ఒక సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్, నటీనటులు, నిర్మాత ఎవరైనా ఆ సినిమాను ముందుకు నడిపించేది దర్శకుడే. అతడే కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమని నిరూపించిన దర్శకుడు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు. 50 సంవత్సరాలపాటు చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించిన దాసరి ఎందరో దర్శకులకు స్ఫూర్తి. దర్శకులు అవ్వాలనుకుంటున్న వారికి మార్గదర్శి. దాసరి పుట్టినరోజును ప్రతి సంవత్సరం దర్శకులంతా ఓ పండగలా జరుపుకునే వారు. గత సంవత్సరం దాసరి అకాల మరణంతో పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. మే 4 దాసరి జయంతి. ఈరోజును దర్శకులంతా డైరెక్టర్స్ డేగా ప్రకటించారు. శుక్రవారం ఫిలిం చాంబర్లో దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కృష్ణ, విజయునిర్మల, నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్, మురళీమోహన్, రమేశ్ ప్రసాద్, వి.వి.వినాయక్, మెహర్ రమేశ్, ఎన్.శంకర్, సి.కల్యాణ్, ఆదిశేషగిరిరావు, రవి కొట్టాక్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘‘చరిత్ర ఉన్నంత వరకు వారు అందరి హృదయాల్లో ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న వారందరికీ నా అభినందనలు. మనుషుల పుట్టుక, చావు సర్వసాధారణైమెనా కొంత మంది చరిత్రలో నిలిచిపోతారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ రావడానికి కారణమైన వారిలో దాసరిగారు ప్రముఖులు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరిగారు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గురువుగారు ఉండుంటే మనకు ఈ సమస్య ఉండేదా అని ఈరోజు అందరూ చాలా సందర్భాల్లో అనుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం దాసరిగారిని ఎవరూ మరవలేరు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని డైరెక్టర్స్ డేగా ప్రకటించినందుకు దర్శకుల సంఘాన్ని అభినందిస్తున్నాను’’ అన్నారు.
కృష్ణ మాట్లాడుతూ ‘‘దాసరిగారు దర్శకుడు కాకముందు నుండి నాతో పరిచయం ఉంది. నేన పనిచేసిన ‘మా నాన్న నిర్దోషి’ చిత్రానికి ఆయన అసోసియేుట్గా పనిచేశారు. తర్వాత జగత్ కిలాడీలు, హంతకులు, దేవాంతకులు సినిమాలకు డైలాగ్స్ రాశారు. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత నాతో రాధమ్మ పెళ్లి అనే సినిమాను తొలిసారిగా చేశారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించాను. 151 సినిమాలు డైరెక్ట్ చేయడం అంటే చిన్న మాటలు కావు. భవిష్యత్‌లో కూడా ఏ దర్శకుడు 150 సినిమాలను తీయులేడని నా నమ్మకం. ఆయన పుట్టినరోజును డైరెక్టర్స్ డేగా ప్రకటించినందుకు డైరెక్టర్స్ అసోసియేుషన్ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ ‘‘ఒకరోజు దాసరిగారు నా దగ్గరకు వచ్చి తాతా మనవడు సినిమా చేయుమని అన్నారు. నేను ‘కృష్ణ వంటి పెద్ద హీరోలతో నటిస్తున్నాను సార్! చేయులేను’ అంటే ‘నువ్వు చెయ్యమ్మా బావుంటుంది’ అని ఆయున నాతో అన్నారు. చేసిన తర్వాత కానీ తెలియులేదు. అందులో నా క్యారెక్టర్ ఎంత బాగా ఉందోనని. దాసరిగారి తొలి చిత్రం. 25 వారాలు ఆడింది. ఈ సందర్భంగా ఆయునకు నా నవుస్కారాలు తెలియుజేసుకుంటున్నాను’’ అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ భూమిపై ఎందరో పుడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్ సంకల్పం కావాలి. ఆకుంఠిత దీక్షతో తన దారిలో నడవాలి. ఆ కోవకు చెందిన వ్యక్తి దర్శక రత్న దాసరి నారాయుణరావుగారు. కొంత మందికి వయుసుతో పనిలేదు. భావితరాలకు వారు స్ఫూర్తి దాయుకంగా ఉండేవారికి వయుసుతో పనిలేదు. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా.. కలివిడిగా, ఇండస్ట్రీకి తలలో నాలుకల, దివిటీలా ఉంటూ.. ఇండస్ట్రీ ఎలాంటి సవుస్యల్లో ఉన్నా తన కుటుంబంలో సవుస్యలా భావించి వాటిని తన భుజాలపై మోసి పరిష్కరించిన వ్యక్తి దాసరిగారు. ఆయన జ్ఞాపకార్థం ఆయన శిలను ఇక్కడ ప్రతిష్టించడం మంచి పరిణామం. ఆయన దర్శకత్వం వహించిన 150వ చిత్రం ‘పరవువీరచక్ర’లో నేను నటించే అవకాశం కలిగింది. అప్పటికి ఎన్ని చిత్రాల్లో నటించినా... అన్ని చిత్రాల్లోని ఆనందం నాకు ఆ చిత్రంలో కలిగింది. ఆయున ‘శివరంజని’ సినిమా నేనే చేయాల్సింది. నాన్నగారిని దాసరిగారు అడిగితే ‘ఇప్పుడు బాబు చదువుకుంటున్నాడు కదా!చదువు పూర్తయిన తర్వాత చూద్దాం అన్నారు. ఎన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. అయితే ఈ అవార్డులన్నీ ఆయన ముందు దిగదుడుపే. మన అందరి గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. మృదు స్వభావి, కలివిడితనం, కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడటం, క్రవుశిక్షణ, సేవాదృక్పథం.. ఇవన్నీ కలిపితే నిండుకుండ మన దర్శకరత్న దాసరి నారాయుణరావుగారు. ఎంతో మంది దర్శకులు, నటీనటులకు జీవం పోశారు. ఆయన అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాంబర్ సభ్యులకు, దర్శక సంఘ సభ్యులకు నా అభినందనలు’’ అన్నారు.
ఉదయం దాసరి 76వ జయంతి వేడుకలు జరిగాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు జయంతి వేడుకలు నిర్వహించారు. ‘‘చిత్రపరిశ్రమ ఉన్నంతవరకు దాసరి నారాయణరావు సజీవంగానే ఉంటారు. సినీ పరిశ్రమలో దాసరి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు. ఆయన ఆశయాల సాధన కోసం చిత్రపరిశ్రమ కృషి చేస్తుంది’’ అన్నారు దర్శకులు కోడి రామకృష్ణ ‘‘దాసరి గారు లేని ఆయన లేనిలోటు ఇప్పుడు తెలుస్తోంది’’ అన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ జయంతి వేడుకల్లో దాసరి పెద్ద కుమారుడు ప్రభు, కుమార్తె అల్లుడు పాల్గొనగా.. ఆయన మనుమరాలు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లోనే దాసరి టాలెంట్ అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.