స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈనెల 4వ తేదీన విడుదలైన నా పేరు సూర్య చిత్రంలో సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియన్ ఆర్మీ ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని సైనికులతో కలిసి అల్లు అర్జున్ వీక్షించారు. ఈ చిత్రం గురించి విని సూర్య పాత్ర చేసిన అల్లు అర్జున్ ని భారత సైనిక కుటుంబాలు కలిసి రోజ్ ఫ్లవర్ తో అభినందించారు.
ఇలాంటి చిత్రాలు తమలో మరింత స్ఫూర్తిని, రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తాయని , ఈ చిత్రంలో రియల్ సన్నివేశాలు నటులతో చాలా బాగా ఆకట్టుకునేలా చిత్రీకరించారని, మా డిసిప్లైన్ కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడికి మా అభినందనలు, ఆ పాత్రలో బోర్డల్ లో డ్యూటి చెయ్యాలి అను పరితపించేలా యంగ్ బ్లడ్ ఎలా వుంటుందో అల్లు అర్జున్ జీవించారు. మా అందరి నినాదాన్ని కేరక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే.. చావు రాక ముందే చచ్చిపోవడం అన్నామాట.. ఈ డైలాగ్ లో చూపించిన ఈ చిత్ర యూనిట్ కి మా ప్రత్యేఖ దన్యవాదాలు అని అధికారులు చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా.....
మేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ ప్రిమియర్ షోను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ కు చాలా చాలా థాంక్స్. ఎందుకంటే సోల్జర్స్ కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. కామన్ మ్యాన్ కి తెలియని చాలా విషయాల్ని ఇందులో టచ్ చేశారు. ఈ సినిమా లో పబ్ సీన్ లో వచ్చే సీన్ ఇండియా అంతా ఒక్కటే అని చూపించిన విధానం బాగుంది. అందరికి అర్దమవ్వాలి. భారతదేశం నాది అనుకున్న ప్రతిఓక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. బోర్డర్ లో ఓ సైనికుడు ఎంత ఇష్టపడి 125 కోట్ల మంది ప్రజల్ని కాపాడుతాడో సామాన్య ప్రజలకి తెలియాలి.. ఆర్మి అంటే దేశానిక గౌరవం అని తెలియాలి.. ఈ విషయాన్ని అందిరికి తెలిసేలా పాత్రలో జీవించిన అల్లు అర్జున్ ని మా ఆర్మి కి వెల్‌కం చెబుతున్నాం.. గతంలో మమ్మూట్టి, సచిన్ టెండూల్కర్, మహెంద్రసింగ్ ధోని లాంటి వారు కూడా దేశ సేవలో భాగస్వాములయ్యారు.. ఇలాంటి చిత్రంలో నటించిన అల్లు అర్జున్ కి హాట్సాఫ్.
అల్లు అర్జున్ మాట్లాడుతూ... నా ఇండియన్స్ అందరికి నమస్కారం. నా పేరు అల్లు అర్జున్ నా ఇల్లు ఇండియా.. ఈ చిత్రాన్ని నిజమైన సైన్యాధికారుల మధ్య, నిజమైన ఆర్మీ క్వార్టర్లలో చిత్రీకరించాం. మా తపనకి సహకారం అందించిన భారత సైన్యానికి నా కృతజ్ఞతలు. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను. ఒక సినిమా విజయవంతమైతే పేరొస్తుంది, డబ్బొస్తుంది. వాటిని మించి ఈ సినిమాతో నాకు చాలా గౌరవం లభించింది. నన్ను గర్వపడేలా చేసిన సినిమా ఇదే. చిత్రీకరణ కోసం ఆర్మీ క్వార్టర్లకి వెళ్లినప్పుడే ఆ వాతావరణాన్ని, ఆ జీవితాన్ని చూసి భారత సైన్యంలో చేరాలని దరఖాస్తు చేసుకొన్నా. అధికారులు ఆమోదం తెలపగానే గౌరవ సభ్యుడిగా సైన్యంలో చేరబోతున్నా. సైన్యాధికారుల్ని నేను మొట్ట మొదట కోరుకొన్నది అదే. నా కెరీర్ లో నేను గర్వపడే సినిమా ఇది. థాంక్స్ టూ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి థాంక్స్. జైహింద్ అని అన్నారు.
దర్శకుడు వక్కంతం వంశి మాట్లాడుతూ.. నేను ఈ చిత్ర కథ రాయటానికి భారతదేశ సైనికులు మాత్రమే.. నా సినిమా పరిదిలో మీ గురించి ఎంత వరకూ చూపించగలనొ అంతవరకే చూపించాను. ఈ రోజు ఇంత మంది రియల్ హీరోస్ మా చిత్రాన్ని చూసి అభినందిస్తుంటే ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అనే ఆనందం రెట్టింపవుతుంది. మరోక్కసారి భారతదేశ సైనికులందరికి మా అభినందనలు.. ఇలాంటి మంచి చిత్రాలు ఆదరించటం వలన మన సూపర్‌స్టార్స్ నుండి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. మంచి చిత్రాలు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే వుంటారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న భారతీయులందరికి మరోక్కసారి నా ప్రత్యేఖ ధన్యవాదాలు. అని అన్నారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ముందుగా రియల్ హీరోస్ మద్యలో చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా వుంది. మా చిత్రం విడుదలయ్యిన దగ్గర నుండి ఆంద్రప్రధేశ్, తెలంగాణా లోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో అద్బుతంగా ముందుకు వెలుతుంది. మనకోసం భారత సరిహద్దులో అహర్నిశలు మనకొసం కాపాలా కాసే సైనికుడు జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మా దర్శకుడు. ఆ పాత్రలో జీవించాడు మా హీరో అల్లు అర్జున్ వీరి కృషి కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. మా బ్యానర్ లో గర్వించదగ్గ చిత్రం గా నిలబడిపోతుంది. అని అన్నారు