2 August 2017
Hyderabad
కొత్త హీరోను, హీరోయిన్‌ను పరిచయం చేస్తూ నంది క్రియేషన్స్ బేనర్‌పై కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.ఎం.డి.రఫీ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'బంగారి బాలరాజు'. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ దర్శకుడు సాగర్ క్లాప్‌నివ్వగా, హీరో నాగఅన్వేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందించి ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కోటేంద్ర దుద్యాల, నిర్మాత కె.ఎం.డి.రఫీ, ఆర్ట్ డైరెక్టర్ కృష్ణమాయ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ ''దర్శకుడు అవ్వాలన్న 14 ఏళ్ళ కల ఈరోజు నిజమైనందుకు హ్యాపీగా వుంది. నా మిత్రుడు రఫీ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారుతున్నాడు. కథ విషయానికి వస్తే దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా.. మారనిది ప్రేమ ఒక్కటే. ప్రేమికులు మాత్రమే మారుతుంటారు. లైలా-మజ్ను, పార్వతి-దేవదాసు, రోమియో-జూలియట్... ఇలా చరిత్రలో విఫలమైన ప్రేమకథలు ఎన్నో వున్నాయి. మరి ఈ చిత్రంలో బంగారి, బాలరాజు ప్రేమకథ సఫలం అయిందా? లేదా? అనేది కథ. మీడియాలో ఎన్నో ప్రోగ్రామ్స్‌కి డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను'' అన్నారు.
నిర్మాత కె.ఎం.డి.రఫీ మాట్లాడుతూ ''ఇది చాలా మంచి కథ. స్క్రిప్ట్ మీద, డైరెక్టర్ మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఆగస్ట్ 17 నుండి కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ చేస్తాం. ఈ సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్ ఎవరన్నది టీజర్‌లో రివీల్ చేస్తాం'' అన్నారు.
రోహిణి, అజయ్‌ఘోష్, అప్పారావు, లేఖన, ఆర్.పి. మహేంద్రనాథ్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ః సాయిబాబు-హరి, ఆర్ట్ః కృష్ణమాయ, కెమెరాః బాబు జి.ఎల్, సంగీతంః చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు, నిర్మాతః కె.ఎం.డి రఫి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః కోటేంద్ర దుద్యాల.