pizza
Anando Brahma pre release function
`ఆనందో బ్ర‌హ్మ` ప్రీ రిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2017
Hyderaba
d

70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తాప్సీ ప‌న్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, , ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `ఆనందో బ్ర‌హ్మ‌`. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్‌, తాగుబోతు రమేష్‌, రాజీవ్‌ కనకాల, శశాంక్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్‌ సీడీని ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

వెన్నెలకిషోర్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. రేపు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో పగలు దెయ్యానికి భయపడుతూ రాత్రి తొమ్మిది తర్వాత దెయ్యాన్ని నేను భయపెట్టే క్యారెక్టర్‌లో కనిపిస్తాను'' అన్నారు.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు సిద్ధు. మహిగారు మంచి క్యారెక్టర్‌ను రాశారు. విజయ్‌గారు సినిమా ప్రమోషన్‌లో కేర్‌ తీసుకుని చేస్తున్నారు'' అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ - ''మహి వెరీగుడ్‌ డైరెక్టర్‌. విజయ్‌గారు సినిమాను చక్కగా నిర్మించారు. సినిమా ఆగస్ట్‌ 18న విడుదలకానుంది'' అన్నారు. ''సినిమాలో మ్యూజిక్‌ పరంగా ఎక్స్‌పెరిమెంట్స్‌ చేసే అవకాశాన్ని కలిగించిన దర్శకుడు మహి, నిర్మాత విజయ్‌గారికి థాంక్స్‌. సినిమా కోసం చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ -''మనిషి అనేవాడు శరీరం, ఆత్మ కలయిల, ఘోస్ట్‌ అనేది శరీరం లేని ఆత్మ. అందువల్ల ఘోస్ట్‌ ఎలా ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదని అనుకుంటాను. అలాగే నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు. విజయ్‌, శశిలకు థాంక్స్‌. తాప్సీ లేకుండా ఈ సినిమా వీలైయ్యేది కాదు. ఇతర టీం మెంబర్స్‌కు థాంక్స్‌'' అన్నారు.

శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ - ''నిర్మాత విజయ్‌కు నేను వరుసకి బాబాయ్‌ అవుతాను. నాకు తెలిసినప్పటి నుండి విజయ్‌కి సినిమాలంటే ఎంతో ప్యాషన్‌. తను సినిమాల్లోకి వస్తాడేమోనని అనుకునేవాడిని. ఓ రోజు నాకు ఫోన్‌ చేసి ఈరోజు నన్ను వచ్చి కలుస్తానని అన్నాడు. వచ్చి నిర్మాత కావాలని అనుకుంటున్నానని నాతో అన్నాడు. ఫిలింమేకింగ్‌ అనేది లెక్కలతో కాకుండా హృదయంతో చేయాల్సిన పని. అది అందరూ చేయలేరు. అందరూ చేయలేరని చెప్పాను. నిర్మాణం అనేది డిఫరెంట్‌ లైన్‌ అని చెప్పాను. కానీ విజయ్‌ నేను నిర్మాతగా ప్రూవ్‌ చేసుకోవాలి. లేకుంటే నాకు నిద్ర పట్టదు. ఒకవేళ నేను సక్సెస్‌ కాకపోతే వెనక్కివెళ్లిపోతానని అన్నాడు. భలే మంచి రోజు నిర్మించాడు. ఆ సినిమా విడుదల రోజు నేను చాలా టెన్షన్‌ పడ్డాను. సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. ఈ సినిమా నిర్మించేటప్పుడు కూడా నన్ను కలిసి ఈ కథను చెప్పాడు. టీజర్‌ చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ట్రైలర్‌ చూసి కచ్చితంగా సినిమా సక్సెస్‌ కొట్టేస్తుందని నమ్మాను. ఈరోజు సినిమాలోని అన్ని క్యారెక్టర్స్‌ చూశాను. తిరుగులేని సక్సెస్‌ అవుతుందనడంలో సందేహం లేదు. విజయ్‌, శశి ఇలాంటి సక్సెస్‌లు వరుసగా సాధించాలి. ప్రభాస్‌ వీరిని పిలిచి డేట్స్‌ ఇచ్చి
సినిమా చేయాలి'' అన్నారు.

Taapsee gallery from the event

సుధీర్‌బాబు మాట్లాడుతూ - ''నేను ,విజయ్‌ కాలేజ్‌ ఫ్రెండ్స్‌. విజయ్‌కు సినిమాల గురించి అప్పట్లోనే మంచి నాలెడ్జ్‌ ఉండేది. ముందు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత భలేమంచిరోజు సినిమాతో విజయ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథాచిత్రమ్‌ తర్వాత హారర్‌ కామెడి జోనర్‌ సినిమాలతో చాలా మంది సినిమాలు చేస్తామని వచ్చారు. ప్రేమకథాచిత్రమ్‌ పార్ట్‌2 తీద్దామని డిస్కషన్స్‌ కూడా జరిగాయి. అయితే ప్రేమకథాచిత్రమ్‌ రేంజ్‌ కామెడి ఉంటే తప్ప ఆ జోనర్‌ మూవీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. విజయ్‌, శశి హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నారనగానే కాస్తా భయమేసింది. కానీ వారికి ఎలాంటి కథలను సెలక్ట్‌ చేసుకోవాలో బాగా తెలుసు. సినిమా అంతా పూర్తయిన తర్వాత విజయ్‌ నన్ను సినిమా చూడమని చెప్పాడు. చూసిన తర్వాత ప్రేమకథాచిత్రమ్‌ కంటే సినిమా బావుంది. ప్రేమకథాచిత్రమ్‌ను ప్రేమిస్తే, ఈ సినిమాను ప్రేక్షకులు పెళ్లి చేసుకునేంత బాగా ఉంది. నాకు ఈ సినిమా కథ ముందుగానే చెప్పి ఉంటే ప్రేమకథాచిత్రమ్‌ 2గా సినిమా చేసుండేవాడిని. మహి సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సినిమాను రేపు థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నలుగురు హీరోలతో కలిసి చేసిన సినిమా ఆగస్టు 18న థియేటర్స్‌లో సందడి చేయనుంది'' అన్నారు.

ప్రభాస్‌ మాట్లాడుతూ - ''ఫస్ట్‌టైమ్‌ ఇండియన్‌ సినిమాలో ఓ దెయ్యం మనుషులకు భయపడం అనే కాన్సెప్ట్‌తో సినిమా రావడం. చాలా కొత్తగా ఉంది. ఆసక్తికరంగా ఉంది. తాప్సీ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ దెయ్యంగా నటించనుంది. మహిగారి కాన్సెప్ట్‌ బావుంది. విజయ్‌ ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడుతాడు. విజయ్‌, శశిలకు అభినందనలు. బెస్ట్‌ యాక్టర్స్‌ అందరూ ఇందులో నటించారు. ఆగస్టు 18న సినిమా విడుదలవుతుంది. సినిమా గురించి మంచి టాక్‌ వింటున్నాను. సినిమా సక్సెస్‌ తర్వాత నిర్మాత విజయ్‌ పార్టీ ఇవ్వాలి'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved