యూత్ కింగ్ అఖిల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, 'మనం' ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫీల్‌గుడ్ ఫ్యామిలీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హలో'. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సింగ్ అండ్ డాన్స్ విత్ అఖిల్ సెలబ్రేషన్స్ బుధవారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌లో సినిమా సాంగ్స్‌తో పాటు ఎమోషనల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో అఖిల్ సినిమాలోని పాటలను పాడటమే కాకుండా లైవ్ డాన్స్ పెర్ఫామెన్స్ చేయడం విశేషం. ఈ ఫంక్షన్‌కి భారీ ఎత్తున అక్కినేని అభిమానులు, మెగాభిమానులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి అఖిల్‌కు అభినందనలు తెలిపారు. అక్కినేని అఖిల్..మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యువ సామ్రాట్ నాగచైతన్య, సమంతలను ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించగా..మెగాస్టార్ చిరంజీవి, కింగ్‌నాగార్జునలను మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ - ''ఈ ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో పాటు అక్కినేని నాగచైతన్య, సమంతలకు థాంక్స్. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన అక్కినేని నాగార్జున, అమలగారికి థాంక్స్. అనూప్, పి.ఎస్.వినోద్, రాజీవన్, సుప్రియ, సహా అన్నపూర్ణ టీమ్ నా వెనుక అండగా నిలబడ్డారు. వారు నా వెనుక లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది'' అన్నారు.
కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ - ''ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిజీ అయ్యాను. మళ్లీ హైదరాబాద్‌లోనే ప్రమోషన్స్‌ను పూర్తి చేయడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ నాకెంతో ఇష్టమైన సిటీ. ఈ నగరం ఎన్నో ప్రేమకథలను చూసుంటుంది. అలాంటి ప్రేమకథే మా సినిమా. సినిమా చూస్తున్నప్పుడు అందరికీ వారి ప్రేమ ప్రయాణం గుర్తుకు వస్తుంది. అందరూ ఓ టీమ్‌గా పనిచేస్తేనే ఇంత మంచి సినిమా చేయగలిగాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ - ''హలో' సినిమా డిసెంబర్ 22న విడుదలవుతుంది. మాకు తెలిసిన అఖిల్‌ను విక్రమ్ కుమార్ తెరపై చూపించబోతున్నారు. మీ నాన్న అందం, స్టయిల్, మీ అమ్మ గ్రేస్ నీలో ఎక్కువగా ఉంటుంది. విక్రమ్‌గారు నాకు ఫేవరేట్ డైరెక్టర్. ఆయన సినిమాను చూడాలని అభిమానిగా వెయిట్ చేస్తున్నాను. అనూప్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసాడు. అన్నపూర్ణ టీం నుండి మరో బ్లాక్ బస్టర్ వస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ''అఖిల్ డాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడు. ఒక అన్నయ్య, ఫ్యాన్‌గా అఖిల్‌ను ఫీల్ గుడ్ మూవీలో చూడాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. నేను సినిమా చూశాను. చాలా ఆనందమేసింది. రేపు సినిమా చూశాక అఖిల్ ఎంటో అందరికీ తెలుస్తుంది. విక్రమ్ నా ఫేవరేట్ డైరెక్టర్. అఖిల్‌ను ఎంతో బాగా చూపించారు. రాజీవన్, వినోద్, అనూప్ సహా అందరూ అఖిల్‌కు గుర్తుండిపోయే హిట్ ఇవ్వాలని ప్రయత్నించారు. దానికి సమాధానమే ఈ సినిమా. అభిమానుల కలలు తీరే రోజు డిసెంబర్ 22'' అన్నారు.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ - ''ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు, కెరీర్ ఇచ్చినందుకు, అర్థం చేసుకునే భార్యను, గొప్ప తండ్రిని ఇచ్చినందుకు ప్రతిరోజూ ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూనే ఉంటాను. వాళ్లు మన నుండి ఏమీ ఆశించరు. మనం హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ఉంటే చాలని అనుకుంటారు. ఈ సినిమా తర్వాత తండ్రిగా నాగార్జునగారు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఈ సినిమాకు బెస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. నాన్నగారు సినిమా చూసి రోజంతా సినిమా గురించే మాట్లాడారు'' అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''చాలా తృప్తిగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే..టెక్నిషియన్స్ గురించి చెప్పాలి. తనకు మా ఫ్యామిలీ ఎంత రుణపడి ఉన్నామో తెలియదు. ఈ విషయం తనకు ఎన్నో సార్లు చెప్పాను. మనం తర్వాత హలో వంటి బ్యూటీఫుల్ మూవీస్ ఇచ్చాడు. కెమెరామెన్ పి.ఎస్.వినోద్‌గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌గారికి థాంక్స్. కల్యాణికి థాంక్స్. అన్నపూర్ణ టీం ఎంతో ప్రేమతో ఈ సినిమాను చేశారు. చిరంజీవిగారి ఇంటికి వెళ్లి ఆయన్ను ఆహ్వానించగానే, ఎక్కడికి రమ్మంటావో చెప్పు..అని అడిగారు. అయితే నేను ముందు ఆయన్ను సినిమా చూడమని చెప్పాను. ఆయన ఈ రోజు పొద్దునే సినిమా చూశారు. ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే రామ్‌చరణ్‌ను అఖిల్ పెద్దన్నయ్య అని పిలుస్తున్నాడు. అది వినడానికి ఎంతో బావుంది. చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. అలాగే సమంతకి కూడా థాంక్స్. అఖిల్ పెర్ఫామెన్స్ చూస్తుంటే నా కడుపు నిడిపోతుంది. కొడితే సిక్స్ కొట్టాలి'' అన్నారు.
అక్కినేని అమల మాట్లాడుతూ - ''చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మీలాగే డిసెంబర్ 22 కోసం వెయిట్ చేస్తున్నాను. అఖిల్, కల్యాణి సహా టీంకు అభినందనలు'' అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ''నాగార్జునగారు ఆహ్వానించగానే, నా కుటుంబ ఫంక్షన్‌లా భావించి వచ్చాను. హలో టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎవరికీ వచ్చిందో నాకు తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పలికే టైటిల్ పెట్టినందుకు వారిని అభినందించాల్సిందే. హలోకి, అక్కినేని ఫ్యామిలీకి అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో హలో హలో అమ్మాయి పాత రోజులు మారాయి..అనే టీజింగ్ సాంగ్‌ను అలపించారు. ఆ పాటను ఇంకా మనం మరచిపోలేదు. తర్వాత హలో గురూ..నాగార్జున..అమలను టీజ్ చేస్తూ పాడారు. అలాగే హలో బ్రదర్ సినిమాలో నాగార్జునగారు నటించారు. ఇప్పుడు ఈ హలో సినిమా ద్వారా అఖిల్ మనల్ని పలకరించడానికి వస్తున్నాడు. ఈరోజు ఉదయం సినిమా చూశాను. సినిమాను రిలీజ్ కాకముందు చూడటమనేది పెద్ద పరీక్షలాంటిది. సినిమా ఎలాఉందనే విషయంలో అబద్ధం ఆడలేము. లేనిది కల్పించి చెప్పలేం. కానీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిందేంటంటే..ఇదొక క్లీన్ ఫిలిం. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు నీట్‌గా తీసుకొచ్చారు దర్శకుడు విక్రమ్. తనకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావుగారి చివరి 'మనం' సినిమాను విక్రమ్ ఉంత బాగా తీశారో..మరో కోణంలో 'హలో' సినిమాను చక్కటి లవ్‌స్టోరీగా తెరకెక్కించారు. కేవలం యూత్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చే చిత్రమవుతుంది. అభిమానులకు కావాల్సిన యాక్షన్, ఛేజింగ్‌లున్నాయి. పార్కొవర్ అనే కొత్త విన్యాసం..ఎక్కడో ఫ్రాన్స్‌లో మొదలైంది. దాన్ని ఈ సినిమాలో చక్కగా డిజైన్ చేశారు. మాస్‌ను కూడా సినిమా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. అఖల్ పెర్ఫామెన్స్‌ను చూస్తే..ఈ కుర్రాడికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చిందని అనుకున్నాను. అలాగే సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. సెంటిమెంట్ సన్నివేశాలను అఖిల్ నటన మెప్పిస్తుంది. నాకే కాదు..ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే సినిమా అవుతుందని ష్యూర్‌గా చెబుతున్నాను. అఖిల్‌లో తాతగారి జీన్స్ ఉంది. తనకి డాన్స్ చేయడం ఆయన నుండే వచ్చింది. ఈరోజు ఇంత పెద్ద లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఏ హీరో ఎక్కడా సౌత్‌లో చేయని విధంగా తను పెర్‌ఫామ్ చేసి..ఈ ఫంక్షన్‌ను ఆర్టిస్ట్ మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. తాతగారిని, నాన్నగారిని మించిన నటుడు కావాలని ఎవరు కోరుకోరో చెప్పండి. చైతన్య కూడా..నా తమ్ముడు ఎదుగుతుంటే నాకే కదా ఆనందం అనేంత హెల్దీ వాతావరణం ఇక్కడ కనపడుతుంది. ఈ సినిమాలో అఖిల్ డాన్సులు చాలా గ్రేస్ ఫుల్‌గా చేశాడు. అంతే కాకుండా సినిమాలో ఓ పాట పాడి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఇలా తాత కంటే, నాన్న కంటే, అన్న కంటే ఓ మెట్టు పైకెదిగాడు. ఇది చూసి అందరూ గర్వపడతారని చెప్పగలను. ఈ సినిమా డెస్టిని మీద ఆధారపడిన కాన్సెప్ట్‌తో తీసింది. కల్యాణి ఎంతో క్యూట్‌గా, సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. జగపతిబాబు, రమ్యకృష్ణగారు సినిమాకు హుందాతనాన్ని తెచ్చిపెడితే, మిగిలిన నటులందరూ కలిసి సినిమాకు ఓ పరిపూర్ణత్వాన్ని తెచ్చి పెట్టారు. అనూప్ మంచి సంగీతాన్ని అందించాడు. లైఫ్ టైమ్ నిలిచిపోయే సంగీతాన్ని అందించాడు. వినోద్ సినిమాటోగ్రఫీ ఎంతో బావుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నిషియన్‌కి నా అభినందనలు. సినిమా సక్సెస్‌ను కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు అఖిల్'' అన్నారు.