`ఫిదా` చిత్రం లో సాయి పల్లవి అత్త పాత్రలో నటించిన టీచర్ గీతా భాస్కర్ రచించిన `డేస్టినీ ఆఫ్ చిల్డ్రన్` పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల శనివారం ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - `` గీతా భాస్కర్ గారు ఫిదా చిత్రం లో నటించిన విషయం అందరికీ తెలిసిందే, తను షూటింగ్ టైం లో ఇంటి నుండి వంట చేసి తీసుకువచ్చి యూనిట్ లో అందరికీ వడ్డించేది. అంత ఆప్యాయంగా కలిసిపోయింది మాలో, తను చిన్నపిల్లల మనోభావాలను తెలిపే పుస్తకాన్ని రచించడం చాలా మంచి విషయమే కాకుండా గరవించతగ్గ విషయం`` అన్నారు.
గీతా భాస్కర్ మాట్లాడుతూ - ``డెస్టినీ ఆఫ్ చిల్డ్రన్ పుస్తకావిష్కరణ కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారికి నా కృతజ్ఞతలను తెలియచేస్తున్న`` అన్నారు.
ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి శేఖర్ కమ్ముల లతో పాటు తరుణ్ భాస్కర్, వినయ్ భాస్కర్, రాజ్ కందుకూరి తదితరలు పాల్గొన్నారు.