The audio of 'Premam' was launched a while ago in the presence of Dasari Narayana Rao, Nagarjuna, PVP, and others. Besides the lead actors Naga Chaitanya, Shruti Haasan and Madonna Sebastian, the event was attended by the the rest of the cast and crew.
ML Kumar Chowdary said that it was a happy moment to Akkineni fans as well as others that the audio of 'Premam' was being released on ANR's birthday. He released the song 'Machi'
Lyricist Srimani said, "It was with '100% Love' that I got introduced. I have written 'Evarey' and 'Machi' in this film. 'Evarey' already has been getting a very good response".
Comedian Srinivas Reddy said, "I have a hilarious role in the movie. After watching it, the producer and others called me up to congratulate me. Madonna Sebastian will become a big star". Fellow comedian Praveen said that he and Srinivas Reddy played Chay's friends who are seen throughout the film.
Rajesh Murugesan, who composed the super-hit 'Malarey' song for the original, said, "Although I wasn't actively associated with 'Premam', I respect the love you have for the movie".
PVP said, "Love stories and Akkineni heroes have a solid relationship. Dasari garu played a key role in making that possible with the films 'Premabhishekam' and 'Majnu'".
Nandini Reddy said, "Chandu is the right director for this. I was jealous of Chandu when I came to know that he is directing the remake. I am one of the crores of fans that 'Premam' has. Chaitanya has a beautiful smile and heart. That's why love stories come to him. A good love story needs excellent music. They already have it".
Director Maruthi said, "It was Naga Chaitanya garu who first loved 'Premam'. For many years, he wanted to come up with a 'Ye Maya Chesave'. Chandu garu worked really hard to bring this out without losing the flavour of the original. This is going to be a big hit for sure. It's already a proven formula. I have watched some of the songs and they have been very well filmed".
Actor Nikhil said, "I have known Chandu for 10 years now. We both were assistant directors. He gave me a hit like 'Karthikeya' for which people still appreciate me. When he told me he would be remaking 'Premam', I was shocked. But then I came to know that Chaitu is the hero. Only Chandu could have done this film. Chandu entered the industry because he wanted to meet Nagarjuna garu at least once. He was inspired by the film 'Shiva'. As a big fan of the original, I am endorsing the changes that have been made while remaking it".
Director Sudheer Varma said, "I disappointed many with 'Dochey'. I hope my friend Chandu will recompense for that".
Director Kalyan Krishna said, "How so many kind of stories ANR garu might have done, he became known as a specialist in romantic movies for his generation. Same is the case with Nagarjuna garu. I wish Chaitanya will be like that for the current generation. Chandu Mondeti must have struggled a lot in adapting 'Premam'. I hope he will get the result he deserves".
Akhil said, "Watching the trailer and listening to the songs, 'annayya' comes across as the biggest lover. I can't compete with him. I am happy that I haven't watched the original. The music is sounding fantastic. Welcome to the industry, Madonna. Shruti is very talented. Thatayya garu's blessings will be there forever".
Gopi Sunder said, "Today's real hero is Rajesh Murugesan. He did the music for the original. I am really honoured to have done three songs for this one".
Ramajogayya Sastry said, "'Premam' has fans worldwide. Chandu has so much clarity. Karthik's visuals are great. I have written 'Bang Bang', a peppy number".
Vanamali said, "I have penned lyrics for 'Manam' and 'Oka Laila Kosam'. I wish all the best to both Chaitanya garu and Chandu".
Madonna Sebastian said, "I am really happy to be here in the presence of all the big names. Thanks to the directorial team, the production team, Shruti Haasan, Anupama. The Malayalam version has been very close to my heart. Being introduced with its remake in Telugu makes me happy".
Chandu Mondeti said, "The reason why this film has been getting so much of buzz is because of the media. I will talk about the film after it gets success".
Shruti Haasan said, "It's a very special film. It's not a remake, thanks to our producer and director. Gopi and Rajesh have given beautiful music. Thank you, Chay. He has been one of the best co-stars as well as friends. Please pray for us".
Naga Chaitanya said, "Whether it's hit or flop, it's our fans who have been supporting me. I am here because of you all. This is a special day to Akkineni fans. We have adapted the original to suit the Telugu nativities. We never intended to correct the mistakes of the original or better it. All the technicians who have worked for the movie will received all-round applause. It's only after started working for this movie that I came to know about Chandu's abilities. I want to do an original with him. If China babu garu is making a film, I will do it without listening to the story. I am saying it with all the confidence that you all will like it".
Nagarjuna, who released the song 'Evarey', said, "It's Nanna garu's birthday today. I thank everyone for the wishes/blessings pouring in from morning. 'Evarey' is such a beautiful song that I listen to it every morning. I recently got to know that the title has been chosen because love in Sanskrit, the mother of all languages, means 'premam'. Serious talk aside, whose beard is better - mine or Chaitanya's? When Chaitanya grew the beard for his role in the movie, I told him I will also grow a similar one for 'Om Namo Venkatesaya'. After growing one, he tells me mine is better. 'Premam' is like a 'Prem Nagar' and a 'Githanjali'. Provided censor formalities are done, the film will hit the screens on October 7".
Dasari Narayana Rao said, "Today is ANR garu's birthday. The relationship I and ANR garu had is well-known. It was a 50-year-long one. I directed him 27 times. There was no other director who made these many films with him. The record 'Premabhishekam' created is insuperable. If it so remains for another 20 years, it will have been unbeaten over a century's time. Akkineni family is c/o address for love stories. Twenty-two of the 27 movies were love stories. That legacy continued with Nagarjuna. 'Majnu' has been the biggest hit of his career. Chaitu is continuing with it. I wish that continues with Akhil as well. Chaitu is no hero to me. He is like the last guy in your neighborhood. There is magic in his smile. Aa nuvvutho ne padesadu oka heroine ni. I don't know what 'maya' that heroine did to him. With 'YMC' and '100% Love', Chaitu proved himself. Love is eternal. Whatever may be the industry, love stories have unmatched histories. China babu (producer) is my friend. I made it to this function intentionally. Shruti Haasan looks like her mother Sarika. She is like Sarika's replica. She did five films with me. Shruti in her first movie as a child looked the same way Sarika did in one of my movies. Shruti is a combination of talent and beauty. Chandu is an unusual director as proven by 'Karthikeya'. I have watched the original version. Remaking is very difficult. It's a double-edged sword. Music director Gopi Sunder is a wonderful talent. In 'Oopiri', the BGM is excellent. I compliment the entire team of this movie. With ANR garu's blessings, this one should become a big hit. Akhil next should do a love story and it should become a silver jubilee hit".
చైతన్యఅక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ లకాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటిదర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. ; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, శృతిహాసన్, పివిపి, గోపీసుందర్, చందు మొండేటి, నందినీ రెడ్డి, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ మారుతి, హీరో నిఖిల్, కల్యాణ్ కృష్ణ, సుధీర్‌వర్మ, శ్రీమణ, రవీందర్‌రెడ్డి, సర్వేశ్వరరావు, రామరాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్‌ను అక్కినేని అఖిల్ విడుదల చేశారు.
బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శకరత్న డా.దాసరి నారాయణరావు విడుదల చేశారు.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ -''అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాకు ఉన్న సంబంధం, అనుబంధం 50 ఏళ్ళు. అది అక్కినేని ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఆయన సినిమా చరిత్రలో 27 సినిమాలు చేసింది, అంటే ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 80 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమాకు లేని హిస్టరీ ప్రేమాభిషేకంకు ఉంది. అది అలాగే మరో 20 ఏళ్ళు కొనసాగితే ఆ రికార్డుకు వందేళ్ళవుతుంది. ప్రేమ అనే పదానికి, పదార్థానికి అర్థం అక్కినేని కుటుంబం. ప్రేమకు, ప్రేమకథా చిత్రాలకు అక్కినేని కేరాఫ్ అడ్రస్. నేను ఆయనతో తీసిని 27 సినిమాల్లో 22 ప్రేమకథలే. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయ్యింది. తన కెరీర్‌లో మజ్ను బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే చరిత్ర చైతుతో పునరావృత్తం కాబోతుంది. అది అఖిల్‌తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను. చైతు సినిమాలు చూస్తుంటే మనింటి పక్కనుండే కుర్రాడిలా అనిపిస్తాడు. తన నవ్వుతోనే పడేస్తాడు. తన నవ్వులో ఏదో మాయ ఉంది. ఆ నవ్వుతోనే పడేశాడు ఓ హీరోయిన్‌ని. ఏ మాయ చేసావేతో ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్... చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావే, 100%లవ్ సినిమాతో మళ్ళీ అక్కినేని వారసుడనిపించాడు. తను యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు నాగార్జునతో చైతుని లవ్ సినిమాలే చేయమని కూడా అన్నాను. బాలీవుడ్, టాలీవుడ్, ఏదైనా కానీ లవ్‌స్టోరీస్‌కున్న చరిత్ర దేనికి లేదు. హీరో అంటే వంద మందిని కొట్టేసేవాడిలా కాకుండా,వంద మంది అమ్మాయిల హృదయాన్ని దోచుకునే కుర్రాడిగా చైతు ఈరోజున ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. చినబాబు, చినబాబు అబ్బాయి వంశీ, పి.డి.ప్రసాద్‌లు నాకు బాగా కావాల్సిన నిర్మాతలు. చైతు, శృతి కాంబినేషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శృతి తన అమ్మగారిలానే ఉంటుంది. సారిక నా దర్శకత్వంలో ఐదు సినిమాలు చేసింది. ప్రేమమ్‌ను మలయాళంలో నేను చూశాను. చాలా మంచి సినిమా. రీమేక్ చేయడం కత్తిమీద సాములాంటిది. చందు కార్తికేయ చూశాను. ఈ ప్రేమమ్ సినిమాను బాగానే హ్యాండిల్ చేసుంటాడు. గోపీసుందర్ వండర్‌ఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్స్‌లో నాకు రెండు సాంగ్స్ బాగా నచ్చాయి. ఎంటర్‌టీంను అభినందిస్తున్నాను. నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ప్రేమమ్ పెద్ద హిట్ కావాలని, అఖిల్ కూడా నెక్ట్స్ లవ్‌స్టోరీయే చేయాలని, అది సిల్వర్ జూబ్లీ ఆడాలని కోరుకుంటున్నాను''అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ -''ఈరోజు నాన్నగారి పుట్టినరోజు. చాలా మంది విషెష్ తెలియజేశారు..అందరికీ థాంక్స్. ఎవరే సాంగ్ రిలీజ్ కాక ముందే చైతన్య వినిపించాడు. బ్యూటీఫుల్ సాంగ్. రోజూ వింటూనే ఉన్నాను. సంస్కృతంలో ప్రేమమ్ అంటే ప్రేమ అని తెలుసుకున్నాను. అందుకే ప్రేమమ్ అని టైటిల్ పెట్టారు. నాన్నగారు చేసిన దేవదాసు, ప్రేమాభిషేకం నుండి నేను చేసిన గీతాంజలి సహా మేం చేసిన ప్రేమకథా చిత్రాలను అభిమానులు, ప్రేక్షకులు ఆదరించారు. వాటికి సరిపోయే ప్రేమకథ'ప్రేమమ్'. మలయాళంలో చాలా మంది చూసే ఉంటారు. అక్కడ పెద్ద సూపర్‌హిట్ మూవీ. చందు, నిర్మాతలు అందరూ సినిమాను బాగా తీశారు. మ్యూజిక్ బావుంది. సెన్సార్ కాలేదు..సెన్సార్ అయితే అక్టోబర్ 7న రిలీజ్ అవుతుంది.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ -''తాతగారు పుట్టినరోజు మా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ డే. ప్రేమమ్ సినిమాను మలయాళంలో చూసి బాగా ప్రేమించి తెలుగు హక్కులు తీసుకుని తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి మంచి సినిమా తీయాలనుకున్నామంతే కానీ ఓరిజినల్ వెర్షన్ కంటే బాగా చేద్దాం. ఆ హీరో కంటే బాగా చేద్దామనుకుని తెలుగులో సినిమా చేయలేదు. మలయాళంలో ప్రతి టెక్నిషియన్‌ను అప్రిసియేట్ చేసి తెలుగులో సినిమా చేశాం. రేపు సినిమా విడుదలైన తర్వాత తెలుగులో వర్క్ చేసిన ప్రతి టెక్నిషియన్‌ను మలయాళ ప్రేమమ్ టెక్నిషియన్స్ అప్రిసియేట్ చేసేంత బాగా తెలుగులో సినిమా చేశాం. చందుని రీమేక్ చేయమని అడగటం తప్పే. ఎందుకంటే తనలో డైరెక్షన్ పొటెన్షియల్ చాలా వుంది. ఈ సినిమా తర్వాత ఎప్పుడైనా చందు మొండేటి స్వంత కథతో సినిమా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దర్శకుడు చందు, నిర్మాతలు చినబాబు, వంశీ, పి.డి.ప్రసాద్‌లకు థాంక్స్. ఈ బ్యానర్‌లో వర్క్ చేయడం లక్కీగా భావిస్తున్నాను. గోపీసుందర్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. కార్తీక్ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. ఒక మంచి సినిమా, మనం అందరం గర్వంగా ఫీలయ్యే సినిమా ప్రేమమ్ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు.
అక్కినేని అఖిల్ మాట్లాడుతూ - ''ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే మా అన్నయ్య పూరెస్ట్ లవర్ అని తెలుస్తుంది. లవ్‌స్టోరీస్‌లో తనతో పోటీపడలేను. అందుకే తనను ఫాలో అయిపోవాలనుకుంటున్నాను. ప్రేమమ్ మలయాళ వెర్షన్ చూడలేదు. అయితే దాని కంటే ఇది బావుంటుందని నమ్ముతున్నాను. గోపీసుందర్‌గారి సంగీతం, కార్తీక్ సినిమాటోగఫ్రీ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ -''మలయాళం ప్రేమమ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. తెలుగులో ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.
చందు మొండేటి మాట్లాడుతూ -''సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
శృతిహాసన్ మాట్లాడుతూ -''నేను మలయాళ వెర్షన్ ప్రేమమ్ మూవీ చూశాను. ఇలాంటి ఓ మంచి సినిమాలో నేను పార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో స్పెషల్‌గా భావిస్తున్నాను. గోపీ, రాజేష్‌గారు అద్భుతమైన సంగీతాన్ని, కార్తీక్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీని అందించారు. చైతు మంచి కోస్టారే కాదు, మంచి మిత్రుడు కూడా. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
ఎం.ఎల్.కుమార్‌చౌదరి మాట్లాడుతూ -''అక్కినేని జయంతిరోజున ప్రేమమ్ ఆడియో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. అల్రెడి రెండు పాటలను విడుదల చేశారు. ఈ సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు మిగతా సాంగ్స్ వింటున్నాం. చినబాబుగారు, వంశీ, పి.డి.ప్రసాద్‌లు నిర్మాతలుగా ఈ సినిమా రూపొందడం ఆనందంగా ఉంది. అక్కినేని నాగార్జునగారితో డాన్ అనే సినిమా చేశాను. అక్కినేని నాగేశ్వరరావుగారిలా, నాన్న నాగార్జునగారిలా కలకాలం ఉండాలి. ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. గోపీసుందర్, చందు మొండేటి సంగీతం బావుంది. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అన్నారు.
పివిపి మాట్లాడుతూ -''అక్కినేని ఫ్యామిలీకి, ప్రేమకథా చిత్రాలకు మంచి అవినావ సంబంధం ఉంది. ప్రేమాభిషేకం, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలు అక్కినేని ఫ్యామిలీకి ల్యాండ్ మార్క్ సినిమాలుగా నిలిచిపోయాయి. అటువటి సినిమాలను దర్శకరత్న దాసరి నారాయణరావుగారు ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ప్రేమమ్ చైతుకు ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. చినబాబు, వంశీ, పిడి ప్రసాద్ వంటి ప్యాషనేట్ నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఈ సినిమా ఆ బ్యానర్‌లో హ్యాట్రిక్ హిట్ అవుతుంది. గోపీసుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. అక్టోబర్ 7న సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను'' అన్నారు.
నందినీరెడ్డి మాట్లాడుతూ -''ప్రేమమ్ సినిమాను ఇష్టపడ్డ లక్షలాది, కోట్లాది ప్రేక్షకుల్లో నేను కూడా ఉన్నాను. ప్రేమమ్ రియలిస్టిక్ ప్రేమకథ. ఈ సినిమాను చందు డైరెక్ట్ చేస్తున్నాడని తెలియగానే జెలసీగా ఫీలయ్యాను కానీ తనే ఈ సినిమాకు కరెక్ట్ డైరెక్టర్. చైతు బ్యూటీఫుల్ ప్రేమకథలను చేస్తున్నాడు. చైతు మంచి మనసున్న హీరో. అందుకే తను మంచి ప్రేమకథా చిత్రాలు చేయగలుగుతున్నాడు. సినిమా విడుదల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ''రొమాంటిక్ ఫిలింస్ అందరు హీరోలు చేస్తారు కానీ అక్కినేని హీరోలు రొమాంటిక్ సినిమాలు చేస్తే కొత్తగా ఉంటుంది. చైతు, శృతి,దర్శక నిర్మాతలు సహా అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ''నాకు తెలిసి యూనిట్‌లో ప్రేమమ్ సినిమాను బాగా ప్రేమించిన వ్యక్తి నాగచైతన్యగారు. ఏ మాయ చేసావే తర్వాత అలాంటి మంచి ప్రేమకథాచిత్రాన్ని చైతు చేయలేదు. ఈ సినిమాతో అలా కుదిరింది. రాధాకృష్ణ వంటి నిర్మాతగాగారు ఈ సినిమా చేయడం ప్లస్ పాయింట్. లావిష్‌గా సినిమాను నిర్మించారు. చందు బాగా హార్డ్ వర్క్ చేసి, ఓరిజినల్ ఫ్లేవర్ పోకుండా సినిమాను తెరకెక్కించాడు. గోపీ సుందర్‌గారి మ్యూజిక్ గురించి నేను చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది''అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ -''చందుతో పదేళ్లుగా పరిచయం ఉంది. నాతో కూడా కార్తికేయ వంటి సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తను ఓరోజు నన్ను కలిసి ప్రేమమ్‌ను రీమేక్ చేస్తున్నానని చెప్పాడు. అల్రెడి సూపర్‌హిట్ మూవీ కదా అని అనుకున్నాను. అయితే చందుతో ఉన్న పరిచయం కారణంగా నేను చెప్పేది ఒకటే. చందు ప్రేమమ్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు. మలయాళ వెర్షన్ కన్నా బాగా చేయగలుగుతాడు. అన్నీ లవ్ ఎమోషన్స్‌తో సినిమా చేయగల నటుడు నాగచైతన్య సినిమాలో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.
కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ -''అక్కినేని నాగేశ్వరరావుగారు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఆ తరానికి ఆయనే లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్. అలాగే నాగార్జునగారు కూడా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఆయన కూడా లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్. అలాగే ఈ తరానికి నాగచైతన్య లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్. రీమేక్ సినిమా చాలా కష్టం. చందు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. పాటలు చాలా బావున్నాయి. రిలీజైన సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అన్నీ పాటలు బావున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని, చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని,ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: సాహి సురేష్, ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.