వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్‌పై ఆశిష్‌రాజ్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'ఇగో' ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఆర్.వి.సుబ్రమణ్యం దర్శకుడు. కె.ఆర్.విజయ్ కరణ్; కె.ఆర్.కౌశల్ కరణ్, కె.ఆర్.అనిల్ కరణ్ నిర్మాతలు. తొలి సన్నివేశానికి సాయికార్తీక్ క్లాప్ కొట్టగా, శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''దర్శకుడు సుబ్రమణ్యం నాకు చాలా కాలంగా తెలుసు. నాకు కథ వినిపించాడు. కథ విన్న తర్వాత పెద్ద హీరోతో చేయాల్సిన సబ్జెక్ట్. కొత్తవారితో చేయమని నేను సలహా ఇచ్చాను'' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ''ఆకతాయి చిత్రం తర్వాత మా బ్యానర్‌లో రానున్న రెండో చిత్రమిది. ఆకతాయి సినిమా మాకు నిర్మాతలుగా మంచి పేరు తెచ్చిపెట్టింది. మంచి సినిమా తీశారని అప్రిసియేట్ చేశారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేసి సినిమాను దసరాకు విడుదల చేస్తాం'' అన్నారు.
దర్శకుడు ఆర్.వి.సుబ్రమణ్యం మాట్లాడుతూ - ''ప్రేమ గీమ జాన్‌తానై సినిమా తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇద్దరి ఇగోయిస్ట్‌ల మధ్య నడిచే ప్రేమకథ. సిటీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. సినిమాకు ముందు నెలరోజుల పాటు వర్క్‌షాప్ కండెక్ట్ చేశాం. హీరో ఆశిష్‌రాజ్, హీరోయిన్ సిమ్రాన్ చాలా కష్టపడ్డారు. రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. రెండు షెడ్యూల్స్‌ను రామోజీ ఫిలింసిటీలో చేస్తాం. మూడో షెడ్యూల్‌ను ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నాం. నిర్మాతలు 85 కథలను విని రిజెక్ట్ చేశారు. నా కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అందరికీ నచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
Simran Sharma Glam gallery from the event
హీరో ఆకాష్ మాట్లాడుతూ - ''ఆకతాయి తర్వాత చాలా కథలు విన్నాను. సుబ్రమణ్యంగారు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. నా లుక్ కొత్తగా, మాస్‌కు నచ్చేలా ఉంటుంది'' అన్నారు.
వీర శంకర్ మాట్లాడుతూ - ''దర్శకుడు సుబ్రమణ్యం చాలా సెన్సిబుల్ డైరెక్టర్ ఆయన చేస్తోన్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలి'' అన్నారు.
హీరోయిన్ సిమ్రాన్ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆశిష్‌రాజ్, సిమ్రాన్, రావు రమేష్, నరేష్, పృథ్వి, పోసాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సాహిత్యం: భాస్కరభట్ల, కాకర్ల శ్యామ్, బాలాజీ, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, మ్యూజిక్: సాయికార్తీక్, నిర్మాతలు: కె.ఆర్.విజయ్ కరణ్, కె.ఆర్.కౌశల్ కరణ్, కె.ఆర్.అనిల్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్.వి.సుబ్రమణ్యం(సుబ్బు).