రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా 'ఊ.పె.కు.హ'. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనేది కాప్షన్. సాక్షీ చౌదరి కథానాయిక. 'నిధి' ప్రసాద్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సోమవారం హైదరాబాద్‌లో విడుదలైంది. బిగ్ సీడీని జెమిని కిరణ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా....
దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈ రోజు అనూప్ రూబెన్స్ హీరో. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తనని నా సినిమాకు సంగీతం చేయమని అడిగే సమయంలో తను చాలా బిజీగా ఉన్నాడు. అయినా కూడా నేను అడిగానని సినిమాకు మ్యూజిక్ అందించారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా! ఎక్కడ ఆలస్యం అవుతుందోనని టెన్షన్ పడ్డాను. కానీ ఆయన అనుకున్న సమయం కంటే ముందుగానే ఆడియో కంప్లీట్ చేసిచ్చారు. మా సినిమా కోసం విలువైన సమయాన్ని వెచ్చించారు. అందుకు అనూప్‌కి థాంక్స్. పాటలు ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. తర్వలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ``ఇంతకు ముందు నిధి ప్రసాద్‌గారు వర్క్‌చేసిన సినిమాకు నేను కీ బోర్డ్ ప్లేయర్‌గా పనిచేశాను. ఆయనతో అప్పటి నుండి మంచి పరిచయం ఉంది. చాలా మంచి మనిషి. ఆయతో ఉన్న స్నేహం కారణంగా .. ఆయన అడగ్గానే మ్యూజిక్ అందించాను. ఈ సినిమా హిట్ అయ్యి నిధి ప్రసాద్‌గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ - ``నిధి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్‌లతో ఎప్పట్నుంచో మంచి అనుబంధం ఉంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ``సాధారణంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అని అంటుంటారు. నా సినిమాను చిన్న సినిమా అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లను సాధించాయి. నేను రాజ్‌కోటిగారితో కలిసి పనిచేసేటప్పుడు దిలీప్ అనే కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడు. ఆయనే ఇప్పుడు ఎ.ఆర్.రెహమాన్ అయ్యారు. తనతో అప్పట్నుంచి ఉన్న అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు అనూప్ కూడా తాను కీ బోర్డ్ ప్లేయర్‌నని చెప్పుకోవడం వింటుంటే ఆనందంగా ఉంది. అర్భన్ కామెడీ సినిమా. ఇందులో 80 నటీనటులు నటించారు. నిధి ప్రసాద్ చక్కగా సినిమా తీశాడు. నేను త్రివిక్రమ్‌గారితో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, మహేశ్ శ్రీమంతుడు సినిమాలు చేశాను. ఆయా సినిమాలు చేస్తున్న క్రమంలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదో ఇప్పుడు కూడా నిర్మాతల నుండి అలాంటి మంచి సహకారం లభించింది. కంఫర్ట్‌తో చేశాను. భాగ్యలక్ష్మి, విక్రమ్‌లు సినిమాను చక్కగా నిర్మించారు. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
సాక్షి చౌదరి మాట్లాడుతూ - ``అనూప్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. నిధిప్రసాద్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు`` అన్నారు.