యంగ్ హీరో కార్తీ, గ్లామర్ స్టార్ రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ తమిళంలో నిర్మించిన 'ధీరం అధికారం ఒండ్రు'. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తూ 'ఖాకి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్స్‌కి, టీజర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం నవంబర్ 2న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరవ్వగా ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, శివలెంక కృష్ణప్రసాద్, కె.అచ్చిరెడ్డి, జెమిని కిరణ్, లగడపాటి శ్రీధర్, శైలేంద్రబాబు, ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, ఎన్.శంకర్, హీరో కార్తీ, హీరోయిన్ రకుల్ ప్రీత్, దర్శకుడు వినోద్, కెమెరామెన్ సత్యం, సంగీత దర్శకుడు జిబ్రాన్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీధర్, నటుడు శ్రీనివాస్, చిత్ర నిర్మాతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, ఆదిత్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఒక్కో పాటను ఒక్కొక్క అతిథి ఆవిష్కరించగా అన్ని పాటలున్న ఆడియో సీడిలను హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయ్యింది.
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ''పోలీస్‌స్టోరిస్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. అలాంటి పాత్రలు చేయాలంటే హీరోస్‌కి ఛాలెంజింగ్‌గా వుంటాయి. టీజర్స్, థియేట్రికల్ ట్రైలర్ సూపర్బ్‌గా వున్నాయి. కార్తీ పెర్‌ఫార్మెన్స్, జిబ్రాన్ వండ్రఫుల్ ఆడియో ఇచ్చారు. 4 పాటలు చాలా హంటింగ్‌గా వున్నాయి. రకుల్ ఫైవ్ ఇయర్స్‌లో స్టార్‌గా ఎదిగింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఎన్నో సినిమాల ఆడియోలను రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో నిర్మాతలుగా మారుతున్నారు. వారికి నా గ్రాండ్ వెల్‌కమ్. రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తీక్ వంటి హీరోలు తెలుగులో చాలా మంచి సినిమాలు చేశారు. అలాగే కార్తీ కూడా సంవత్సరానికి ఒక తెలుగు సినిమా చెయ్యాలి. అతని కోసం నిర్మాతలందరూ రెడీగా వున్నారు. 'నా పేరు శివ', ఊపిరి' వంటి మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కార్తీ. కార్తీ నటించిన మరో మంచి సినిమా 'ఖాకి' నవంబర్ 17న రాబోతుంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ - ''ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలకు ఆల్ ది బెస్ట్. ఫస్ట్‌టైమ్ నిర్మాతలుగా నా సినిమా చేస్తున్నారు. తెలుగు సినిమా మ్యూజిక్ అంటే ఆదిత్య మ్యూజిక్ గుర్తుకొస్తుంది. 'ఖాకి' చిత్రాన్ని ఎక్స్‌ట్రార్డినరిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది నాకు చాలా డిఫరెంట్ సినిమా. పోలీస్ క్యారెక్టర్స్‌తో రెండు సినిమాలు చేశాను. 'విక్రమార్కుడు' తమిళంలో చేశాను. అక్కడ అది చాలా పెద్ద హిట్ అయ్యింది. వినోద్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఈ కథ విన్నాక చాలా మంది పోలీస్ ఆఫీసర్స్‌ని కలిశాను. 1995 నుండి 2005లో ఒక పది సంవత్సరాల్లో జరిగిన ట్రూ స్టోరి ఇది. ఇలాంటి స్టోరి మా ప్రొఫెసర్‌కి జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంట్రెస్టింగ్, అండ్ ఇంటెలిజెంట్స్ సినిమా. ఇప్పటివరకు వచ్చిన పోలీస్ స్టోరీస్ కంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా వుంటుంది. జిబ్రాన్ సాంగ్స్ అన్నీ కొత్త సౌండింగ్‌తో ఫెంటాస్టిక్ ఆల్బమ్ ఇచ్చాడు. రకుల్‌తో ఫస్ట్‌టైమ్ యాక్ట్ చేశాను. వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో ప్రియ క్యారెక్టర్‌లో చాలా నేచురల్‌గా యాక్ట్ చేసింది. డైరెక్టర్ వినోద్, కెమెరామెన్ సత్య టీమ్ అందరూ చాలా హార్డ్‌వర్క్ చేశారు. డెఫినెట్‌గా ఈ చిత్రం ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా వారి కోసం పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్‌తో వారిద్దరూ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కావాలి'' అన్నారు.
చిత్ర దర్శకుడు వినోద్ మాట్లాడుతూ - ''ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హిందూయిజం, ఎడ్యుకేషన్, పోలీస్ డిపార్ట్‌మెంట్స్, క్రైం గురించి అన్నింటి గురించి ఈ చిత్రంలో చూపించాం. ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఈ చిత్రం వుంటుంది'' అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సుభాష్ గుప్తా మాట్లాడుతూ - ''మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఎన్నో సూపర్‌డూపర్ హిట్ సినిమాల ఆడియోలను రిలీజ్ చేశాం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంతో మంది మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారు. దాదాపు 3000 పైగా పాటలను రిలీజ్ చేశాం. డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని మాకు ఇచ్చిన ప్రభు, ప్రకాష్‌లకు నా థాంక్స్. ఫస్ట్‌టైమ్ 'ఖాకి' చిత్రంతో నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నాం. ఈ చిత్రం మా బేనర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలుస్తుందని చాలా కాన్ఫిడెన్స్‌గా వున్నాం'' అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ మాట్లాడుతూ - ''ఖాకి' నాకు స్పెషల్ మూవీ. రియల్ ఇన్సిడెంట్స్‌తో జరిగిన స్టోరి. నా క్యారెక్టర్ కొత్త యాంగిల్‌లో వుంటుంది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. రియలస్టిక్ ఎప్రోచ్‌తో హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ వుంటాయి. టీమ్ అంతా ఒక ప్యాషన్‌తో వర్క్ చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు వినోద్‌కి నా థాంక్స్'' అన్నారు.