pizza
Rajiv Kanakala launches Chai Guru Herbal Tea Master Product
సినీ న‌టుడు రాజీవ్ క‌న‌కాల చేతుల మీదుగా మార్కెట్ లోకి `ఛాయ్ గురు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

09 August 2017
Hyderaba
d

కార్పోరేట్ వ‌ర‌ల్డ్...బిజీ లైఫ్.. నిద్ర‌లేమి త‌నం.. టైమ్ కు తిన‌క‌పోవ‌డం..ఆరోగ్యంపై అస్స‌లు శ్ర‌ద్ద చూప‌లేని ప‌రిస్థితులు. ప్ర‌తిఫ‌లంగా అనారోగ్యం భారిన ప‌డ‌టం. ముఖ్యంగా నేడు సమాజంలో షుగ‌ర్...బిపీ జ‌బ్బులు వ‌య‌సుతో సంబంధం లేకుండా వ‌చ్చేస్తున్నాయి. వీటిని త‌గ్గించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల హెల్త్ టిప్ లు..వాటి కోసం అన్వేష‌ణ‌లు.. గ్రీన్...టీ...లెమ‌న్ టీ ల నుంచి కొంత వ‌ర‌కూ ఫ‌లితం ల‌భిస్తోంది. అయితే తాజాగా మార్కెట్ లోకి కాపీ ఆకుల‌తో త‌యారు చేయ‌బడి ఓ ప్రొడ‌క్ట్ వ‌చ్చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ కాపీ పిక్క‌ల‌నే మ‌నం కాఫీ త్రాగ‌డానికి పిండిగా చేసే వాడాం. ఇప్పుడు కాపీ ఆకుల‌తో ఆరోగ్యాన్ని మ‌రింత మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని `ఛాయ్ గురు` హెర్బ‌ల్ టీ మాస్ట‌ర్ అనే ప్రొడ‌క్ట్ మార్కెట్ లోకి వచ్చేసింది. విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా గిరిజ‌న ప్రాంతాల్లో కాంపీ పండిచే చిన్నారావు అనే గిరిజన వాసి నుంచి ర‌మ‌ణ అనే ఒక వ్యాపార‌వేత్త దీన్ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. నేడు ప్ర‌పంచ ఆదివాసిల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ ప్రొడ‌క్ట్ కు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. సినీ న‌టుడు రాజీవ్ క‌న‌కాల చేతుల మీదుగా ప్రొడ‌క్ట్ ను లాంచ్ చేశారు.

అనంత‌రం రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ, ` ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వం రోజున నా చేతుల మీదుగా ఈ నేచుర‌ల్ ప్రొడ‌క్ట్ ను లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. 70 శాతం యాంటి ఆర్గానిక్ ఆక్సిటెంట్ తోనే త‌యారు చేయ‌డం గొప్ప విష‌యం. ఇందులో కృత్రిమ ఎరువులు వాడ‌క‌పోవ‌డం విశేషం. కాపీ గింజ‌ల‌తో పాటు, కాపీ ఆకుల‌ను కూడా ఈ విధంగా వాడుక‌లోకి తీసుకురావ‌డం గొప్ప విష‌యం. అందువ‌ల్ల గిరిజనుల‌ ఆదాయం కూడా పెరుగుతుంది. మ‌రింత మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ముఖ్యంగా బిపీ, షుగ‌ర్, స‌న్న‌బ‌డాల‌నుకుంటున్న వారికి చాయ్ గురు ఉప‌యుక్తంగా ఉంటుంది. సినిమా ఇండ‌స్ర్టీలో నాకు తెలిసిన వారికి కూడా ఈ ప్రొడ‌క్ట్ గురించి చెబుతా` అని అన్నారు.

ఛాయ్ గురు వ్వ‌వ‌స్థాప‌కుడు ర‌మ‌ణ మాట్లాడుతూ, ` పూర్తిగా స‌హ‌జ‌సిద్దంగా తాయారు చేసిన ప్రొడ‌క్ట్ ఇది. ఈ ఛాయ్ వ‌ల్ల మ‌నిషి ఆరోగ్యానికి చాలా ఉప‌యుక్తంగా ఉంటుంది. సాధార‌ణంగా కాఫీ అంటే క‌ర్ణాట‌క‌ నే గుర్తొస్తుంది. కానీ తెలుగు రాష్ర్టాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కాపీ ఆకు విరివిగా దొరుకుతుంది. దాన్ని నుంచి త‌యారుచేసిన ప్రోడ‌క్ట్ ఇది. సెప్టెంబ‌ర్ 1 ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ మార్కెట్ లో కూడా అందుబాటులో ఉంటుంది` అని అన్నారు.

ఈ స‌మావేశంలో గిరిజ‌న వాసి చిన్నారావు, జి.బి రామాంజ‌నేయులు, న‌ర‌స‌న్న త‌దిత‌రులు పాల్గున్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved