pizza
Vaallammayi movie launch
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. క్లాప్‌తో ప్రారంభమైన 'వాళ్లమ్మాయి'
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

8 December 2017
Hyderaba
d

Dynamic Lady Director Jaya B Clapped The Launch Of 'Vaallammayi'

Nikhil who acted as a child actor in films like 'Lovely','Uyyala-Jampala','Krishna Gaadi Veera Prema Gaadha','Baahubali' and 50 more films, is now turning into Hero with "Vaallammayi". Krishna Chaitanya is debuting as a Director with this film and Young Producer Praveen Siddhanth is Producing this film under 'Bhakthi Creations' Banner. This film launched on December 8th at Ramanaidu Studios in the presence of well wishers and Friends with a Pooja ceremony. Dynamic Lady Director Jaya B clapped for the Muhurtham shot on hero Nikhil and Successful Producer Raj Kandukuri has switched on the camera. Popular Choreographer Shekhar Directed this scene. On this occasion, a press meet was held.

Film Should Become A Good Success :
Dynamic Lady Director Jaya B says, " We auditioned many kids for the role of a child actor for our 'Lovely' film. At that time when we asked Nikhil to give a dance performance for a song, He danced splendidly for an entire song. We got impressed and selected him for the role of Hero Aadhi's childhood character. He is full of talent. He got introduced with lovely as a child actor and did more than 50 films. I am very happy to clap for his first film as a hero. New Directors are doing films with fresh thoughts and new concepts. I welcome such Directors with innovative ideas. Then only our Industry will flourish with quality films. All of us should encourage new talent. Kausalya is a very good singer. There is no doubt that she will give best music for this film. I wish this film will bring good name and fame for Producer and Director along with commercial success too."

More Films Like This Should Be Made
Popular Producer Raj Kandukuri says, "I know the story of this film. It is very interesting. Films like these are much needed for our society. Heroine characters are very strong in my films. Going by the title, This film also features a very strong heroine character. Film should become a big success. All the best to entire team."

Based On A Real Incident
Director Krishna Chaitanya says," This film is being made based on actual events happened at a place in 2001. When I narrated the story Producer Praveen liked it and gets excited produce this film. He believed in story and keeping his belief on me he came forward to produce this film. I don't say that this is a great film, but i am sure that this will deliver a very good message for our society. This film is well packed with all commercial elements. Everyone knows that how Ravana abducted Seetha and about her sufferings in lanka. This film is about how a Seetha is facing hardships with many Ravanas in our society. This film is about how an Youngster saved a girl who was tormented by evil people. This film comprises with Love, Sentiment and Emotions. This is my first film as a Director. I worked in Direction department for many Directors. I am confident that I will impress everyone with my film."

Story Of Every Girl
Producer Praveen Siddhanth says," When Director Krishna Chaitanya told me the story, I liked it instantly. This is a story of every girl. Along with commercial elements, we are trying to deliver a very good social message with this film. Regular shoot will start from December 25th at Hyderabad surrounding places and we will finish entire shooting part with a single schedule. We are planning to picturise songs in outdoor. We are confident that audiences will love this film for sure."

Subject Has Very Good Scope For Music
Music Director Kausalya says, " As a singer I crooned songs for many films. When I listened to the story I felt that there is a lot of scope for music in this film. Praveen garu is a tasteful Producer. He chose a very good subject for his film. Society needs films like this. I will give my best for such a good film with lady oriented subject. Thanks to Producer and Director for giving me this oppurtunity."

New Concept
Dialogue writer Kamal V.V. says, " There are many powerful women in our society. Everyone of them becoming successful in their respective fields by showing their talent and strengths. Likewise many women are working hard for the betterment of society. It is our responsibility to respect such women. Concept is about a girl, how she gets saved by a boy from bad people. Film has a very new concept."

Bhakthi Creations is producing this film with Nikhil as a Hero.

Dialogues : Kamal V.V.
Music : Kausalya
Camera : Murali Mohan Reddy
Choreography : Shekhar V.J.
Editing : Anand Pavan
Art : Peddi Raju
Executive Producer : Vinay, Siva Goud
Producer : Praveen Siddhanth
Story, Screenplay, Direction : Krishna Chaitanya

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. క్లాప్‌తో ప్రారంభమైన 'వాళ్లమ్మాయి'

'లవ్‌లీ' 'ఉయ్యాలా జంపాలా', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'బాహుబలి' వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్‌ దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించాడు. తొలిసారి నిఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్‌ పతాకంపై యువ నిర్మాత ప్రవీణ్‌ సిద్ధాంత్‌ నిర్మిస్తున్న చిత్రం 'వాళ్లమ్మాయి'. ఈ చిత్రం డిసెంబర్‌ 8న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో నిఖిల్‌ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికకి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి క్లాప్‌నివ్వగా, సక్సెస్‌ఫుల్‌ నిర్మాత రాజ్‌ కందుకూరి కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, నిర్మాత రాజ్‌ కందుకూరి, చిత్ర దర్శకుడు కృష్ణచైతన్య, నిర్మాత ప్రవీణ్‌ సిద్ధాంత్‌, మాటల రచయిత కమల్‌ వి.వి., సంగీత దర్శకురాలు కౌసల్య పాల్గొన్నారు.

సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలి!!
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''లవ్‌లీ' సినిమాకి ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ కావాలని చాలామందిని టెస్ట్‌ షూట్‌ చేశాం. ఆ టైమ్‌లో నిఖిల్‌ ఒక బిట్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేయమంటే టోటల్‌గా ఫుల్‌ సాంగ్‌కి ఎక్స్‌ట్రార్డినరీగా డ్యాన్స్‌ చేశాడు. మేమంతా ఇంప్రెస్‌ అయి నిఖిల్‌ని చిన్నప్పుడు ఆది క్యారెక్టర్‌కి సెలెక్ట్‌ చేశాం. చాలా టాలెంట్‌ వున్న కుర్రాడు. 'లవ్‌లీ'తో ఇంట్రడ్యూస్‌ అయి దాదాపు 50 సినిమాలకు పైగా బాల నటుడిగా చేశాడు. అలాంటి నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నేను క్లాప్‌ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. కొత్త డైరెక్టర్స్‌ అందరూ కొత్త కొత్త థాట్స్‌తో ముందుకు వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఇంకా మరెంతోమంది రావాలి. అప్పుడే మంచి కథలతో చిత్రాలు వస్తాయి. మనందరం కొత్తవారిని ప్రోత్సహించాలి. కౌసల్య మంచి గాయని. ఈ సినిమాకి మంచి సంగీతం అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్‌గా ఈ సినిమా మంచి సక్సెస్‌ అయి నిర్మాత, దర్శకులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.

ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి!!
ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''ఈ కథ విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలు రావాలి. నా సినిమాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌గా వుంటుంది. అలాగే ఈ సినిమా టైటిల్‌ చూస్తే హీరోయిన్‌ క్యారెక్టర్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా వుంటుందని అన్పిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

యదార్థ సంఘటన ఆధారంగా!!
చిత్ర దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ - ''2001లో ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథ చెప్పగానే మా నిర్మాత ప్రవీణ్‌ ఎంతో ఎగ్జైట్‌ అయి కథని నమ్మి నా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఇది గొప్ప సినిమా అవుతుంది అని చెప్పను గానీ, సమాజానికి ఉపయోగపడే మంచి మెస్సేజ్‌ వున్న చిత్రమని ఖచ్చితంగా చెప్పగలను. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో వుంటాయి. రావణుడు సీతను లంకకు తీసుకెళ్ళి ఎన్ని చిత్రహింసలకు గురిచేసాడో ఆ టైమ్‌లో సీత ఎన్ని కష్టాలు పడి నలిగిపోయిందో అందరికీ తెల్సు. ఈ సమాజంలో రావణాసురుల మధ్య నలిగిపోతున్న ఒక సీత కథే ఇది. దుర్మార్గుల బారినపడి నలిగిపోయిన అమ్మాయిని ఓ కుర్రాడు ఎలా సేవ్‌ చేశాడు? అనేది ఈ చిత్రం కాన్సెప్ట్‌. లవ్‌, సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వుంటాయి. దర్శకుడిగా ఇది నా ఫస్ట్‌ సినిమా. గతంలో చాలామంది డైరెక్టర్స్‌ వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాను. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీస్తానని నమ్మకంతో వున్నాను'' అన్నారు.

ప్రతి అమ్మాయి కథ ఇది!!
చిత్ర నిర్మాత ప్రవీణ్‌ సిద్ధాంత్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు కృష్ణచైతన్య చెప్పిన సబ్జెక్ట్‌ వినగానే బాగా నచ్చింది. ఇది ప్రతి అమ్మాయి కథ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి మంచి మెసేజ్‌ని ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నాం. డిసెంబర్‌ 25 నుండి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో చిత్రాన్ని ఫినిష్‌ చేస్తాం. పాటల్ని ఔట్‌డోర్‌లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం గ్యారెంటీగా నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం'' అన్నారు.

మ్యూజిక్‌కి స్కోప్‌ వున్న సబ్జెక్ట్‌!!
సంగీత దర్శకురాలు కౌసల్య మాట్లాడుతూ - ''గాయనిగా ఎన్నో చిత్రాలకు పాటలు పాడాను. ఈ కథ వినగానే మ్యూజిక్‌కి చాలా స్కోప్‌ వుందనిపించింది. నిర్మాత ప్రవీణ్‌గారు మంచి టేస్ట్‌ వున్న నిర్మాత. మంచి కథని ఎంచుకుని సినిమా చేస్తున్నారు. ఇలాంటి కథలు సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకి మంచి మ్యూజిక్‌ ఇవ్వడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి థాంక్స్‌'' అన్నారు.

కొత్త కాన్సెప్ట్‌!!
మాటల రచయిత కమల్‌ వి.వి. మాట్లాడుతూ - ''ప్రస్తుత సమాజంలో ఎంతోమంది శక్తివంతమైన స్త్రీలు వున్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి శాఖల్లో శక్తి, సామర్థ్యాలను చాటుతూ విజయాలు సాధిస్తున్నారు. అలాగే ఎంతోమంది స్త్రీలు సమాజం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాంటి స్త్రీలని గౌరవించుకోవడం మన బాధ్యత. ఒకమ్మాయిని కొందరి దుర్మార్గుల బారి నుండి ఒక కుర్రాడు ఎలా వారి నుండి ఎలా తప్పించాడు అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. ఇంతవరకూ రాని న్యూ సబ్జెక్ట్‌'' అన్నారు.

భక్తి క్రియేషన్స్‌ పతాకంపై నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కమల్‌ వి.వి, సంగీతం: కౌసల్య, కెమెరా: మురళి మోహన్‌ రెడ్డి, కొరియోగ్రఫీ: శేఖర్‌ వి.జె, ఎడిటింగ్‌: ఆనంద్‌ పవన్‌, ఆర్ట్‌: పెద్దిరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌, శివగౌడ్‌, నిర్మాత: ప్రవీణ్‌ సిద్ధాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణచైతన్య.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved