గోదా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం `శ్రీకరం శుభకరం నారాయణీయం`. ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా నటిస్తున్న నూతన చిత్రం గురువారం ఉదయం ప్రసాద్ ల్యాబ్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ సముద్రాల వేణుగోపాల చారి ఇవ్వగా, శ్రీమతి మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా...
దర్శక నిర్మాత కృష్ణ దేవ్ మాట్లాడుతూ ``ఇటీవల కాలం లో యూత్ ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వంటి మంచి కార్యాలు మరచి పెడద్రోవ పడుతున్నారు. ఈ చెడు మార్గాన్ని తప్పించి మంచి మార్గంలో పయనించేలా చేయడమే ఈ చిత్ర ముఖ్యాంశం. నవంబర్ నెలాఖరు నుంచి మొదలు పెట్టి జనవరి నెలాఖరులోగా చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం`` అని తెలిపారు.
ముఖ్య అతిథి సముద్రాల వేణుగోపాల్ మాట్లాడుతూ ``సంఘంలో పెరిగికోతున్న దూరాచారాల కు యూత్ దోహదపడుతోంది. ఈ ధోరణి మారాలనే భావనతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న దర్శక నిర్మాత కృష్ణ దేవ్ గారికి నా అభినందనలు తెలియ చేస్తున్నాను`` అన్నారు.
హీరో ప్రశాంత్ నిమ్మని మాట్లాడుతూ ``మంచి సబ్జెక్ట్ తో ముందుకు వస్తున్నాం, స్కోప్ ఉన్న చిత్రంలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసినందుకు దర్శకునికి నా కృతజ్ఞతలు`` అన్నారు.
హీరోయిన్ ఐంద్రిల్లా చక్రవర్తి మాట్లాడుతూ ``సోషల్ అండ్ మైత్లాజికల్ స్టోరీ, మొదటి సినిమాలోనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు`` అని అన్నారు.
సంగీత దర్శకుడు తారక రామారావు మాట్లాడుతూ ``భక్తి రక్తి కలసిన ఈ చిత్రంలో 7పాటలున్నాయి. సంగీతం బాగా కుదిరింది. జె యేసుదాస్, బాలు గారు కూడా ఈ చిత్రంలో పాడుతుండటం విశేషం`` అని తెలిపారు.
లిరిక్ రైటర్స్ రాజు, మధు సాల, కెమెరామెన్ నాయుడు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.
ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరాః మల్లేష్ నాయుడు, మ్యూజిక్ః తారక రామారావు, సాహిత్యంః మధు ఫలం, రాజు, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వంః వానమామలై కృష్ణదేవ్.