29 November 2017
Hyderabad
Actor Naga Shourya & Popular DOP Sai Sriram as Director has started new film under the banner Manyam Productions today. Anish Krishna (Director), VI Anand(Director), Upendhra (Director) has graced the ceremony while the Camera has switched on by Maruthi, clapped by Kona Venkat & Script given to Driector Sai Sriram by Kona Venkat & Maruthi Respectively.
Sai Sriram has worked as DOP for many popular films i.e Mem Vayasuku Vacham, Ala Ela, Supreme, Pilla Zamindar, Ekkadiki Pothavu Chinnavada, Chalo in past is now coming as a Director with this film. Radhan is composing the music, Cinematography is handling by Hari Prasad Jasthi, Dialogues written by Viswa Netra & the movie being produced by M. Vijay Kumar under Manyam Productions.
Regular shooting of the film will start from 1st week of January, Heroines of the film will be announced soon.
Cast & Crew:
Manyam Productions - Production No 1
Hero: Naga Shourya
Producer: M. Vijay Kumar
Director: Sai Sriram
Music: Radhan
DOP: Hari Prasad Jasthi
Editor: Praveen Pudi
Art: Ramanjaneyulu
Dialogues: Viswa Netra
Regular Shooting from 1st week of January.
నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం
యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి , రచయిత కోన వెంకట్ లు చిత్రం స్క్రిప్ట్ ను చిత్ర దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్,ఉపేంద్ర లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నం గా నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను నిర్మిస్తోంది. 'మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య 'ఛలో ' చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కదా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించు కుని ఉంటుందని తెలిపారాయన. చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: రధన్, కధ : విద్యాసాగర్ రాజు మాటలు: విశ్వ నేత్ర, డి.ఓ.పి: హరిప్రసాద్ జాస్తి, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: ప్రవీణ్ పూడి.
నిర్మాత: యం.విజయకుమార్
దర్శకత్వం: సాయి శ్రీరామ్