pizza
Aatagallu movie launch
`ఆట‌గాళ్లు` సినిమా ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 October 2017
Hyderabad

జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ కీలక పాత్ర‌ధారులుగా ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఆట‌గాళ్లు`. బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొద‌లైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శేఖ‌ర్‌క‌మ్ముల క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప‌రుచూరి ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. వాసిరెర‌డ్డి ర‌వీంద్ర‌, వాసిరెడ్డి శివాజీ, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర నిర్మాత‌లు.

నారా రోహిత్ మాట్లాడుతూ ``తొలిసారి జ‌గ‌ప‌తిబాబుగారితో క‌లిసి చేస్తున్నాను. మా ఇద్ద‌రి వాయిస్‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. మా ఇద్ద‌రి గొంతుల‌ను వినాల‌ని ఉంది. విజ‌య్‌.సి.కుమార్‌గారితో నేను చేస్తున్న రెండో చిత్ర‌మిది. సాయికార్తిక్‌తో ఏడో సినిమాకు ప‌నిచేస్తున్నాను. ఇదొక డిఫ‌రెంట్‌, ఎక్స్ పెరిమెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇద్ద‌రు తెలివైన వాళ్ల మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది`` అని చెప్పారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది. గేమ్ విత్ లైఫ్ అని ఉప‌శీర్షిక పెట్టాం. పెద‌బాబు నుంచి నాకు ముర‌ళి అంటే ఇష్టం. ఆ సినిమాలో పాట‌లు, కామెడీ, సీరియ‌స్‌నెస్ ఉంటుంది. ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. దాన్ని మించిన సినిమా తీయ‌మ‌ని ముర‌ళితో చెబుతుంటాను. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాన్ని మించిన సినిమా అవుతుంది. నేను, రోహిత్‌తో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. నేను, రోహిత్ డ‌బ్బింగ్‌లో ఆడుకుంటాం`` అని అన్నారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ ``మంచి పాట‌ల‌కు, రీరికార్డింగ్‌కి అవ‌కాశం ఉన్న సినిమా ఇది`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``క‌థ న‌చ్చి ఇద్ద‌రు హీరోలు న‌టించ‌డానికి అంగీక‌రించారు. వారిద్ద‌రి గొంతులు చాలా బావుంటాయి. నారా రోహిత్‌గారు ఇలాంటి క‌థ‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కొత్త క‌థ‌లు వ‌స్తాయి. చాలా వైవిద్య‌మైన సినిమా ఇది. రెండు షెడ్యూళ్ల‌లో చేస్తాం. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటంఉది. మంచి కామెడీ కూడా ఉంటుంది. కెమెరామేన్ విజ‌య్ ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో కామెడీతో పాటు అన్ని అంశాలు పుష్క‌లంగా ఉంటాయి`` అని చెప్పారు.

మాట‌లు: గోపి, కెమెరా: విజ‌య్‌.సి.కుమార్‌, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, కార్య‌నిర్వాహ‌క నిర్మాత‌: ఎమ్‌.సీతారామ‌రాజు, నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌, వాసిరెర‌డ్డి శివాజీ, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌, స్కీన్‌ప్లే - ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved