pizza
Juvva first look launch by Chiranjeevi
చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన 'జువ్వ' ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్!
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

13 January 2018
Hyderabad




రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ జంటగా 'దిక్కులు చూడ‌కు రామయ్య‌' ఫేమ్ త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వంలో రూపొంతోన్న చిత్రం 'జువ్వ‌'. ఎస్.వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ- "అందరికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు 'జువ్వ' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. హీరో రంజిత్, ప్రొడ్యూసర్ భరత్ అన్నదమ్ములు. వీళ్ల నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. స్వతహాగా భరత్ డాక్టర్. సాధారణంగా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యామనే మాటలు వింటుంటాం. కానీ, తమ్ముడి కోసం డాక్టర్ భరత్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ విధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా నిలబడింది. టీజర్ లో రంజిత్ డైనమిక్ గా, హుషారుగా కనిపించాడు. క్యారెక్టర్ పరంగా పక్కా మాస్ అని అర్థమవుతోంది. హీరోయిన్ పాలక్ లల్వానీ రొమాంటిక్ గా, అందంగా కనిపించింది. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీళ్లిద్దరి కోసం తప్పకుండా చూస్తా. 'దిక్కులు చూడకు రామయ్య' తర్వాత దర్శకుడు త్రికోటి మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా'' అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ- "చిరంజీవిగారి నటన అంటే నాకెంతో ఇష్టం. హి ఈజ్ మై రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్. ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునేవాడిని. ఈరోజు నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా టీజర్ ను సార్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐ లవ్ చిరంజీవి. నేను ఎపుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు యుట్యూబ్ లో చిరంజీవిగారి పాటలే చూస్తా'' అన్నారు.

దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ- "చిరంజీవిగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. ప్రేమకథతో రూపొందిన సినిమా ఇది. చిన్న చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి" అన్నారు.

ప్రొడ్యూసర్ భరత్ మాట్లాడుతూ- "ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసిన చిరంజీవిగారికి థాంక్స్. 2017లో మా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున ఆడియోని, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సురేష్ పాల్గొన్నారు.

పోసాని కృష్ణ ముర‌ళి, అలీ, స‌ప్త‌గిరి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, ప్ర‌భాక‌ర్, విజయ్ చంద‌ర్, ఆనంద్, ఐనాక్స్ వెంక‌ట్, పింగ్ పాంగ్ సూర్య‌, జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామ‌చంద్ర‌రావు, ఏడిద శ్రీరాం, మోహ‌న్ రావు, హిమ‌జా, మునిరాజు, ల‌త‌, తుల‌సి, ప్ర‌స‌న్న కుమార్, ప్ర‌భాష్ శ్రీను, రాజేష్‌, భ‌ద్ర‌మ్, సురేఖా వాణి, స‌నా, దువ్వాసి మోహ‌న్ , ప్ర‌జ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ‌, ప‌ద్మ‌జా, ఫ‌రీద్, క‌బీర్, అజ‌ర్, నాగు త‌దిత‌రులు న‌టిస్తుల్లా ఈ చిత్రానికి క‌థ, మాట‌లు: ఎమ్. ర‌త్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వ‌శిష్టి, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్, జానీ, ఎడిటింగ్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు, యాక్ష‌న్: వెంక‌ట్, నందు, ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి, సినిమాటోగ్ర‌ఫీ: సురేష్‌, సంగీతం: ఎమ్.ఎమ్. కీర‌వాణి, నిర్మాత : డా. భ‌ర‌త్ సోమి, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రికోటి పేట‌.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved