pizza
Paisa Vasool audio success meet
`పైసా వ‌సూల్‌` ఆడియో స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 August 2017
Hyderaba
d

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా భ‌వ్య‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వి.ఆనందప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `పైసావ‌సూల్‌`. ఈ సినిమా ఆడియో స‌క్సెస్ మీట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరిబాల‌కృష్ణ‌, శ్రియ‌, పూరిజ‌గ‌న్నాథ్‌, ముస్కాన్‌, కైరాద‌త్‌, వి.ఆనంద‌ప్ర‌సాద్‌, అన్నేర‌వి, పుల‌గం చిన్నారాయ‌ణ‌, భాస్క‌ర‌భ‌ట్ల త‌దిత‌రులు పాల్గొన్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌర‌వ అతిథిగా ఎ.కోదండ‌రామిరెడ్డి విచ్చేవారు. ఈ సంద‌ర్భంగా...

నంద‌మూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సాధార‌ణంగా నేను సినిమా పరిశ్రమలో పెద్ద‌గా ఎవరినీ కలవను. కానీ మోహన్‌బాబుగారిని వారి పిల్లలైన విష్ణు, మంచు ల‌క్ష్మి, మ‌నోజ్‌ల‌ను మాత్రమే కలుస్తా. ఆ కుటుంబంతోనే నాకు ఎక్కువ చనువు. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన కోదండరామిరెడ్డిగారితో నాది చాలా మంచి కాంబినేషన్‌. మోహ‌న్‌బాబు, కోదండ రామిరెడ్డి ‘పైసా వసూల్‌’ ఆడియో సక్సెస్‌మీట్‌కు వచ్చినందుకు థాంక్స్‌. డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌తో ఎప్పటినుంచో చేయాలని ఉంది. కాస్త లేట్‌ అయింది. ఆర్టిస్టులకు చాలెంజ్‌ ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఇమేజ్‌ అడ్డు వచ్చినప్పుడు సవాల్‌ ఎదురవుతుంది. నేను అలాంటివి ఎక్కువగా ఆలోచించను. వివిధ నేపధ్యాల‌లో సినిమాలు చేశాను.. చేస్తాను. ప్రేక్షకుల మీద నమ్మకంతో నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయ‌న అందించిన ధైర్యం, ఆవేశం, స్ఫూర్తితోనే నేను సినిమాలు చేస్తున్నాను. సినిమాల్లోని పాత్ర‌లు పంచభక్ష పరమాన్నాన్ని పళ్లెంలో వడ్డించినట్టు చేయాలనే తపన ఉంటుంది. పూరిగురించి నాకు ఇంతకు ముందే తెలుసు. చేసేద్దామని నిర్ణయానికి వచ్చాం. పూరిని ఎప్పుడూ టెంపర్‌లో లూజ్‌ కావడం, విసుక్కోవడం వంటివి ఎప్పుడూ చూడలేదు. పోర్చుగల్‌లో 36రోజులు షెడ్యూల్‌ చేశాం.గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను 79 రోజుల్లో పూర్తి చేస్తే, ఈ సినిమాను 78 రోజుల్లో పూర్తి చేశాం. అలా ఒక్కో సినిమాకూ ఒక్కో రోజుకూ తగ్గించుకుంటూ వస్తున్నాం. సినిమా చాలా భారీగా ఉంది. సెట్స్‌, కార్‌ ఛేజ్‌లు భారీగా ఉన్నాయి. అందరినీ మంచి అట్మాస్‌ఫియర్‌ క్రియేట్‌ చేసేది ముందు నిర్మాత, తర్వాత దర్శకుడు. అలాంటి అద్భుతమైన మనిషి పూరి. మా ఇద్దరికీ బాగా జెల్‌ అయింది. ఆయనకు ఎప్పుడూ పని గురించే ఆలోచన ఉంటుంది. మంచి సినిమా చేయాలనే తపన ఆయనకు ఉంటుంది. ఈ సినిమాను శ్రియ చేసినందుకు కూడా థాంక్స్‌ చెప్పాలి. సినిమా అంటే సమిష్టి కృషిగా చూస్తా. షాట్‌ అయ్యాక నేనెప్పుడూ కెమెరామెన్‌నే చూస్తా. డైరక్టర్‌ ఐడియాను స్ర్కీన్ మీద చూపించేది కెమెరామేన్‌. సినిమాను సెప్టెంబ‌ర్ 29న అనుకున్నవాళ్లం ఐదు వారాల ముందు విడుదల చేస్తున్నాం. సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాకు అవసరమైనంతవరకే ఈ సినిమాలో చేశాం. ఛార్మి అన్ని బాధ్యతలను చాలా బాగా నెరవేర్చింది. ఇంత బాగా విడుదల చేయడానికి కారణం ఛార్మి. సినిమా బావుందని ఎడిటర్‌ చెప్పారు. టెక్నీషియన్లు చాలా బాగా చెప్పారు. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు. ఫైటర్స్‌ అసోసియేషన్ 25సంవ‌త్సరాల ఫంక్ష‌న్‌కి 25కి నాన్నగారు అటెండ్ అయితే, 50 సంవ‌త్స‌రాల వేడుక‌కి నేను వెళ్లాను. అలాగే 75 సంవ‌త్స‌రాల వేడుక‌కి మోక్ష‌జ్ఞ‌ని, 100 సంవ‌త్స‌రాల వేడుక‌కు దేవాంశ్‌ను పంప‌తాన‌ని మాటిచ్చాను. ఈ సినిమాకు ముందు ‘రైతు’ సినిమా అని అనుకున్నా.. నాన్నగారి బయోపిక్‌ కోసం కూడా చాలా చేస్తున్నా. కె.ఎస్‌.రవికుమార్‌ షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌తో 60శాతం పూర్తవుతుంది. ఇండసీ్ట్ర మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాను. బాల‌కృష్ణ సినిమాను ఎలా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటారో ఈ సినిమా అలాగే ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పిస్తుంది`` అన్నారు.

మంచు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా నిర్మాతకి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. బాలయ్యబాబు గురించి ఏం చెప్పాలి? భారతదేశమే కాదు.. ప్రపంచమే గర్వించదగిన మహానటుడు మా అన్నయ్య. నాకూ, అన్నయ్యకున్న సంబంధం పూర్వజన్మసుకృతం. నా తల్లిదండ్రుల్ని, గురువును ఎలా గుర్తుపెట్టుకుంటానో, మా అన్నయ్యను కూడా ప్రతిరోజూ అనుకుంటూ ఉంటా. మా అన్నగారి కుమారుడి పట్ల చాలా ఆనందంగా ఉంది. మద్రాసు ప్రోగ్రామ్‌ని కేన్సిల్‌ చేసుకుని ఇక్కడికి వచ్చా. ఇది నా ఇంట్లో వేడుక కాబట్టి వచ్చాను. రకరకాలుగా టీజ్‌ చేస్తుంటారు. అది మంచిది కాదు. బాలయ్య ఇవాళ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన త‌న సినిమాల‌ను డబ్బిచ్చి ఆడించలేదు. తను కొత్తగా రికార్డు చెప్పక్కర్లేదు. ఆయన సిల్వర్‌ జుబ్లీలు, గోల్డెన జుబ్లీలు ఆడాయి. మంచి నటుడి కుమారుడు గొప్పనటుడిగా ప్రూవ్డ్‌ హిమ్‌సెల్ప్‌. ఏదో ఒకటి చేయకండి. బాలయ్య వండర్‌ఫుల్‌ యాక్టర్‌. ప్రతిపిక్చర్‌లోనూ ఒక వెరైటీ, ఒక డైలాగ్‌ ఉంటుంది. అన్నయ్యని ఇమిటేట్‌ చేశానంటే నేను ఒప్పుకోను. చూసి బాగోలేకపోతే నేను ఫోన చేసి చెప్తా. రూ.101కోట్లకన్నా ఎక్కువ కలెక్ట్‌ చేయాలి. చంద్రబాబుకు మందుతాగే అలవాటు లేదు. ఎవరు ఇవ్వాలి?.. ఎందుకు పాడావో నాకు అర్థం కాలేదు. ధైర్యం చేసి ఒక పాట పాడటం మామూలు విషయం కాదు. రిథమ్‌కు తగ్గట్టు అద్భుతంగా పాడారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ గోస్‌ టు ద డైరక్టర్‌. డైరక్టర్‌ క్రియేటర్‌. నాకు పూరి అంటే చాలా ఇష్టం. నేను, మా బావా ప్రభాస్‌ బుజ్జిగాడులో పనిచేశాం. అంత ఫాస్ట్‌గా తీసే డైరక్టర్‌ని నేను చూడలేదు. మనతల్లిని ఎలా గౌరవిస్తామో, మన కళు అలా గౌరవించాలి. సినిమానే మన ఊపిరి’’ అని చెప్పారు.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘ఆనందప్రసాద్‌గారితో వర్క్‌ చేయడం చాలా బావుంది. ప్రొడక్షన్‌తో పాటు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. మావా ఏక్‌ పెగ్‌ లా రాకింగ్‌. పిల్లలు కూడా పాడేస్తున్నారు. బాలయ్యతో ఇన్నాళ్లు చేయక మిస్‌ అయ్యా. ఇప్పుడు షూటింగ్‌ పూర్తయ్యాక రోజూ మిస్‌ అవుతున్నా. ఇలాంటి హీరోని నేను ఇప్పటిదాకా చూడలేదు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న నటుడు ఆయన. ఇలాంటి డెడికేషన్‌ నేను బాలయ్యకన్నా ముందు మోహనబాబుగారిలో చూశా. రామారావుగారి లక్షణాలన్నీ బాలయ్యగారిలో ఉన్నాయి. బాలయ్యగారి ఎనర్జీని మిస్‌ అవుతున్నా. బాల‌కృష్ణ‌గారిఇ సినిమా అంటే ఇష్టం. లైట్‌ పోతుంది అని అందరినీ పిలిచి గబగబా కెమెరా పక్కకి వెళ్లి నిలుచున్న హీరో బాలయ్య. కొత్తవాళ్లు చాలా మంది చేశారు. అయినా వాళ్లందరినీ ఆయన ఎంకరేజ్‌ చేశారు. సెప్టెంబర్‌ 29న విడుదల చేయాలనుకుంటే ఐదు వారాల ముందు తనకు కావాలని నిర్మాతగారు అడిగారు. 5 వారాల ముందు రావడానికి ఛార్మి చాలా ప్లాన్‌ చేసింది. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌`` అన్నారు.

Glam galleries from the event
 

నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``మ్మంలో ఒకటిన్నర లక్షల మంది సమక్షంలో ఆడియో విడుదల చేశాం. అరగంట కుంభవృష్టి పడింది. అయినా ప్రేక్షకులు సీట్‌ నుంచి కదల్లేదు. ఇంత చక్కటి అవకాశాన్నిచ్చిన బాలయ్యబాబుగారికి ధన్యవాదాలు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక తీరింది. ఆయనతో ముందుముందు సినిమాలు చేస్తాను. వాళ్ల నాన్న పాటను ఇమిటేట్‌ చేశారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టంట్‌ మాస్టర్స్‌ అసోసియేషన వారు చెన్నైలో సభ పెట్టుకుంటే మన మంచు విష్ణు,. బాలకృష్ణగారు వెళ్లారు. ఆయన తమిళంలో మాట్లాడిన స్పీచ్‌ అద్భుతంగా ఉంది అని చెప్పారు. వాళ్ల నాన్నగారి బయోపిక్‌ తీయడానికి ఆ రోజుల్లో ఆయనతో సహచర్యం ఉన్నవారితో కూర్చుని డిస్కస్‌ చేశారు. ఆయన ఫ్యాన్సలో 101 మంది పేదవిద్యార్థులకు సాయం చేశాం. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.10వేలు ఇస్తాం. నందమూరి తారకరత్నగారి ఆధ్వర్యంలో 236యూనిట్ల బ్లడ్‌ను ట్రస్ట్‌కు అందజేశారు. సామాజిక దృక్పథంలో మంచి పనులు చేస్తూ వారికి మంచి పేరు తేవాలి. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా మీ ముందుకు రానుంది. పూర్తి మాస్‌ మసాలా సినిమా ఇది. ’’ అని చెప్పారు.

చార్మి మాట్లాడుతూ ‘‘ఆడియో విజయం కావడం ఆనందంగా ఉంది. అనూప్‌కీ, ఈ ఆడియోకి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. ఆనందప్రసాద్‌గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ‘మాతో జర్నీ మొదలుపెట్టండి. చాలా బావుంటుంది’ అని అన్నారు. నిజంగానే ఆ జర్నీ చాలా బావుంది. ఆయన మమ్మల్ని నమ్మి వదిలేశారు. ఇలాంటి నిర్మాత దొరకడం చాలా కష్టం. 29 సెప్టెంబర్‌ అనుకున్నాం.. కానీ సెప్టెంబర్‌ 1న విడుదదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్‌ సీజీ, డిఐ పనులు చాలా త్వరగా పూర్తి చేసిచ్చారు. ప్రసాద్‌ ల్యాబ్‌ డబ్బింగ్‌ స్టూడియో నుంచి అందరూ చాలా ఇష్టంగా పూర్తి చేశారు. పూరి కనెక్ట్స్‌ టీమ్‌కి చాలా ధన్యవాదాలు చెబుతున్నాను. బాలయ్యగారంటే మాకు చాలా ఇష్టం. నేను నిద్రలేచినప్పుడు బాలయ్యను మిస్‌ చేస్తున్నాను. షూటింగ్‌లో దేనికైనా రెడీ అనేవారు బాలయ్యగారు. తొలిసినిమాలాగా చేశారు. ఈ జర్నీ ఎండ్‌ కావడం నాకు ఇష్టం లేదు. నేను ఆయనతో లవ్‌లో ఉన్నా. ఆయనతో జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అలీగారు పూరిగారి ప్రతి సినిమాలో ఉంటారు. ఈ సినిమాలోనూ చాలా బావుంటారు. ఆర్ట్‌ డైరక్టర్‌ జానీ, ఎడిటర్‌ జునైద్‌గారు.. అందరూ చాలా బాగా చేశారు. శ్రియతో నేనెప్పుడూ స్ర్కీన స్పేస్‌ షేర్‌ చేసుకోలేదు. కానీ ఇప్పుడు శ్రియకు, నాకూ భార్యాభర్తలకన్నా చాలా ఎక్కువ మంచి సంబంధం ఉంది. కైరా, ముస్కాన చాలా బాగా ఉనాన్రు. కైరా సినిమాలో హాట్‌గా ఉంది. ముస్కాన బాపుగారి బొమ్మగారిలానే ఉంది. పూరిగారిలాంటి బిజినెస్‌ పార్ట్‌నర్‌ ని చూడటం కష్టం. పూరిగారికి మా హోల్‌ టీమ్‌ తరఫున థాంక్స్‌’’ అని చెప్పారు.

పాట‌ల ర‌చ‌యిత పుల‌గం చిన్నారాయ‌ణ మాట్లాడుతూ - ``ఎర్ర‌బ‌స్బు కోసం వెయిట్ చేస్తున్న వాడికి ఏయిర్ బ‌స్ వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ఇలాంటి డైమండ్ ఛాన్స్ ఇచ్చిన బాల‌కృష్ణ‌గారు, పూరిగారు, నిర్మాత ఆనంద ప్ర‌సాద్‌, అన్నేర‌విగారు స‌హా అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

భాస్క‌ర భ‌ట్ల మాట్లాడుతూ - ``అనూప్ అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించారు. ఈసినిమాలో మూడు పాట‌ల‌ను రాశాను`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved