సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా సిరుని సినీ కార్పొరేషన్ బేనర్‌పై కొత్త చిత్రం హైదరాబాద్లోబుధవారం ప్రారంభమైంది. తేజ్వీర్ నాయుడు సమర్పణ. ఈ చిత్రంతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి అనకాపల్లి ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణక్లాప్ కొట్టగా, మలశాల ధనమ్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి రాహుల్ రవీంద్రన్ గౌరవ దర్శత్వం వహించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "చాలా ప్యాషన్ తో ఉన్న నిర్మాతలతో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు, ఈయన మెంటల్ మదిలో, వెళ్లిపోమాకే సినిమాలకు పని చేశారు. అలాగే మా సినిమా ఎడిటర్ చోట కె ప్రసాద్ డీజే, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలకు వర్క్ చేశారు. ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు. రియల్ లైఫ్‌లో సుశాంత్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఈ సినిమాలో తనను అలాగే చూపిస్తున్నాను. టైటిల్ విని ఇది ట్రయంగిల్ లవ్‌స్టోరీ అనుకోవద్దు. సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉండటంతో దర్శకుడిగా మారాను. అలాగని హీరోగా సినిమాలు చేయనని కాదు. హీరోగా కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా తర్వాత హీరోగా ఓ సినిమా చేయబోతున్నాను`` అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ "కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది, రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడాని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది`` అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. ఈ చిత్రం నా కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుంది. రాహుల్ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అన్నారు.
Glam gallery from the event
నిర్మాతల్లో ఒకరైన భరత్‌కుమార్ మలశాల మాట్లాడుతూ - ``సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టాం. సినిమా చేయాలనుకుంటున్న సమయంలో హరి ఓ లైన్ చెప్పాడు. ఆ లైన్ చాలా బాగా నచ్చింది. అయితే అది డెవలప్ చేయాలంటే సమయం పడుతుందని తెలుసు. ఆ సమయంలో జశ్వంత్ చెప్పిన ఈ లవ్‌స్టోరీ చక్కగా ఉందనిపించడమే కాదు, కొత్తగా ఉండటంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రాహుల్‌గారి దర్శకత్వంలో సుశాంత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.