సాయికొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్‌పై అనిల్ మల్లెల, మహిమా హీరో హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం `రెండు రెళ్ళు అరు`. నందు మల్లెల దర్శకత్వంలో ప్రదీప్ చంద్ర, మోహన్ అండె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ బుల్‌గానిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. బిగ్ సీడీని ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఆడియో సీడీలను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేసి తొలి సీడీని ఎం.ఎం.కీరవాణికి అందించారు. ఈ సందర్భంగా..
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ``నిర్మాతల కలలకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరేలా బ్యానర్ డిజైన్ చేశారు. అలాగే నిర్మాతలకు అంత రేంజ్‌లో సక్సెస్‌లు రావాలని కోరుకుంటున్నాను. సాయిగారు కథ వినగానే బాగా జడ్జ్ చేసే టాలెంట్ ఉంది. ఈగ సినిమాను నేను చిన్న సినిమాగా తీద్దామని అన్నప్పుడు ఇది పెద్ద మాస్ సినిమా సార్..పెద్దగా తీద్దామని నన్నెంతో ఎంకరేజ్ చేశారు. చాలా మంచి టెస్ట్ ఉన్న నిర్మాత. ఆడియెన్స్ పల్స్ పట్టుకోగల నిర్మాత. ఈ సినిమాను చూసి చాలా ఎగ్జయిట్ అయ్యి ఆ విషయాన్ని నాకు చెప్పారు. పది లైన్స్‌లో కథను నాకు వినిపించారు. ఓపెనింగ్ సీన్ చాలా బావుందనిపించింది. ఆడియెన్స్ ఇప్పుడున్న ఎంటర్‌టైన్మెంట్స్‌ను దాటి సినిమాకు రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. అలాంటి ఇంట్రెస్టింగ్, హార్ట్ టచింగ్, హ్యుమర్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. టీమ్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ``పాటలన్నీ చాలా బావున్నాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
డి.జె.వసంత్ మాట్లాడుతూ - ``పాటలు బావున్నాయి. మా అనిల్ పెద్ద దర్శకుడు అవుతాడని అనుకున్నాను కానీ తను హీరో అయ్యాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
gallery from the event
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ - ``టైటిల్ వినగానే నాకు బాగా నచ్చింది. ఈ టైటిల్ పెట్టింది సాయి కొర్రపాటిగారు. ఐదారేళ్లలో ఐదారుగురు కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చిన నిర్మాత ఆయన. ఇంకా ఆయన కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి. పాటలు ఇవ్వాలి. వారాహి బేనర్‌లో సినిమా విడుదలవుతుంది. ఆ బ్యానర్‌లో ఇంతకు ముందు విడుదలై పెద్ద హిట్ అయిన గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ``అవుటాఫ్ ది బాక్స్ సినిమా. లవ్‌స్టోరీతో ఎంటర్‌టైన్‌మెంట్, ఓ ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. దర్శకుడు నందు, నిర్మాత ప్రదీప్, హీరో అనిల్ సినిమా ముందు ఏం చెప్పారో అదే తీసారు. హీరో హీరోయిన్స్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశారు. సాయికొర్రపాటిగారు మంచి సినిమాలకు రక్షకుడు అని చెప్పవచ్చు. ఆయన సినిమాలను అడాప్ట్ చేసుకుంటున్నాడు`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ``స్టోరీ కుదిరిన తర్వాత ఏడాదిన్నర పాటు సినిమాతో ట్రావెల్ చేశాను. ఈ ట్రావెల్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓ సినిమా చేయడం ఎంత కష్టమో తెలిసింది. సినిమా పూర్తయిన తర్వాత విడుదల చేయడానికి సరైన వ్యక్తి కోసం తిరిగాం. సాయిగారు మా సినిమాకు బ్యాక్ బోన్‌లా నిలిచారు. అందరూ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
విజయ్ బుల్‌గానిన్ మాట్లాడుతూ - ``మా దర్శకుడు నందుగారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను పక్క నుండి చూశాను. అలాగే నిర్మాత ప్రదీప్‌గారు, సాయికొర్రపాటికి థాంక్స్`` అన్నారు.
అనిల్ మాట్లాడుతూ - ``మా యూనిట్‌కు అభినందనలు అందించిన రాజమౌళి, కీరవాణికి థాంక్స్. సినిమాకు అండగా నిలబడ్డ సాయికొర్రపాటికి థాంక్స్`` అన్నారు.
దర్శకుడు నందు మల్లెల మాట్లాడుతూ - ``ఒక గొప్ప కథ రాసుకుంటే అది అందరినీ ట్రావెల్‌లో ముందుకు తీసుకెళుతుందని రెండు రెళ్ళు ఆరు సినిమా రుజువు చేసింది. మా టీం కన్న కలలకు నిర్మాతలు ప్రదీప్, మోహన్‌గారు రూపమిస్తే, సాయికొర్రపాటిగారు దానికి ప్రాణం పోశారు. అందుకు సాయిగారికి థాంక్స్. నేను ఈరోజు ఈ స్టేజ్‌పై నిలబడ్డానికి కారణం నా టీం మాత్రమే. హీరో అనిల్, రైటర్‌గా కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. అలాగే రైటింగ్ డిపార్ట్‌మెంట్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ సహా అందరికీ థాంక్స్. విజయ్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు`` అన్నారు.