pizza
Gulf movie actor Chetan Maddineni poster launch by Nani
గల్ఫ్ కథానాయకుని ప్రచార చిత్రం ఆవిష్కరించిన నేచురల్ స్టార్ నాని
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 June 2017
Hyderabad

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని హీరోగా, యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్ నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.

ఈ చిత్రం ప్రచారంలో భాగంగా గల్ఫ్ చిత్ర కథానాయకుడి ప్రచార చిత్రాన్ని ప్రముఖ హీరో “ నేచురల్ స్టార్ నాని “ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.

హీరో నాని మాట్లాడుతూ “ గల్ఫ్ “ చిత్రం ద్వారా, శివ పాత్రలో తెరముందుకు వస్తున్న చేతన్ మద్దినేని గల్ఫ్ వలసల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్లూ కాలర్ వర్కర్లకు ప్రతినిధిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు . దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుండి తమ ఉపాధి కోసం వలస వెళ్లారు . అక్కడ వారి జీవన చిత్రాన్ని హృద్యంగా ఆలోచింప చేస్తూనే వినోదాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటిని కలిపి ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు మలిచారు . ఇందులో ” శివ “ గా నటిస్తున్న చేతన్ ఈ చిత్రం ద్వారా మంచి పేరుని, చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని తను ఆశిస్తున్నానని తెలిపారు.

గల్ఫ్ చిత్రం హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ “ నేచురల్ స్టార్ నాని “ గారి చేతుల మీదగా తన లుక్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది . ఈ చిత్రంలో నా పాత్ర ప్రేక్షకులకు పది కాలాలపాటు గుర్తుండి పోతుంది . దుబాయ్, రసల్ ఖైమాలో షూటింగ్ జరుపుకున్న ఈ సరిహద్దులు దాటిన ప్రేమ కథ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది " అన్నారు.

ఈ చిత్రం ద్వారా గల్ఫ్ సమస్యల పట్ల అవగాహన కలుగుతుందని, సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసిన ఈ చిత్రం అందరిని అలరిస్తుందని సమావేశంలో పాల్గొన్నదర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాతలు యక్కలి రవీంద్రబాబు, ఎగ్జ్ క్యుటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు పేర్కొన్నారు .

చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిలి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్, శివ తదితరులు తారాగణం.

కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్ కుమార్ కుర్రా, రాజా.జి, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved