pizza
Brundavanamadi Andaridi logo launch
`బృందావ‌న‌మ‌ది అంద‌రిదీ` లోగో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 July 2017
Hyderabad

జ‌స్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ వంగ‌ల నిర్మిస్తున్న చిత్రం `బృందావ‌న‌మ‌ది అందరిదీ`. శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ సీపాన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా లోగో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో వై వీఎస్ చౌదరి, రామి రెడ్డి, మణి శర్మ, అనిల్ సుంకర, కోనవెంకట్, గోపి, ఆనంద్ ప్రసాద్ , షేకింగ్ శేషు, రఘు పాల్గొన్నారు. అంద‌ర‌రూ కలసి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేయించి అందరూ శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు,

ఈ సంద‌ర్భంగా... వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ- `` శ్రీధర్ శ్రీపాన పుట్టిన రోజు సందర్బంగా రైటర్ నుంచి దర్శకుడి కుర్చీలో కూర్చోబోతున్నాడు, ఎన్నో మహిమల్ని చూపించే కుర్చీ ఇది. తను మెలోడి డ్రామా, ఎమోషన్స్ ఉన్న డైలాగ్స్ రాయడం లో దిట్ట. ఇక బృందావ‌న‌మ‌ది అందరిదీ చిత్ర విషయానికి వస్తే టైటిల్ చాలా ఆహ్లాదకంగా ఉంది, దానికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతానికి తోడైంది ఇక ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించ వచ్చు. మరో సారి శ్రీధర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తను చేయబోతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - ``అహ నా పెళ్ళంట, దూకుడు, నమో వెంకటేశాయ లాంటి చిత్రాలకు శ్రీధర్ శ్రీపాన రైటర్ గా పనిచేశాడు, ఇప్పుడీ బృందావన మిది అందరిదీ చిత్రానికి దర్శకుడుగా మారడం ఆనదంగా ఉంది తన లైఫ్ సక్సెస్ ఫుల్ గా సాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు``

శ్రీధర్ శ్రీపాన మాట్లాడుతూ - `` నా స్నేహితుడు రామిరెడ్డి కోసమే ఈ సినిమా చెయ్యడానికి నిర్ణయించుకున్నా, నన్నునమ్మి నాతో సినిమా చేస్తున్న నిర్మాత శ్రీనివాస్ వంగల గారికి నా కృతజ్ఞతలు, ఆయన నమ్మకమే నాలో భయాన్ని, బాధ్యతని పెంచింది నాకు, ఇక నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వై విఎస్ చౌదరి గారికి, మిగతా అందరికీ నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా.. వీరీ నాదైర్యం కూడా నాకు, బృదావనమది అందరిదీ` చిత్రం వచ్చే నెల నుంచి షెడ్యూల్ ప్రారంభించనున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః ఎం.ఎస్‌.తేజ‌, ఎడిట‌ర్ః ప్ర‌వీణ్ పూడి, నిర్మాతః శ్రీనివాస్ వంగ‌ల‌, ద‌ర్శ‌క‌త్వంః శ్రీధ‌ర్ సీపాన‌.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved