బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన 'దండుపాళ్యం2' కూడా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్ అయింది. 'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా 'దండుపాళ్యం 3' చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో విఐ ఆనంద్, పరుచూరి గోపాలకృష్ణ, చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజు, లయన్ కిరణ్, డానీ, కుట్టప్ప, సునీత, కోటి, బెక్కం వేణుగోపాల్, మల్కాపురం శివకుమార్, హరి సుబ్బు, ముని, ప్రసన్న, సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్, ఎడిటర్ రవిచంద్రన్, జయదేవ్, నక్కిన త్రినాథరావు, నిర్మాతలు శ్రీనివాస్ మీసాల, సాయికృష్ణ పెండ్యాల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడియో సీడీలను లయన్ కిరణ్ విడుదల చేశారు.
డానీ మాట్లాడుతూ - ``దండుపాళ్యం అనేది పెద్ద జర్నీ. మూడు సిరీస్‌లు చేయడం అంత చిన్న విషయం కాదు. తప్పకుండా సినిమా రాక్ చేస్తుంది`` అన్నారు.
కోటి మాట్లాడుతూ -`` నేను పార్ట్ 1లో యాడ్ చేయలేదు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలనే ఆలోచన కలిగింది. డైరెక్టర్‌గారిని కలిశాను. అన్నట్లుగానే పార్ట్ 2, 3ల్లో నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా పార్ట్ 3 అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
సునీత మాట్లాడుతూ - ``నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్‌గారికి థాంక్స్`` అన్నారు.
జయదేవ్ మాట్లాడుతూ - ``నాపై నమ్మకంతో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్‌గారికి థాంక్స్. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న నిర్మాతగారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ - ``100%లవ్ తర్వాత నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. కథ విన్న తర్వాత అసలు సినిమాటోగ్రఫీ ఎలా అందించాలో నాకు తెలియలేదు. శ్రీనివాసరాజుగారితో మాట్లాడిన తర్వాత ఆయన ఆలోచనల మేర చేస్తూ వచ్చాను. పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యింది. పార్ట్ 2 చేస్తారని అనుకోలేదు. అయితే డైరెక్టర్ శ్రీనివాస్‌గారు పార్ట్ 2తో ట్రెండ్ క్రియేట్ చేశారు. పార్ట్ 3 చేస్తారని అనుకోలేదు. కానీ డైరెక్టర్‌గారు మూడో పార్ట్‌ను కూడా పూర్తి చేశారు`` అన్నారు.
ఎడిటర్ రవిచంద్రన్ మాట్లాడుతూ - ``అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ``ఓ జోనర్ సినిమా అయినా.. మనం తీసే ఎమోషన్‌ను బట్టే ఆడియెన్ సినిమాకు కనెక్ట్ అవుతాడు. ఇక దండుపాళ్యం సినిమా విషయానికి వస్తే.. ఎవరైనా బయట కొత్తగా కనపడితే భయమేసేది. నటీనటులు అంతగా భయపెట్టారు. రెండు సక్సెస్‌ఫుల్ సీక్వెల్స్ చేశారు. త్వరలో రాబోతున్న మూడో సీక్వెల్ పెద్ద సక్సెస్‌ను సాధించాలి`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ``మేము, శ్రీనివాసరాజుగారి కలిసి ఓ సినిమాకు పనిచేస్తున్నాం. అందుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ సమయంలో ఆయనకు సినిమాపై ఉన్న అవగాహన అర్థమైంది. ఇక దండుపాళ్యం విషయానికి వస్తే.. ఓ హిట్ సినిమాకు సీక్వెల్ ఆడింది లేదు. కానీ దండు పాళ్యం విషయంలో అది తప్పని రుజువైంది. ఇప్పుడు దండు పాళ్యం రెండు భాగాలు విడుదలైయ్యాయి... మంచి హిట్‌ను సాధించాయి. విడుదల కాబోయే మూడో పార్ట్ రెండు పార్టులను మించి హిట్ అవుతుంది`` అన్నారు.
లయన్ కిరణ్ మాట్లాడుతూ - ``దండుపాళ్యం అనే పేరే ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాకు చెందిన మూడు పార్టు విడుదల కానుందంటే.. ఆ సినిమా గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మొదటి రెండు భాగాలను మూడో పార్ట్ బీట్ చేస్తుందని నమ్మకం ఉంది. దర్శకుడు శ్రీనివాసరాజుగారు సహా టీంకు అభినందనలు. నిర్మాతలకు సినిమా పెద్ద హిట్ సినిమాగా మంచి పేరు తెస్తుంది`` అన్నారు.
విఐ ఆనంద్ మాట్లాడుతూ - ``నేను దండుపాళ్యంకు నేను పెద్ద ప్యాన్‌ని. ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. డైరెక్టర్ విజన్‌ను ఫాలో అయ్యే మంచి టీం దొరికింది. మూడు పార్టులు చేయడం అంత చిన్న విషయం కాదు. మరో మూడు పార్టులు కూడా చేయాలని ఎదురుచూస్తున్నాం. మా లాంటి యువ దర్శకులకు దండు పాళ్యం ఇన్‌స్పిరేషన్`` అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ``ఈ సినిమా తర్వాత మరో రెండు, మూడేళ్ల వరకు ఈ జోనర్‌లో సినిమాలు చేయను. మూడు పార్టులకు కొంత మంది నటీనటులే తప్ప మిగతా అందరూ వారే నటించారు. అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సిరీస్ నాతో పాటు బాగా కష్టపడ్డ వ్యక్తి మాటలు రాసిన రమేష్ గారు, ఎడిటర్ రవిచంద్రన్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందరికీ థాంక్స్. ఈ సినిమాకు సంబంధించి నేను మళ్లీ మరో పార్ట్ చేయను. నా నటీనటులకు, టెక్నీషియన్స్‌థాంక్స్`` అన్నారు.
పూజా గాంధీ మాట్లాడుతూ - ``ఆరేడేళ్ల జర్నీ. టీం అందరం చాలా కష్టపడ్డాం. ఇందులో నెగిటివ్ రోల్ చేశాను. మమ్మల్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేశారు కాబట్టే మూడో పార్ట్ వరకు సినిమాలు చేయగలిగాం. మంచి టీంను మిస్ అవుతున్నాను. దర్శకుడు శ్రీనివాసరాజుగారికి థాంక్స్`` అన్నారు.
రవి కాలే మాట్లాడుతూ ``నా దర్శక నిర్మాతలకు థాంక్స్. ఐదారేళ్లు కలిసి పనిచేసిన మా టీంకు థాంక్స్`` అన్నారు.
మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ - ``ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. పార్ట్ వన్ సాహసంతో కూడిన ప్రయాణం. దాని కారణంగానే రెండో పార్ట్‌ను కూడా చేయగలిగాం. మూడో పార్ట్ తో మా ప్రయాణం ముగిసింది. ఐదారేళ్లు అందరం కలిసి ప్రయాణించడం గొప్పగా అనిపించింది. గొప్ప గొప్ప నటీనటులతో కలిసి పనిచేశాం. దర్శకుడు శ్రీనివాసరాజు గురించి మాట్లాడాలంటే మాటలు లేవు. తన కష్టమెంతో తెలుస్తుంది`` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్: రవిచంద్రన్, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.