11 March 2018
Hyderabad
Dr T Subbarami Reddy, Member of Parliament, in his address on the occasion of felicitating Tollywood comedian Dr K Brahmanandam in ‘Kakatiya Kala Vaibhava Mahotsavam’ held in Mahabubnagar town on Sunday, said such programmes to celebrate the art and culture of Kakatiyas would be held not only in every district across Telangana, but also in major cities of Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu, as the Kakatiya dynasty was spread across all these States around 700 years agoo.
Describing the sculptures which were carved during the reign of Kakatiya rulers as magnificent art forms which emanated power from within, he said that even Sri Krishnadevaraya was inspired by such art forms
He made it clear that there was no politics in celebrating the grandeur of the Kakatiya art and culture.
AP Jithender Reddy, Mahabubnagar MP, speaking on the occasion, said that there was a time when people used to make fun of Telangana dialect, but after the formation of Telangana, Chief Minister K Chandrashekar Rao had taken the dialect to the world stage by conducting Telugu Maha Sabha in a grand way.
Mahabubnagar MLA V Srinivas Goud reminded everyone that it was the wonderful engineering of Kakatiya rulers that Telangana could get so many irrigation tanks which were still intact and were the main source of irrigation for the State.
Jayaprada, Shraddha Das, Jeevitha, Babu Mohan, Srinivas Reddy, Raghu Babu, Aali, former MP Jaipal Reddy, MLC Ponguleti Srinivas Reddy, Nagarkurnool MP Nandi Yellaiah, Devarkadra MLA Alla Venkateshwar Reddy, Municipal Chairperson Radha Amar and several eminent personalities attended the event.
పద్మశ్రీ బ్రహ్మానందానికి 'హాస్యనట బ్రహ్మ' బిరుదు ప్రదానం
మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుక
కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ పురస్కారంతో ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. యావత్ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్ కాకతీయ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం నిర్వహించారు. 1100 చిత్రాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందంకు సంస్థ ఆధ్వర్యంలో ‘హాస్యనటబ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణను, జ్ఞాపికను బహూకరించారు. సభాపతి మాట్లాడుతూ.. కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రహ్మానందం, కార్యక్రమ నిర్వాహకుడు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభోత్సవాలు నిర్వహిస్తానన్నారు.
ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా శక్తిని అందరికీ తెలియజేస్తానని, తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ కాకతీయ కళావైభవోత్సవాన్ని నిర్వహిస్తానని అన్నారు. బ్రహ్మానందం నటనకు జీవం పోస్తారని, ఆయన ఓ జీనియస్ నటుడని కితాబిచ్చారు. 1100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించిన గొప్ప నటుడని పేర్కొన్నారు.ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తిగా భావించాలన్నారు. 700 ఏళ్ల క్రితం ఇక్కడ కాకతీయ వైభవం సాగింది. తెలుగుజాతి కళావైభవాన్ని మహోన్నతస్థాయికి తీసుకపోయిన మహానీయులు కాకతీయులు అని కొనియాడారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ బ్రహ్మానందం నటనా ప్రతిభకు పాలమూరులో సన్మానించటం మరువలేని అనుభూతిగా అభివర్ణించారు.
ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘పాలమూరు ప్రజలకు కన్నుల పండగ చేసేందుకు వచ్చిన సినీ ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది మామూలు కార్యక్రమం కాదు. కాకతీయ కళా వైభవ మహోత్సవాన్ని హైదరాబాద్ శిల్ప కళావేదికలో నిర్వహించిన తర్వాత వరంగల్‌లో చేస్తానని సుబ్బరామిరెడ్డిగారు నాతో అన్నారు. కానీ, పాలమూరు ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరా. బ్రహ్మానందం గారితో 1992లో ‘ప్రేమ ఎంతమధురం’అనే సినిమాను నేను తీస్తే దానిలో ఆయన నటించారు. విదేశాల్లో 25ఏళ్లు ఉన్న తర్వాత 1996లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అప్పుడు జీవిత రాజశేఖర్ ఎనిమిది నెలల గర్భిణి ఉండి కూడా నా తరపున ప్రచారం చేశారు. వారి అందించిన సహకారం మర్చిపోలేనిది. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని అన్నారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కళాలకు ప్రాంతాలతో సమానంలేదని, కళాకారులను తెరాసా ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందన్నారు. కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొప్పనటుడు బ్రహ్మనందాన్ని పాలమూరు వేదికగా సన్మానించటం అభినందనీయమన్నారు. ఇక్కడ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.