It's been an incredible journey of 10 years for young and handsome hero Nikhil Siddhartha in Telugu film industry. From super hit Happy Days in 2007 to killing hit Keshava in 2017, Nikhil invited all the directors from Sekhar Kammula to Sudheer Varma for the cake cutting function yesterday. He also threw a lavish party for his directors and also for media persons.
Nikhil started his journey with the successful film Happy Days where he played the role of Rajesh, an Engineering college student and son of an MLA. In fact, director Sekhar Kammula was stunned with Nikhil's energy levels while shooting for the film. Later, Nikhil proved his mass stamina with Parasuram directed 'Yuvatha'. He then introduced a wannabe director Chinni Krishna with Veedu Theda.
When Nikhil was in tough phase with flops, Sudheer Varma directed Swamy Ra Ra provided him much needed break. Post this film, he never looked back. Chandu Mondeti directed Karthikeya, Karthik Ghattamaneni directed Surya Vs Surya, VI Anand's Ekkadiki Pothavu Chinnavada and his most recent outing Keshava directed by Sudheer Varma are of different genres, but successful films.
Nikhil indeed gave life to many young and debutante directors. What's more, he has become care of address for directors with unique and experimental concepts. When almost all young heroes are not willing to come out of safe zone by doing only formulaic and commercial films, Nikhil is surprising audiences every time by picking different films.
Besides all the directors who worked with Nikhil, the event was also attended by mega hero Allu Sirish, actors Sathya and Praveen. Let's wish Nikhil all the best for his future endeavors.
పదేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నిఖిల్
హీరో నిఖిల్ తెలుగు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ..
హీరో నిఖిల్ మాట్లాడుతూ - ``2007లో హ్యాపీడేస్ చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశాను. అంతకు ముందు సినిమాల్లోకి రావాలనుకునేవాణ్ణి. చాలా సినిమాలకు ఆడిషన్‌కు వెళ్ళాను. ఆ సమయంలో హ్యాపీడేస్ ఆడిషన్ జరుగుతుందని తెలిసి వెళ్ళాను. సెలక్ట్ అయ్యాను. ఆ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావడంతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. శేఖర్ కమ్ములగారి వల్లే నేను ఇండస్ట్రీలోకి రాగలిగాను. నేనే కాదు, నాలాంటి ఎందరో కొత్తవారికి ఆయన సినిమాల్లో లైఫ్ ఇచ్చారు. తమన్నా, వరుణ్ సందేశ్ సహా చాలా మంది ఆ లిస్టులో ఉన్నారు. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్. అందుకే డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను`` అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ``నిఖిల్‌కు కంగ్రాట్స్. హ్యాపీడేస్‌లో తన అవసరముందని భావించి తనను సెలక్ట్ చేశాను. ఇన్ని ఏళ్ళు సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేస్తూ రావడం చాలా గొప్ప విషయం. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
పరుశురాం మాట్లాడుతూ - ``నిఖిల్ జర్నీ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ - ``శేఖర్‌గారు నిఖిల్‌కు లైఫ్ ఇస్తే, నాతో సహా ఇక్కడున్న కొత్త దర్శకులకు నిఖిల్ లైఫ్ ఇచ్చాడు. అందుకు తనకు గ్రేట్`` అన్నారు.
చందు మొండేటి మాట్లాడుతూ - ``నిఖిల్ హీరోగా కంటే నాకు మంచి స్నేహితుడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా కూడా పనిచేసింది నిఖిల్ సినిమాలకే. తను 50 కోట్ల హీరో స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
అభిషేక్ మాట్లాడుతూ - ``పదేళ్ళు జర్నీ సులభం కాదు. ఈ జర్నీలో కొత్తవాళ్ళను పరిచయం చేయడం. కొత్త సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇంకా చాలా మంచి కాన్సెప్ట్ చిత్రాలతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజా రవీందర్, సత్య తదితరులు హాజరయ్యారు.