pizza
Telugu Cinema world records - Tummalapalli Rama Satyanarayana felicitation
"తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్"లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం!!
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 September 2017
Hyderaba
d

సుమన్-రవళి కాంబినేషన్ లో 2004లో "ఎస్ పి సింహా" చిత్రంతో నిర్మాతగా మారి.. పూర్ణ టైటిల్ పాత్రలో ఇటీవల విడుదలైన "అవంతిక"తో కలుపుకొని 12 ఏళ్లలో 92 చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు "తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్"లో స్థానం దక్కింది. తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ మరియు శాసన సభ్యులు రసమయి బాలకిషన్, ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్ ముఖ్య అతిదులుగా హాజరుకాగా.. రాజకీయ దురంధరుడు, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా రామసత్యనారాయణ ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, కె.వి.వి.సత్యనారాయణ, సాయి వెంకట్, సి.డి.నాగేంద్ర తదితర చిత్ర ప్రముఖులతోపాటు... భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ శ్రీమతి లలితారావ్, ఏ బి సి ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ డాక్టర్ కె.వి.రమణారావు, వంశీ రామరాజు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ వరప్రసాద్, ఆర్య వైశ్య నాయకురాలు శ్రేమతి రాధ తదితర ప్రముఖులు పాల్గొని రామసత్యనారాయణను అభినందించారు. ఈ ఏడాదిలో మిగతా ఎనిమిది చిత్రాలు నిర్మించి సెంచరీ కొట్టడమే కాకుండా.. వచ్చే పదేళ్లలో మరో వంద సినిమాలు నిర్మించాలని రోశయ్య అభిలషించారు. "రామసత్యనారాయణ అంటే తన తండ్రిగారికి విపరీతమైన అభిమానమని, ఆయన్ను మా చాగల్లులో సన్మానించాలని మా నాన్నగారు కోరుకొనేవారని, రామసత్యనారాయణగారు 100 చిత్రాలు పూర్తి చేయగానే ఆయన్ను చాగల్లు తీసుకెళ్లి తన చేతుల మీదుగా ఘన సన్మానం చేస్తానని సభికుల హర్షధ్వానాల మధ్య వివి.వినాయక్ ప్రకటించారు. ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ స్పూర్తితో మరిన్ని సినిమాలు తీస్తానని రామసత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం లభించడం పట్ల భారత్ ఆర్ట్స్ అకాడమీ ప్రెసిడెంట్ శ్రీమతి లలితరావ్, ఏ.బి.సి అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ కె.విరమణారావు సంతోషం వ్యక్తం చేశారు!!



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved