హరిక్రిష్ణా, అక్షిత హీరో హీరోయిన్లుగా జె.ఎస్.ఆర్.మూవీస్ బ్యానర్‌పై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, ఎం.ఎస్.రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``ఇదొక లవ్‌స్టోరీ. అంతా కొత్తవాళ్లతోనే మొదటిసారిగా చేస్తున్నాను. ఇప్పటి వరకు నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబు వంటి పెద్ద హీరోలతో చేశాను. ముందు కొత్తవాళ్లతో చేయడానికి భయపడ్డప్పటికీ శివ చెప్పిన కథ నచ్చడంతో రెడీ అయ్యాను. మా అబ్బాయి హరికృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నాను. రైటర్, టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అరకులో ఓ సాంగ్‌ను చిత్రీకరించాం. ఓ నిజమైన ఘటనను ఆధారంగా చేసుకుని దాని ఇన్స్పిరేషన్గా చేసుకుని చేస్తున్న సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఫీల్ గుడ్ మూవీ. ఈ నెల 25 నుండి 35 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తవుతుంది. ఫిభ్రవరిలో తుది మెరుగులు దిద్దుకుని మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
హీరో హరిక్రిష్ణా మాట్లాడుతూ - ``డిఫరెంట్ సబ్జెక్ట్. కథ వినగానే నచ్చింది. నాన్నగారు హీరో నన్ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. అందరూ ప్రోత్సాహం లభిస్తుండటంతో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను`` అన్నారు.
అక్షిత మాట్లాడుతూ - కొత్తవాళ్లతో సినిమా తీయడానికి ఆలోచించే ఈరోజుల్లో మాలాంటి కొత్తవారికి అవకాశం ఇచ్చిన జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారికి థాంక్స్`` అన్నారు.
Akshitha hot gallery frome the event
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య, కెమెరా మెన్ క్రిష్ణా జక్కుల, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.