భీమవరం టాకీస్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందనున్న కొత్త చిత్రం `బటర్ ఫ్లైస్`. కె.ఆర్.ఫణిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం లో హర్షిని,రోజా భారతి,మేఘనరమి,జయ,ప్రవల్లిక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ కొట్టారు. జీవిత రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నల్లముల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..``పూర్తి మహిళలతో రూపొందనున్న చిత్రమిది. మూడు సంవత్సరాలు క్రితమే ఈ కథతో, ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నాం. మహిళలకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం`` అన్నారు.
చిత్ర దర్శకుడు కె.ఆర్.ఫణి రాజ్ మాట్లాడుతూ..`` ఆంధ్రయూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేశాను. 75 సంవత్సరాల సినీ చరిత్రలోనే అందరూ మహిళలతో చేస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలి`` అన్నారు.
నటి జీవిత మాట్లాడుతూ..`` మనలన్ని మనమే గౌరవించే విధంగా మహిళలు నడుచుకోవాలని తెలిపారు. ఆడవారిని అసభ్యకరంగా చూపించే చిత్రాలు తగ్గాలి. భవిష్యత్‌లో మహిళలను గౌరవించే చిత్రాలు మరిన్ని రావాలి`` అన్నారు.
ఏపీ ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ..``మహిళలను గౌరవిస్తే ఆ దేశం విజయ పధంలో దూసుకుపోతుంది. ఆడది అంటే మాతృత్వం..మృదుస్వభావానికి ప్రతీక.ఇలాంటి ఓ చిత్రం తీయడం మంచి ప్రయత్నం.గొప్ప విషయం`` అన్నారు.
హీరోయిన్ యు ఎస్ ఎ జోత్స్య్న మాట్లాడుతూ ..``ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర విజయానికి అందరూ సహకరించాలి`` అన్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః కె.ఆర్.ఫణిరాజ్. సాహిత్యంః డాక్టర్.. కె..గీత, సాధనాల, సంగీతంః ప్రత్యోదన్, సినిమాటోగ్రఫీః కర్ణ ప్యారసాని.