pizza
Sai Dharam Tej's Jawan movie launch
జ‌వాన్ షూటింగ్‌ మొద‌లైంది
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 January 2017
Hyderaba
d

Supreme Hero Sai Dharam Tej Jawan Launched

Supreme Hero Sai Dharam Tej and Mehreen Kaur Pirzada starrer new film Jawan to be directed by BVS Ravi and produced by Krishna under Arunachal Creations Banner has been launched today with a formal pooja ceremony. Harish Shankar is presenting the film.

NTR sounded the clapboard, while Koratala Siva switched on camera and VV Vinayak directed the first shot. Financier Satte Rangaiah also participated in the pooja ceremony.

Dil Raju said, “Sai Dharam Tej is doing the film after delivering back to back hits with Pilla Nuvvu Leni Jeevitham, Subramanyam For Sale and Supreme. BVS Ravi had worked under my production house for few films such as Bhadra, Munna, Parugu, Mr Perfect. He had narrated me Jawan story couple of years ago and I then told him to develop the story. I really liked the story. We wanted to make Krishna as producer for long time and it is finally happening with the film. We’ll give full support like as if our own production in all aspects.”

Director BVS Ravi said, “Though title is Jawan, the film won’t have any connections with ‘Jawans’ (military persons). When a middle class family is in troubles, it needs a young guy to set things. Our hero has such qualities. Intikokadu is caption of our film. Like how Jawan is essential for our country, young guys with such attitude is necessary for every family. It’s a purely family drama film. Thaman has given wonderful music. Regular shooting of the film starts from March.”

Thaman said, “Songs have come out well. We know producer for long period. This is third film for me with Sai Dharam Tej.”

Sai Dharam Tej said, “I’m glad to do the film with support of Raju gaaru. I’m doing a film of good and unique story in the combination of Ravi and Krishna. The film will certainly be engaging and entertaining.”

Guhan too attended the event.

Cameraman: KV Guhan
Music: SS Thaman
Art: Brahma Kadali
Editing: SR Sekhar
Co-writers: Kalyan Varma Dandu, Sai Krishna, Vamsi Balapanuri

జ‌వాన్ షూటింగ్‌ మొద‌లైంది

అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `జ‌వాన్`. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, ప్ర‌స‌న్న కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నారు. హ‌రీశ్ శంక‌ర్‌.య‌స్ స‌మ‌ర్పిస్తున్నారు. బి.వి.య‌స్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ క్లాప్‌నిచ్చారు. కొర‌టాల శివ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫైనాన్షియ‌ర్ స‌త్తె రంగ‌య్య పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి వ‌రుస విజ‌యాల త‌ర్వ‌త సాయిధ‌ర‌మ్‌తేజ్ చేస్తున్న సినిమా ఇది. భ‌ద్ర‌, మున్నా, ప‌రుగు, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చిత్రాల‌కు మా సంస్థ‌లో ప‌నిచేశారు బీవీయ‌స్ ర‌వి. రెండేళ్ల క్రిత‌మే నాకు ఈ లైన్ చెప్పాడు. చాలా బావుంది డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నాను. చేశాడు. క‌థ చాలా బాగా కుదిరింది. కృష్ణ‌ని నిర్మాత‌ని చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ ఉన్నాం. ఇప్ప‌టికి కుదిరింది. . అత‌నికి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అలా ఈ సినిమా కూడా ఉండ‌టానికి నావ‌ల్ల వీలైనంత సాయం చేస్తాను. ఇది మిలిట‌రీ క‌థ కాదు`` అని అన్నారు.

బీవీయ‌స్ ర‌వి మాట్లాడుతూ ``జ‌వాన్ అన‌గానే అంద‌రూ ఇది జ‌వాన్ల క‌థ అని అనుకుంటారు. కానీ మా క‌థ అది కాదు. మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడి క‌థ‌. కుటుంబానికి ఓ క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఆదుకోవ‌డానికి ఓ కుర్రాడు ఉండాలి. మా హీరో అలాంటి వ్య‌క్తి. ఇంటికొక‌డు అనేది మా సినిమాకు క్యాప్ష‌న్‌. దేశానికి జ‌వాన్ ఎంత ముఖ్య‌మో, ప్ర‌తి ఇంటికి ఇలాంటి ఒక కుర్రాడు ముఖ్యం. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా ఇది.
థ‌మ‌న్ మంచి సంగీతాన్నిచ్చారు`` అని అన్నారు.

థ‌మ‌న్ మాట్లాడుతూ ``మంచి సంగీతం కుదిరింది. ఈ చిత్ర నిర్మాత మాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. సాయితో మూడో సినిమా ఇది`` అని అన్నారు.

Śమాట్లాడుతూ ``రాజుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌విగారు, కృష్ణ‌గారి కాంబినేష‌న్‌లో చేస్తున్నాను. మంచి క‌థ‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రం. ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో గుహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కెమెరా: కె.వి.గుహ‌న్‌, సంగీతం: య‌స్‌.య‌స్‌.థ‌మ‌న్‌, ఆర్ట్: బ‌్ర‌హ్మ క‌డ‌లి, ఎడిటింగ్‌: య‌స్‌.ఆర్‌.శేఖ‌ర్‌, స‌హ ర‌చ‌యిత‌లు: క‌ల్యాణ్ వ‌ర్మ దండు, సాయికృష్ణ‌, వంశీ బ‌ల‌ప‌నూరి.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved