గణేష్ క్రియేషన్స్ పతాకంపై ` ఏ నిమిషానికి ఏమి జరుగునో` తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లో జరిగాయి. వినాయక్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షో టైమ్ స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రమిది. నాగ అన్వేష్ కథానాయకుడు. ప్రముఖ నాయిక హీరోయిన్గా నటించనుంది. లండన్ గణేశ్, సీహెచ్.వి.నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు భాస్కర్ సామల కెమెరాను నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం జరిగిన ప్రెస్మీట్లో
లండన్ గణేష్ మాట్లాడుతూ ``గణేశ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నాను. నాగ అన్వేష్ని చూస్తే బాలీవుడ్ హీరోని చూసినట్టు అనిపిస్తాడు. నేను బ్రిటిష్ సిటిజన్ని. లండన్‌లో ఉంటాను. అందుకే లండన్ గణేష్ అని పేరు పెట్టుకున్నాను. లండన్ అనేది నా ఇంటి పేరు కాదు. డిసెంబర్లో ఈ టీమ్‌ని కలిశాను. ఇప్పుడు ప్రారంభోత్సవం చేశాం. మా దర్శకుడికి సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు. డిఫరెంట్ సైఫై చిత్రమిది`` అని చెప్పారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ ``కథ నచ్చి ఈ సినిమాతో కొనసాగుతున్నాను. మూడు షెడ్యూళ్లలో సినిమాను పూర్తి చేస్తాం. ఒక షెడ్యూల్ సిటీలో, ఒక షెడ్యూల్ ఫారెస్ట్ లో, మరో షెడ్యూల్ లండన్‌లో ఉంటుంది`` అని అన్నారు.
హీరో మాట్లాడుతూ ``రెండు పార్ట్ లుగా కథ విన్నాను. వినగానే నచ్చింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో క్లైమాక్స్ వచ్చేవరకు అర్థం కాదు. అట్రాక్ట్ చేసే సినిమా అవుతుంది`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. మూడు షెడ్యూళ్లలో చేస్తాం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మూడు పాటలుంటాయి. వచ్చే నెల నుంచి సినిమాను మొదలుపెడతాం. `పుష్పక విమానం`, `ఆదిత్య 369` చిత్రాల తరహాలో ఉంటుంది`` అని తెలిపారు.