కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంతే, అనంత్, సైదులు వెంకీ, జబర్దస్త్ అవినాష్, టెంకాల నారి, అర్జున్, నవీన్, ధనుష్, సంజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం `ఇట్లు.. అంజలి`. నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ``ఈ సినిమా హీరో బాలనటుడిగా 50 సినిమాలు చేశారు. వాళ్ల నాన్న ప్రొడక్షన్ మేనేజర్‌గా చాలా ఫేమస్. అబ్బాయికి నటనలో మంచి పట్టు ఉంది. నాయిక కూడా నేషనల్ వైడ్ గా భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. వీరందరూ కలిసి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. దర్శకుడు వీరశంకర్ దగ్గర పనిచేసిన రోజుల నుంచీ నాకు తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి`` అని అన్నారు.
దర్శకనిర్మాత మాట్లాడుతూ ``ఇట్లు అంజలి సినిమా ప్రేమలేఖ ఆధారంతో తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్. అంజలి అనే పేరు గల అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరం. ఇద్దరు అంజలిలో ఏ అంజలి రాసిన లేఖ ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టామో ఈ సినిమాలో చూడొచ్చు. ప్రేమలో ముందడుగు అబ్బాయిలే వేస్తుంటారు. అందుకుగానూ ప్రేమ మీద అబ్బాయిల, అమ్మాయిల భావనలు, ఊహలు ఎలా ఉంటాయి? ఊహలే నిజమయితే జీవితం ఏంటి? తారుమారైన జీవితం ఏంటి? అనేది కూడా ఈ సినిమాలో చూడొచ్చు. జీవితంలో సందిగ్ధావస్థలో వున్నప్పుడు.. ప్రేమ ఎలా ఆదుకుంటుంది కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ప్రేమకు సరైన నిర్వచనం ఇంతవరకు దొరకలేదు.. అనే భావన ప్రపంచంలో వుంది.. ఆడవావరి జీవితకాలంలో వారి ప్రవర్తనలో ఆ నిర్వచనం ఉంది. అది ఏంటో ఈ చిత్రంలో చూడొచ్చు`` అని తెలిపారు.
ఈ సినిమాకు కెమెరా: వి.కె.రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్. కె.వెంకటేష్, ఆర్ట్: ఎస్.వి.మురళి.