22 June 2017
Hyderabad
శ్రీ కార్తికేయ సమర్పణలో పి.యు.కె ప్రొడక్షన్స్ పై నిర్ణయం దీపిక్ కృష్ణన్ నిర్మిస్తున్న చిత్రం `తొలి పరిచయం`. వెంకీ, లాస్య నాయకానాయికలుగా నటిస్తున్నారు. మురళీ మోహన్, సుమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంద్రగంటి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ బిగ్ సీడీనీ, సీడీలను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ` మంచి నటులున్నారు. మూడు పాటలు బాగున్నాయి. ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయి. హీరో, హీరోయిన్లు కథకు బాగా కుదిరారు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
`మా` అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, ` దర్శకుడు రాధాకృష్ణ మంచి ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి అందాలను సినిమాలో బాగా చూపించారు. కెమెరా పనితనం బాగుంది. సినిమా విజయం సాధించింది భవిష్యత్ లో టీమ్ అందరికీ మంచి అవకాశాలు రావాలి` అని అన్నారు.
సంగీత దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ, ` నేను పుట్టింది సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నాకు బ్రదర్ అవుతారు. అయితే ఈ ఛాన్స్ దర్శక నిర్మాతల వల్లే ఈ ఛా న్స్ వచ్చింది. గతంలో పవన్ కల్యాణ్ గారి జనసేన అధికారిక సాంగ్ ను నేనే కంపోజ్ చేశాను. అలాగే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం సాంగ్ కూడా చేశాను. గాయకుడిగా నేషనల్ లెవల్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అలాగే వేటూరి గారితో నా ప్రయాణం కొనసాగింది. ఆయన వల్ల సాహిత్యం పై మంచి పట్టు వచ్చింది. ఈ సినిమాలో సింగర్ గా..లిరిక్ రైటర్ గా..సంగీత దర్శకుడిగామూడు పాత్రలు పోషించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా` అని అన్నారు.
దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ, ` మురళీ మోహన్ గారు కథ విని బాగుందని ప్రశంసించారు. అదే సినిమాకు తొలి సక్సెస్. ఆయన చేతుల మీదుగా ఈరోజు మా సినిమా ఆడియో వేడుక జరగడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుడా నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
చిత్ర సహ నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ, ` చక్కటి కథ , కథనాలతో సినిమా తెరకెక్కుతోంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు. పాటలన్నీ సందర్భాను సారంగా ఉంటాయి. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఈ వేడుకలో మల్కాపురం శివకుమార్, రాజ్ కందుకూరి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రఘుబాబు, చత్ర పతి శేఖర్, వైవా హర్ష, రాగిణి, మధుమణి, ప్రీతి నిగమ్ , కళ్ళ కృష్ణారావు, సురభీ దీప్తి, మాధవి నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, కాసర్ల శ్యామ్, కరుణాకర్ అడిగర్ల, కొరియోగ్రఫీ: కృష్ణారెడ్డి, ఎడిటింగ్ఐ కృష్ణపుత్ర, నేపథ్య సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: శ‌్రావణ్ కుమార్, సహ నిర్మాతలు సురేష్ కుమార్.