచి సినిమా చేయడానికి కారణం బోయపాటిగారే. నా స్వంత అన్నయ్యలా నాకు సపోర్ట్ చేశారు. నా కెరీర్ ప్రారంభంలో బోయపాటి వంటి డైరెక్టర్ ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన గొప్పగా సినిమాలు తీస్తారని ఆయన ట్రాక్ రికార్డులు చెబుతున్నాయి. ఎంత పెద్ద స్టార్‌తో అయినా సినిమా చేయగలరు కానీ, నన్ను నమ్మి సపోర్ట్ చేసినందుకు థాంక్స్. దేవిశ్రీప్రసాద్‌గారి మ్యూజిక్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తుంటాను. ఈ సినిమాకు ఎంతో మంచి ఆల్బమ్ ఇచ్చారు. రకుల్ చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. ఇక నాన్న నా కలను ఆయన కలగా తీసుకుని నిజం చేశారు. అందుకు నాన్నకు థాంక్స్. అమ్మ,నా తమ్ముడి ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కు థాంక్స్`` అన్నారు.
బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమలో నాలుగు అద్భుతాలు జరిగాయి. మొదటిది కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, రెండో బాహుబలి2 విడుదల కావడం. బాహుబలి2 సినిమా దేశ విదేశాల్లో తెలుగువాళ్లందరూ తలెత్తుకుని నిలబడేలా చేసింది. మూడో విషయం దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకే థియేటర్‌లో 1084 రోజులు ఆడిన సినిమాగా లెజండ్ రికార్డ్ క్రియేట్ చేసింది. వస్తారా రారా..అని మీమాంసలో ఉన్నప్పుడు చిరంజీవిగారు ఖైదీ నంబర్ 150 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 150 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టుకుని తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు. మన తెలుగు చిత్ర సీమలో టెక్నిషియన్స్ అని మాట్లాడుకోవాలంటే ఓ దాసరిగారు, రాఘవేంద్రరావుగారు, కోదండరామిరెడ్డిగారు, బి.గోపాల్, కోడిరామకష్ణగారు, సింగీతం శ్రీనివాసరావుగారు ఇలా ఎంతో మంది గొప్పవాళ్లున్నారు. ఆ తరానికి వీళ్లు గొప్ప దర్శకులైతే ఈ తరానికి మనకు ఓ రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ, వినాయక్ ఉన్నారు. పూరి, సురేంరద్ రెడ్డి, సుకుమార్, తేజ, కృష్ణవంశీ వంటి గొప్ప దర్శకులున్నారు. ఈ తరం యంగ్ డైరెక్టర్స్‌తో పాటు బోయపాటి శ్రీను ఉన్నాడు. అలాగే తెలుగులో ఎంతో మంది గొప్ప నటులున్నారు. ఒక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్‌కల్యాణ్, మహేష్, బన్ని, చరణ్ వంటి హీరోలున్నారు. యంగ్ హీరోలు నాని, శర్వానంద్, నిఖిల్ వంటి వారున్నారు. ప్రస్తుతం తెలుగులో తండ్రి, బాబాయ్, అన్నయ్య వంటి ఏ క్యారెక్టర్‌నైనా చేయగల జగపతిబాబు ఉన్నారు. ఇంత మంది గొప్పవాళ్లు మనలో ఉండటానికి కారణం తెలుగు ప్రేక్షకులే. అందుకనే ముందుగా తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. ఇక జయజానకి నాయక టైటిల్ విషయానికి వస్తే, ఈ టైటిల్‌ను నా అసోసియేట్ పెట్టారు. లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతిసారి ప్రేమను వదిలేస్తాం. కానీ ఓ యువకుడు నేను ప్రేమించాను కాబట్టి ప్రేమను వదలను. అనే కుర్రాడు క్యారెక్టర్ ఉంటుంది. నేను నా తండ్రిని, తల్లిని, అన్నను ఎలా ప్రేమించానో, వారు ఎక్కడున్నా బావుండాలని కోరుకుంటానో, అలాగే నేను ప్రేమించిన అమ్మాయి బావుండాలని కోరుకుంటాననే క్యారెక్టర్ హీరోది. ప్రతి ఒక్కరి హృదయాలను తాకే సినిమా. ఇలాంటి కుర్రాడు నా కొడుకుగా, లవర్‌గా, భర్తగా, అన్నయ్యగా ఉండాలని అందరూ అనుకునేలా హీరో క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్‌ను
సాయి శ్రీనివాస్ అద్భుతంగా చేశాడు. రేపు సినిమా చూసి ప్రేక్షకులు కూడా నిజమేనని ఒప్పుకుంటారు. రిషి పంజాబి, సాహి సురేష్, దేవిశ్రీ ప్రసాద్ టెక్నిషియన్స్‌తో పాటు మంచి నటీనటులుకు కుదిరారు. రకుల్ ప్రీత్ తన క్యారెక్టర్ చక్కగాయాప్ట్ అయ్యింది. జగపతిబాబుగారు, శరత్‌కుమార్‌గారు, వాణి విశ్వనాథ్, తరుణ్ అరోరా సహా అందరికీ పేరు పేరునా థాంక్స్. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ పూర్తి కాగానే మళ్లీ ఆయన నిర్మాతగా మర మంచి సినిమా చేస్తానని మాట ఇస్తున్నాను. ఇలాంటి మంచి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. జయజానకి నాయక సినిమా ప్రతి తెలుగు ప్రేక్షక హృదయాలను తాకే సినిమా అవుతుంది`` అన్నారు.