భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి వి4 క్రియేషన్స్ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌పై 'నెక్స్‌ట్ నువ్వే' పేరుతో ఓ హార్రర్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. నవంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ''తమిళంలో కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగు కాన్సెప్ట్ సినిమాలను ఆదరించడానికి జనం, ఈ యంగ్ జనరేషన్ ఆసక్తిని చూపిస్తున్నా పెద్దగా రావడం లేదని ఓ సారి బన్ని వాసు నేను చర్చించుకున్నాం. తెలుగులో కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికే వి4 సంస్థ వచ్చింది. ఎవరికైనా మమ్మల్ని ఎలా సంప్రదించాలనే సందేహం రావచ్చు. ఈ సినిమా విడుదలయ్యేలోపు కొత్త కాన్సెప్ట్ సినిమాలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాను. ఇక ఈ సినిమాలో సాయికార్తీక్ చాలా మంచి సంగీతం అందించాడు. సినిమాలో నటించిన నటీనటులకు, సినిమాకు వర్క్ చేసిన సాంకేతిక నిపుణులకు ఆల్‌ది బెస్ట్'' అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలో చిన్న, పెద్ద సినిమాలనీ ఉండవు..చిన్న, పెద్ద సినిమాలనే ఉంటాయి. టైటిల్‌లోనే అసలు మజా, సక్సెస్ ఉంది. సాయికార్తీక్ చాలా మంచి సంగీతం అందించారు. పాటలు విన్నాను. బావున్నాయి. థియేటర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం ప్రేక్షకులు వచ్చేలా సినిమా ఉంటుంది. ఇండస్ట్రీ అక్షయపాత్రలాంటిది. ఎవరొచ్చినా ఎంకరేజ్ చేసే పరిశ్రమ. ఇక కష్టం మాత్రం పడాలి. అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్ రాజా, బన్నివాసు, వంశీగారు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఈ బ్యానర్‌ను పెట్టారు. సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ - ''నేను శివాజీ గణేషన్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. 1974లో ఎన్టీఆర్‌గారితో డబ్బింగ్ చెప్పాను. ఆది అన్నయ్య చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్. నేను ఛాలెంజ్ సినిమాలో అన్నయ్యతో కలిసి నటించాను. ఆ సినిమా హండ్రెస్ డేస్ షీల్డ్‌ను ఆది చిన్నబిడ్డగా ఉన్నప్పుడే అన్నయ్య చేతులమీదుగా ఆ అవార్డును తీసుకున్నాడు. ఇక కన్నడలో పోలీస్ స్టోరీ తర్వాత కన్నడంలో చాలా సినిమాలు చేశాను. ఓ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చిన చిరంజీవిగారు ఆది డ్యాన్స్ చూసి బాగా చేస్తున్నాడురా..సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉంటే రానీ, నువ్వు బలవంతం పెట్టొద్దు అన్నారు. తర్వాత ఆది ట్రయినింగ్ తీసుకుని ప్రేమకావాలి సినిమాతో హీరోగా పరిచయం చేశారు. నేను హీరో అయిన తర్వాత గీతాఆర్ట్స్‌లో సినిమా చేయాలనుకున్నా, కానీ అవకాశం రాలేదు. ఆదికి ఆ అవకాశం రావడం ఆనందంగా అనిపించింది. దర్శకుడు ప్రభాకర్ చాలా లక్కీ. ఈ సినిమా తర్వాత ఆది తమిళ్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారు. నిర్మాతలు గురించి తెలుసు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆడియెన్స్ కోరుకునే సినిమాను అందించారు. తప్పకుండా ఈ సినిమా ఆదికి మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ''నేను ఇంకా స్ట్రగులింగ్ యాక్టర్‌లానే ఫీలవుతాను. నాలాంటి నటుడికి గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్‌లో రెండు వరుస సినిమాలు అంటే..నేను సెట్ అయిపోయినట్లే. ఇక వి4 బేనర్ అనౌన్స్ చేయగానే కొత్త దర్శకులు,కొత్త కాన్సెప్ట్‌లకు మంచి రోజులువచ్చాయి. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుని వీళ్ల దగ్గరకు వెళితే వీళ్లు సినిమా చేస్తారనే నమ్మకం అయితే ఉండేది. వి4 బేనర్‌లో వస్తోన్న నెక్స్‌ట్ నువ్వే సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కొత్త దర్శకులు, కాన్సెప్ట్‌లకు ఓ ల్యాబ్, ఓ గ్రౌండ్‌లా ఉంటుందని భావిస్తున్నాను. సాయికార్తీక్ మంచి సంగీతం అందించాడు. నవంబర్ 3న విడుదలవుతున్న 'ఈ సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ - ''అదృష్టవశాతు నాకు ఈ సినిమా డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. అల్లు అరవింద్, బన్నివాసు, వంశీ, జ్ఞానవేల్ రాజా వంటి మంచి మనుషులు కారణంగానే నాకు ఈ అవకాశం వచ్చింది. సినిమా బాగా వచ్చింది. ఫుల్ ఎంటర్‌టైనర్. సినిమా చాలా బాగా వచ్చింది. నెక్స్‌ట్‌నువ్వే టైటిల్ క్రెడిట్ మాత్రం పరుశురాంగారిదే. ఆదిలాంటి హీరో దొరకడం అదృష్టం. తను ఒప్పుకున్న తర్వాతే సినిమాకు ఎలివేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ రుణపడి ఉంటాను..థాంక్స్'' అన్నారు.
బన్నివాసు మాట్లాడుతూ - ''అందరికీ తెలిసిన అవరవింద్‌గారు వేరు. నాకు తెలిసిన అరవింద్‌గార వేరు. ఆయన మార్గదర్శకత్వంలోనే నేను, వంశీ, జ్ఞానవేల్‌రాజగారు కలిసి ఈ బ్యానర్‌ను పెట్టాం. ఇక సినిమా విషయానికి వస్తే, రెండున్నరేళ్లు ముందుగానే సినిమా చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. అప్పుడు నేను ఒకడినే ఉన్నాను. తర్వాత వంశీ, జ్ఞానవేల్‌రాజాగారు, అరవింద్‌గారు కలిశారు. తర్వాత ఒక నెలలోనే సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు నవ్వుతూనే ఉంటాడు. ప్రభాకర్‌గారు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు'' అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ - ''నలుగురు పెద్ద నిర్మాతలు కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అరవింద్‌గారు, బన్నివాసుగారు, వంశీగారు, జ్ఞానవేల్‌రాజాగారికి థాంక్స్. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తనకు థాంక్స్. ప్రభాకర్‌గారు ఫస్ట్ సినిమా అయినా ఓ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్టర్‌లా సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా నవంబర్ 3న విడుదలవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, డైలాగ్ రైటర్ నిరుపమ్, కె.కె, సాగర్, హిమజ, కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, హిమజ, రష్మీ, వైభవి, పరుశురాం, బ్రహ్మాజీ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. అవసరాల శ్రీనివాస్, హిమజ, జయప్రకాష్‌రెడ్డి, ప థ్వీ, ఎల్.బి.శ్రీరామ్, పోసాని, రఘు కారుమంచి, బెనర్జీ, తాగుబోతు రమేష్, ముమైత్‌ఖాన్, షకీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: డి.కె., మాటలు: శ్రీకాంత్ విస్సా, నిరుపమ్ పరిటాల, సంగీతం: సాయికార్తీక్, పాటలు: కె.కె, సాగర్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్, ఆర్ట్: శ్రీకాంత్, సహనిర్మాత: ఎస్.కె.ఎన్., నిర్మాత: బన్ని వాస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్.