కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ, మహీధర్, సోనాక్షి సింగ్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ అశ్వినీ క్రియేషన్స్ బ్యానర్ పై , కె. శేషగిరి రావు నిర్మిస్తున్న చిత్రం 'నా లవ్ స్టోరీ'. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ జర్నలిస్ట్ మరియు శాటిలైట్ కన్సల్టెంట్ రాఘవేంద్ర రెడ్డి గారి చేతుల మీదు లాంఛ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా..
రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ, ''ఇప్పుడే 'నా లవ్ స్టోరీ' సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. చాలా మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమా ఇది. డైరక్టర్ శివ నాకెప్పటినుంచో తెలుసు. డైరక్షన్ విభాగం లోకి అడుగు పెట్టిన శివ అంచెలంచెలుగా ఎదిగి నేడు 'నా లవ్ స్టోరీ' ని తెరకెక్కించాడు. మహీధర్ కొత్త నటుడైనా చాలా కాన్ఫిడెన్స్ గా నటించాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ నా లవ్ స్టోరీ మంచి పేరు తీసుకొస్తుందన్నారు''.
హీరో మహీధర్ మాట్లాడుతూ, ''ఈ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేస్తున్న డైరక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా బాగా వచ్చేవరకు శివ గారు మా తాట తీసేశారు. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అలాంటిది. నా లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందన్నారు''.
హీరోయిన్ సోనాక్షి సింగ్ మాట్లాడుతూ, ''ఇది నా మొదటి సినిమా. నాకు తెలుగు రాదు. అయినా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. డైరక్టర్ శివ నాకు గురువు లాంటి వారు. సినిమాకు పని చేసిన వారందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశమిచ్చినందుకు థ్యాంక్స్'' అన్నారు.
డైరక్టర్ శివ మాట్లాడుతూ, ''నా లవ్ స్టోరీ. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన అశ్వనీ క్రియేషన్స్ బ్యానర్ ను బాగా నిలబెడతారని అనుకుంటున్నాను. యూత్ కి చాలా బాగా నచ్చే చిత్రమిది. ప్రతీ ఆడవాళ్లూ ఈ సినిమా తప్పక చూడాలని, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ను ఈ చిత్రంలో చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశానన్నారు''.
నిర్మాత కె. శేషగిరి రావు మాట్లాడుతూ, ''నేను సినిమా తీయాలని తిరుగుతున్న రోజుల్లో, శివ గారు పరిచయమయి,ఈ కథ చెప్పారు. వెంటనే ఈ కథ నచ్చి సెట్స్ మీదకు తీసుకెళ్లాం. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను విజయం వైపు తీసుకెళ్తారని ఆశిస్తున్నామన్నారు''.
మ్యూజిక్ డైరక్టర్ మాట్లాడుతూ, ''ఈ రోజు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తం ఆల్బమ్ లో నాలుగు పాటలున్నాయి. ప్రతీ పాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనుకుంటున్నాను'' అన్నారు.
శివన్నారాయణ మాట్లాడుతూ, ''కార్తీక సోమవారం మరియు నాగులచావితి నాడు 'నా లవ్‌స్టోరీ' మోషన్ పోస్టర్ రిలీజ్ కావడం చాలా అదృష్టం. డైరక్టర్ శివ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పటి నుంచే తెలియడంతో ఈ సినిమాలో నాకు అవకాశం దొరికింది. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా 'నా లవ్ స్టోరీ' ని శివ తెరకెక్కించాడు. డైరక్టర్ వేద అందించిన సంగీతం చాలా బావుంది. పాటలన్నీ చాలా క్యాచీగా ఉన్నాయి. మహీధర్ తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. 'నా లవ్ స్టోరీ' ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చే విధంగా ఉంటుదన్నారు''.
తోటపల్లి మధు మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరక్టర్ శివ గారికి థ్యాంక్స్. అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. మహీధర్ సినిమాలో నటించాడు అనేకంటే జీవించాడు అనడమే కరెక్ట్. ఈ సినిమాతో శివ చాలా మంచి డైరక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు'' అన్నాడు.
నటీనటులుః
మహీధర్, సోనాక్షి సింగ్, తోటపల్లి మధు, శివన్నారాయణ, చమ్మక్ చంద్ర, డి.వి లతో పాటూ, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే క్రమంలో మరికొందరు నూతన నటీనటులను కూడా వెండితెరకు పరిచయం కానున్నారు.