Organised by TSR Kakatiya Lalitha Kala Parishath at Shilpakala Vedika, the cultural fiesta rolled out a colourful extravaganza and had a series of performances that enthralled a packed audience.
Showcasing the cultural heritage of Kakatiya dynasty through folk dances and musical programmes, Kakatiya Kala Vaibhava Mahotsavam was organised as a cultural gala here on Wednesday.
Organised by TSR Kakatiya Lalitha Kala Parishath at Shilpakala Vedika, the cultural fiesta rolled out a colourful extravaganza and had a series of performances that enthralled a packed audience.
A ballet by Padmaja Reddy and her co-dancers took the audience into the world of Kakatiyas and greatness of Rani Rudrama and recieved a standing ovation.
Ch. Vidya Sagar Rao, Governor of Maharashtra was the Chief Guest at the event which also had the presence of S Madhusudhan Chary, Assembly Speaker and Swamy Goud, Legislative Council Chairman.
As part of the event, TSR Kakatiya Lalitha Kala Parishath felicitated film actor M Mohan Babu and conferred him the title ‘Viswa Nata Sarvabhouma’ on the occasion of his 42 years film career and completion of 560 films.
Former Union Minister T Subbarami Reddy said “Kakatiya rulers who ruled for over 300 years from Warangal and showed special interest in arts and culture took the pride of Telugu people to the next level. Taking inspiration from them, I want to create the Kakatiya revolution in every part of the world”.
Speaking on the occasion, Madhusudhan Chary described Mohan Babu as one of the few talented actors who entertained audience of different generations and was the right person to receive the award during Kakatiya Kala Vaibhava Mahotsavam.
Actor Balakrishna, Director Raghavendra Rao, comedian Brahmanandam, actress Jaya Prada, Jayasudha, Shreya, others were present on the occasion.
‘వైభవంగా 'కాకతీయ లలితా కళా వైభవం ' వేడుక పద్మశ్రీ డా: మోహన్ బాబు కు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదు ప్రధానం
తెలుగులో పదునైన డైలాగులు సంధించడంలో తనకు తానే సాటి అని మోహన్‌బాబు రుజువు చేసుకున్నారు. ఆయన డైలాగ్‌లు వినే వాళ్లను మంత్రుముగ్ధుల్ని చేసే శక్తి మోహన్‌బాబు సొంతం. ఆయనకు కొంచెం కోపం కూడా వుంది. నాకు బాగా తెలుసు. ఒక శాతం కోపం వుంటే 99 శాతం ఆయనలో మంచితనం వుంది. 42 ఏళ్ల సినీ ప్రస్థానంలో 560కి పైచిలుకు చిత్రాల్లో నటించి ఎందరినో మెప్పించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తరువాత ఆ స్థాయిలో డైలాగ్‌లు చెప్పగల వ్యక్తిగా గుర్తొచ్చే నటుడు మోహన్‌బాబు. ఎన్టీయార్‌తో పోల్చుకొనేలా గుర్తింపు తెచ్చుకోవడం మోహన్‌బాబు అదృష్టం అన్నారు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు. టీఎస్‌ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం పేరుతో బుధవారం భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబును విశ్వనట సార్వభౌమ బిరుదుతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ఇదే వేదికపై తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన తెలంగాణ కళాకారులైన మధుప్రియ, దాము కొసనం, మంగ్లీ(సత్యవతి), గంగవ్వలను సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సుబ్బిరామిరెడ్డి మొదలుపెట్టిన కాకతీయ కళా పరిషత్‌ను కేవలం తెలంగాణకే పరిమితం చేయకూడదు, కాకతీయ సామ్రాజ్యం అనేది తెలుగు ప్రజలందరికీ సంబంధించినది. కాకతీయ సామ్రాజ్యంలో ఓ ప్రత్యేకత వుంది. తెలుగు వాళ్లను సమైక్యం చేసిన సమైక్యసంధాతలు కాకతీయ రాజులు. దాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న తెలుగు వాళ్లందరినీ ఒక్కటి చెయ్యాలంటే అంతా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలుగును ఏవిధంగా ప్రోత్సహించాలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన సమయమిది అన్నారు. ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్‌సైట్ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు.
కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజినీరింగ్ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్‌బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్‌బాబుగారే’’ అన్నారు.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సినీచరిత్రలో విలన్‌గా నటించి మళ్లీ హీరోగా 150 చిత్రాలు చేయడం మోహన్‌బాబుకే సాధ్యమైంది. మోహన్‌బాబు ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా వున్న మనిషి. అలాంటి వ్యక్తిని విశ్వనట సార్వభౌమ బిరుదుతో సత్కరించడం ఆనందంగా వుంది. దేశ చరిత్రలో మహాసామ్రాజ్యంగా వినుతికెక్కిన కాకతీయుల పేరుమీద ఈ ఉత్సవాల్ని నిర్వహించడం ఆనందంగా ఉన్నది. తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, వివిధ నగరాల్లో రెండుమూడు నెలలకు ఒకసారి కాకతీయ కల్చరల్ ఫెస్టివల్ పేరుతో ఈ వేడుకల్ని నిర్వహిస్తాం. మార్చిలో వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దిరెడ్డిల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తాం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు.
భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్‌గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్‌బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు.
అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం. ఓరుగల్లు అంటే వరంగల్.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్‌బాబుగా మార్చారు.
1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్‌తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీ హిట్ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు.
మద్రాసులో పనిచేసే రోజుల్లో ఓ కారు షెడ్డులో వుండేవాడిని. తినడానికి తిండిలేక ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించి ఓ కోడైరెక్టర్ ఇంటికి వెళ్లాను. నేను వచ్చానని అతను తన భార్యని ఉప్మా చేయమని స్నానానికి వెళ్లాడు. తను వచ్చేలోపు పుస్తకం చదువుదామని తీస్తే అందులో వున్న ఎర్రతేలు కుట్టింది. నా 42 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిన్నింటిపై ఓ పుస్తకం రాస్తున్నాను. జత బట్టలు కూడా లేని నేను భగవంతుడి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చా అన్నారు.
హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్’ స్థాపించిన తొలిసారి మోహన్‌బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్ వరకూ మోహన్‌బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్ కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.
పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, బ్రహ్మానందం, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్ హుస్సేన్‌తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, , ఎన్ పద్మావతిరెడ్డి, ఎండీ షబ్బీర్‌అలీ, డీ శ్రీనివాస్, మాజీమంత్రులు ఈ పెద్దిరెడ్డి,