pizza
Brundavanamadi Andaridi movie launch
శ్రీధర్ సీపాన "బృందావనమది అందరిది" మూవీ షూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 November 2017
Hyderaba
d

జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీనివాస్ వంగల ప్రభాకర్ రెడ్డి నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బృందావనమది అందరిది "ఈ చిత్రం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో టెక్నిసియాన్స్ సమక్షం లో సింపుల్ గా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం6గంటలకు "బృందావనమది అందరిది" షూటింగ్ ప్రారంభం అయింది మొదటి షార్ట్ ని దేవుడి పట్టాలపై చిత్రీకరించాము ఫస్ట్ షార్ట్ కి కెమెరా సి రాంప్రసాద్ స్విచ్ ఆన్ చేయగా క్లాప్ నా శ్రేయోభాలసి నా మిత్రుడు పృద్వి క్లాప్ కొట్టగా ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ నేను చేయడం జరిగింది.ఇంకా మా ప్రొడ్యూసర్స్ నామీద నమ్మకం తో అన్ని భాద్యతలు నా పై ఉంచిన వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుని మంచి సక్సెస్ ఫుల్ మూవీ ని అందించాలని మా టీం అందరం కసిగా పనిచేస్తున్నాము.ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ లో ఉన్నాము మణిశర్మ గారిచ్చిన ట్యూన్స్ తో చాలా హ్యాపీగా ఉన్నాము మణిశర్మ గారిలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ తో నా మొదటి సినిమా పనిచేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను మా కెమెరామెన్ సి.రాంప్రసాద్ గారితో 2 కాంట్రీస్ మూవీ పని చేస్తున్నాము ఇప్పుడు మా "బృందావనమది అందరిది" ఈ చిత్ర టైటిల్ ఎంత అందంగా ఉందో మా చిత్రాన్ని అంతకంటే అందంగా చిత్రీకరణ మా రాంప్రసాద్ గారు100% న్యాయం చేస్తారు అని నమ్మకం ఉంది.బృందావనమది అందరిది" అడిషన్స్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది దీనికి సహకరించిన మీడియా అందరికి పేరు పేరునా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అడిషన్స్ లో సెలెక్ట్ అయిన నటి నటులను డిసెంబర్15 న మీడియా లో విడుదల చేసి డిసెంబర్ 20 నుండి కేరళలో పాటల చిత్రీకరణ తో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది అని దర్శకుడు శ్రీధర్ సీపాన చెప్పారు

సంగీతం : మణిశర్మ
కెమెరా : రాంప్రసాద్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్ : తిరుమల
కొరియోగ్రాఫర్ : రఘు
పాటలు : రామజోగయ్య శాస్త్రి
సహా నిర్మాత : రామిరెడ్డి
నిర్మాతలు :
శ్రీనివాస్ వంగాల
ప్రభాకర్ రెడ్డి కూతురు
కో డైరెక్టర్ విజయ సారధి
రచన దర్శకత్వం శ్రీధర్ సీపాన




Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved