'స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో సూపర్‌హిట్ చిత్రాలతో యూత్‌లో యంగ్ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంటగా 21F ఫేం హెబాపటేల్ మరియు తమిళం లో 'అట్టకత్తి', 'ముందాసిపత్తి', 'ఎధిర్ నీచల్' లాంటి వరస సూపర్‌హిట్స్ లో నిటించిన నందిత స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'టైగర్' ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. మేఘన ఆర్ట్స్ నిర్మాణంలో మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో ఢిఫరెంట్ లవ్ స్టోరి ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 18న గ్రాండ్ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సెలబ్రేషన్స్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా మంచు విష్ణు మాట్లాడుతూ - ``ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలని నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా సోషియో ఫాంటసీ సినిమా చేస్తాను. మంచి ఉన్నప్పుడు చెడు ఎలా అయితే ఉంటుందో, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం, ఆత్మలుంటాయనే విషయాన్ని నేను నమ్ముతాను. నిఖిల్ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోల్లో ఒకడు. తను హీరోగా చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``ఎక్కడికి పోతావు చిన్నవాడా టీజర్ నాకు విపరీతంగా నచ్చింది. అందుకే ట్రైలర్ చూద్దామని వచ్చాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
వెన్నెలకిషోర్ మాట్లాడుతూ - ``నేను, నిఖిల్ కలిసి యాక్ట్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నిఖిల్ ఎనర్జీని దర్శకుడు ఆనంద్ చాలా చక్కగా వాడుకున్నారు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ అందించారు. మూవీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను``అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ - ``దర్శకుడు ఆనంద్‌గారి ప్రతి కథలో సైన్స్ ముడిపడి ఉంటుంది. ఆయన సైన్స్‌తో ముడిపెట్టకుండా చేసిన సినిమా టైగర్. టీజర్ బాగా నచ్చింది. సినిమా బావుంటుంది. పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ``మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యపీగా ఉంది. చాలా కొత్తగా ఉండే సినిమా. నిఖిల్ మంచి కోస్టార్. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు ఆనంద్ చాలా మంచి టెక్నిషియన్. ఇలాంటి సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది`` అన్నారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ - ``నమ్మకాల ప్రశ్నలుంటాయి. నిజాలకు ప్రశ్నలుండవు. ఆత్మలుంటాయా ఉండవా అంటే ఎవరి నమ్మకం వారిది. మనిషి చనిపోయిన తర్వాత శరీరం 21 గ్రాముల బరవు తగ్గుతుందనే విషయం సైంటిఫికల్‌గా రుజువైంది`` అన్నారు.
సుశాంత్ మాట్లాడుతూ - ``ప్రపంచంలో అన్ని తెలిసిన విషయాలే ఉంటే ఎగ్జయిట్‌మెంట్ ఉండదు. అందుకే నాకు ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి సినిమాలంటే బాగా ఇష్టం. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీజర్ చూడగానే నిఖిల్, ఆనంద్‌గారిని అభినందిస్తూ మెసేజ్‌లు కూడా పెట్టాను. పాటలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్, సినిమాటోగ్రపీ చాలా బావున్నాయి. నవంబర్ 18 కోసం వెయిట్ చేస్తున్నాను`` అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``దేవుడున్నాడా..లేదా అనే విషయాన్ని నమ్ముతున్నామంటే ఆయనున్నాడనే విషయం నమ్ముతున్నట్టే. కాబట్టి నేను దెయ్యం ఉన్నాడనే విషయాన్ని నమ్ముతున్నాను. నిఖిల్ హ్యాపీడేస్ టైంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏదో సినిమా చేయాలని కాకుండా ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేసి సినిమా చేస్తాడు. ఆనంద్ గురించి నాకు తెలుసు. ఆనంద్, నిఖిల్ కలిసి సినిమా చేస్తున్నారనగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఆయనతో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నాను. హెబ్బాపటేల్ చాలా అందంగా ఉంది`` అన్నారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ - ``టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చందు మొండేటి మాట్లాడుతూ - ``నిఖిల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ. తన ప్రతి సినిమా పెద్ద హిట్ కావాలనుకుంటున్నాను. దర్శకుడు ఆనంద్, నిర్మాతలతో మంచి పరిచయం ఉంది.
నందిత శ్వేత మాట్లాడుతూ - ``ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆనంద్, సపోర్ట్ చేసిన నిఖిల్‌కు, నిర్మాతగారికి థాంక్స్. శేఖర్‌చంద్ర మ్యూజిక్, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ బావున్నాయి. సినిమా నవంబర్ 18న విడుదల అవుతుంది`` అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ - ``నిర్మాతలు వెంకటేశ్వరరావుగారు కథ వినగానే వెంటనే ఒప్పుకుని గ్రాండ్‌గా తెరకెక్కించారు. సినిమా మంచి ఎంటర్‌టైన్మెంట్, థ్రిల్లింగ్‌ను ఇచ్చే సినిమా అవుతుంది. ఆనంద్ మంచి దర్శకుడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కార్తీకేయ తర్వాత శేఖర్ చంద్రగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హెబ్బా, నందితశ్వేత అద్భుతంగా నటించారు. ఇది హర్రర్ సినిమాయే కాదు, సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడి, రొమాన్స్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. నవంబర్ 18న సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - ``ఎక్కడికిపోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. మూడేళ్లుగా ఈ కథతో ట్రావెల్ అవుతున్నాను. నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. సినిమా రెడీ అయ్యింది. నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ కథ విన్న మూడో రోజునే సినిమ చేయడానికి అగ్రిమెంట్‌పై సంతకం చేశాడు. వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. మంచి టెక్నిషియన్స్ కుదిరారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ సూపర్బ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా కుదిరింది. సాయిశ్రీరాంగారు తన సినిమాటోగ్రఫీతో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ - ``ఈ సినిమాకు పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కార్తికేయ తర్వాత నిఖిల్ పిలిచి కథ వినమన్నారు. అన్ని ఎమోషన్స్ ఉన్న కథ. మనసు పెట్టి చేయాలనుకుని డిసైడ్ చేసుకున్నాను. లవ్ సాంగ్, సోలో లేడీ సాంగ్ సహా అన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. ఆనంద్‌గారితో సినిమా చేయడం బ్యూటీఫుల్ జర్నీ. ఈ సినిమా భాగం కావడం ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్`` అన్నారు.