pizza
Gopichand’s landmark 25th film with Sri Sathya Sai Arts launched
శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న హీరో గోపీచంద్ 25వ చిత్రం
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 November 2017
Hyderabad

After delivering hit films like Andhrudu, Yagnam, Lakshyam, Shouryam and Loukyam, our hero Gopichand’s 25th film is launched today at Ramanaidu Studios, Hyderabad. This prestigious project will be produced by Bengali Tiger fame KK Radhamohan on the banner of Sri Satya Sai Arts.

K. Chakravarthy, who provided wonderful screenplays for blockbuster films like Balupu, Power and Jai Lava Kusa will be introduced as director.

While VV Vinayak sounded the claps for first muhurtham shot, TFDC Chariman P Ram Mohan Rao switched the camera and Dil Raju directed the first shot.

On this occasion producer KK Radhamohan said, “This is my 7th film as producer on Sri Sathya Sai Arts banner. Our last hit film Bengal Tiger was also kick started with muhurtham in the same area where now our new movie began today and I feel very happy. I hope, this movie will also score big success as Bengal Tiger. Gopi Sundar is providing music and Prasad Murella will be cranking the camera. K Chakravarti is getting introduced as director with this movie. Regular shooting will begin from December 16th.”

Director K Chakravarthy (Chakri) said, “I thank my hero Gopichand Garu, producer KK Radhamohana garu for giving me an opportunity to direct this film. I am happy and I also feel more responsible because this Gopichand’s 25th film.”

Heroine Mehreen said, “I am so fortunate that my 5th film is coincided with Gopichand’s 25th film. It is a pleasure to be part of such good movie and talented crew.”

Hero Gopichand said, ‘Story narrated by Chakri is very good. Regular shooting will be commenced from December 16th. We all know how powerful message my father’s films used to carry. Along with a good message, this film will have all the commercial elements. I also feel happy to work on Radhamohan’s banner.”

Artists: Gopichand, Mehreen, Prithvi and Jayaprakash Reddy and others.

Technicians: Art AS Prakash, Dialogues Ramesh Reddy, Screenplay K Chakravarti & Bobby (KS Ravindra), Co Director Bellamkonda Satyambabu, Music Gopi Sundar, Camera Prasad Murella, Producer KK Radhamohan and Story, Direction K Chakravarthy (Chakri).

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న హీరో గోపీచంద్ 25వ చిత్రం

ఆంధ్రుడు, య‌జ్ఞం, ల‌క్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం ఈరోజు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. హీరో గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్ర‌మిది. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌నుబెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాన్ని నిర్మించిన

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మించ‌నున్నారు. బ‌లుపు, ప‌వ‌ర్‌, జై ల‌వకుశ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.,చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్‌కొట్ట‌గా, తెలంగాణ ఎఫ్ డీ సీ చైర్మన్ పి.రామ్మోహ‌న్ రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - ``మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న 7వ చిత్ర‌మిది. మా బ్యాన‌ర్‌లో గ‌త చిత్రం `బెంగాల్ టైగ‌ర్‌` ప్రారంభ‌మైన ప్రాంతంలోనే..ఈ సినిమా స్టార్ట్ కావ‌డం ఆనందంగా ఉంది. `బెంగాల్ టైగ‌ర్‌` సినిమా హిట్ అయినట్టుగానే ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవుతుంది. గోపీసుంద‌ర్ సంగీతం, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డిసెంబ‌ర్ 16 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి) మాట్లాడుతూ - ``ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌లిగించిన మా హీరో గోపీచంద్‌గారికి, నిర్మాత రాధామోహ‌న్‌గారికి థాంక్స్‌. అలాగే గోపీచంద్‌గారి 25వ చిత్రం ఇదే కావ‌డం సంతోషంగా ఉండ‌టట‌మే కాకుండా, ఓ బాధ్య‌త‌గా ఫీల‌వుతున్నాను`` అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ - ``నేను హీరోయిన్‌గా న‌టిస్తోన్న 5వ చిత్రం, గోపీచంద్‌గారికి 25వ చిత్రం కావ‌డం ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాలో పార్ట్ కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ``చ‌క్రి చెప్పిన క‌థ ఎంతో బాగా న‌చ్చింది. డిసెంబ‌ర్ 16 నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. మా నాన్న‌గారి సినిమాలు ఎంత ప‌వ‌ర్ ఫుల్ మెసేజ్‌ల‌తో ఉండేవో మ‌న‌కు తెలిసిందే. అలాంటి మంచి మెసేజ్‌తో పాటు, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. రాధామోహ‌న్‌గారి బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved