Bellamkonda Sai Srinivas - Vamsadhara Creations Productions No 1 Movie launch
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీనివాస్ దర్శకత్వంలో నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత నవీన్ శొంఠినేని (నాని) మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. థ్రిల్లర్ జోనర్ మూవీ. ఇప్పటి వరకు ఎక్కడా రానటువంటి కథతో సినిమాను మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం'' అన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - ''కొత్త సినిమా అంటే కొత్త ఎగ్జయిట్‌మెంట్ వస్తుంది. నవీన్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇప్పటి వరకు నేను చేయనటువంటి థ్రిల్లర్ జోనర్ మూవీ ఇది. చాలా కథలు విన్నాను కానీ.. డైరెక్టర్ శ్రీనివాస్‌గారు చెప్పిన కథ బాగా నచ్చింది. నాకు తెలిసి ఇలాంటి కథతో సినిమా రాలేదు. అలాగే ఛోటాగారితో నా తొలి సినిమా తర్వాత కలిసి పనిచేస్తున్నాను. మంచి టీంతో కలిసి వర్క్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది'' అన్నారు.
ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ''శ్రీనివాస్ నాకు కో డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పట్నుంచి తెలుసు. కొత్తగా, అద్భుతమైన కథను చెప్పారు. హీరో, నిర్మాతలకు మంచి పేరు వచ్చేలా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ - ''నేను దర్శకుడుగా మారడానికి కారణమైన నాని, శాంతయ్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌గారికి థాంక్స్. పెద్ద దర్శకులతో పనిచేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథ నచ్చడంతో నేను డెబ్యూ డైరెక్టర్ అయినా చేయడానికి రెడీ అయ్యారు. అలాగే నాపై నమ్మకంతో నాకు మంచి టీంను అందించిన నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: స్టన్ శివ, వెంకట్, మాటలు: కేశవ్ పప్పల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, సంగీతం: తమన్.ఎస్, కెమెరా: ఛోటా కె.నాయుడు, నిర్మాత: నవీన్ శొంఠినేని (నాని), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్.