`క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు.
'జస్ట్ ఫర్ ఫన్' అని 'మా' టీవీలో సందడి చేసినా, 'యాహూ' అని ఈటీవీలో అల్లరి చేసినా, 'స్వరనీరాజనం' అని తీయని స్వరంతో 'జీ తెలుగు'లో మాట్లాడినా, 'ఆట' డ్యాన్స్ షో ద్వారా అలరించినా... ఏ ప్రోగ్రామ్ కైనా, ఏ ఛానల్ కైనా యాంకర్ చిత్రలేఖ న్యాయం చేస్తారు. డ్యాన్స్ షో, టాక్ షో, మ్యూజిక్ షో ఏదైనా ఓకే. అందుకే యాంకర్ గా రాణీ చిత్రలేఖ బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు. ఇక, బుల్లితెర నటిగా 'రాధా మధు', 'నాన్న', 'మానసవీణ', 'సీతారామపురం' వంటి సీరియల్స్ ద్వారా నటిగా తానేంటో నిరూపించుకున్నారు.
యాంకర్ గా, నటిగా మాత్రమే కాదు.. 'వన్నెపూల విన్నపాలు'తో తనలో మంచి రచయిత్రి కూడా ఉందని నిరూపించుకోవడానికి రాణీ చిత్రలేఖ మన ముందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆమె రచించిన `వన్నెపూల విన్నపాలు పు స్తకావిష్కరణ కార్యక్రమం సీనియర్ రచయిత శివారెడ్డి తో పాటు పలువురు రచయితల చేతుల మీదుగా జరిగింది.
చంద్రబోస్ మాట్లాడుతూ,` మంచి పరీశీలనతో బుక్ రచించారు. చక్కని భావుకత ఉంది. ఈ బుక్ లాంచింగ్ రావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా` అని అన్నారు.
రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ, చిత్రలేఖ యాక్టర్ గా పరిచంయం. మంచి నటి అవుతుంది. అంకిత భావం ఉంది. కానీ మంచి వ్యాఖ్యాత అయింది. సడెన్ గా నా దగ్గరకు వచ్చి బుక్ రాసాను రావాలంటే ఆశ్చర్యపోయాను. ముందుమాటలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అవి చూసి బుక్ రాయోద్దు...రాస్తూనే ఉండని అన్నా` అని అన్నారు.
రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ,` నేను ఎదగడంలో చిత్రలేఖ పాత్ర ఉంది. నేను, ఆమె కలిసిన ప్రోగ్రామ్స్ నా రాజకీయ రంగానికి బాగా పనికొచ్చింది. తెలంగాణ అత్యంత క రువు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మంచి స్థానానికి చేరుకుంది. ఆ జిల్లా పేరు చెప్పుకోవాలంటేనే సముసాయించే వాళ్లం. కానీ ఆమె ఇక్కడ పోటీని తట్టుకుని నిలబడి సక్సెస్ అయింది. పుస్తకం ఇంకా చదవలేదు. బాగా రాసిందని అంతా అంటుంటే చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ,` చిత్ర లేఖ రాధా-కృష్ణలపై పు స్తకం రాసి చాలా పెద్ద సాహసం చేసింది. కొన్ని కొన్ని అంతగా సరిగ్గా లేకపోయినా ఎక్కువ భాగం పుస్తకంలో అంశాలు బాగున్నాయి. ఆమెలో మంచి ర చయిత్రి ఉంది` అని అన్నారు.
శివారెడ్డి మాట్లాడుతూ,` 1200 వందల ప్రోగ్రామ్స్ ఆమె చేసింది. మంచి వ్యాఖ్యాత. చక్కని నటన, డ్యాన్స చేస్తుంది. ఆమె ఆల్ రౌండర్` అని అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ,` చిత్రలేఖ గారు ఇప్పటితరం వాళ్లకు రోల్ మోడల్ గా నిలుస్తారు. మంచి పుస్తకం రాసి ఇంతమంది రచయితల సమక్షంలో నేను పాల్గొనడం చాలా గర్వంగా ఉంది` అని అన్నారు.
కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ,` చాలా పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని అర్ధం కాదు. కానీ పుస్తకం రెండు సార్లు చదివాను. బాగా అర్ధమైంది` అని అన్నారు.
రాణి చిత్రలేఖ మాట్లాడూత, `నాకు చాలా మంది సహాయం చేశారు. నాలో కవయిత్రిని గుర్తించి జనార్ధన్ మహర్షిగారు. తర్వాత తనికెళ్ల భరణి గారు నాకు అన్ని రకాలుగా స్ఫూర్తి. చంద్రబోసు గారు ఇంట్లో నాకు తొలిసారి సన్మానం చేశారు. నన్ను కవయిత్రిగా గుర్తించిన వారిలో వారు ఉన్నారు. తెలుగింటి అమ్మాయి చాలా మందికి రీచ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం విషయంలో జోన్న విత్తలు రామలింగేశ్వరరావు, సౌభాగ్య, గొల్లపూడి మారుతిరావు గారి సహకారం మరువలేనిది.ఇక్కడకు నన్ను ఆశీర్వదిండానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు` అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలంతా చిత్రలేఖ పనితనాన్ని ప్రశంసించారు.