వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ హీరోగా నూతన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం. 1 చిత్రం నవంబర్ 23న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్ర ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచాన్ చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందజేశారు. ఈ సన్నివేశానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ గౌరవ దర్శకత్వం, వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ (చినబాబు), అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ''లై' చిత్రం తర్వాత చేస్తోన్న చిత్రమిది. ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరితో ఈ చిత్రం తెరకెక్కుతోంది. న్యూ డైమెన్షన్ వున్న క్యారెక్టర్‌లో శర్వానంద్ నటిస్తున్నారు. కథ నచ్చి నా మీద నమ్మకంతో నా మిత్రులు ప్రసాద్, సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సూపర్‌హిట్ సినిమా తీస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తోంది. మిగతా ఆర్టిస్ట్‌ల వివరాలు త్వరలో తెలియజేస్తాం'' అన్నారు.
చిత్ర నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ - ''శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్‌లో మొదటి ప్రయత్నంగా ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని నిర్మిస్తున్నాం. శర్వానంద్‌తో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. హను మంచి టాలెంట్ వున్న డైరెక్టర్. ప్యూర్ లవ్‌స్టోరితో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చాలా కొత్తగా, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో హను ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మా బేనఱ్‌లో వస్తోన్న ఈ చిత్రం మంచి హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్మకంతో వున్నాం. త్వరలోనే ఆర్టిస్ట్‌ల్ని, టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మా చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన సినీ ప్రముఖులకూ, మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: హను రాఘవపూడి.